Coaching in BC Study Circles : తెలంగాణ రాష్ట్రంలో బీసీ నిరుద్యోగ అభ్యర్థుల సౌకర్యార్థం ప్రభుత్వం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ స్టడీ సర్కిళ్ల (BC Study Circles)లో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. టీఎస్ పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్-3, 4 ఉద్యోగ పరీక్షలకు అలాగే, డీఎస్సీ, గురుకులం టీచర్ ఉద్యోగ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (Backward Classes Welfare Department) నోటిఫికేషన్ జారీ చేసింది. శిక్షణ సెప్టెంబర్ 01వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. 90 రోజుల పాటు ఈ శిక్షణ కొనసాగుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Eligibility
- డిగ్రీ పూర్తిచేసిన బీసీ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
- గూప్-3, 4 శిక్షణ కోసం అభ్యర్థులు పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- డీఎస్సీ, గురుకులం టీచర్ ఉద్యోగ పరీక్షల శిక్షణ కోసం అభ్యర్థులు బీఈడీ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
Mode of Selection
అభ్యర్థుల విద్యార్హత పరీక్ష (డిగ్రీ, బీఈడీ)లలో వచ్చిన మార్కులు, సంబంధిత స్టడీ సర్కిళ్లలోని సీట్ల లభ్యత ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు తెలంగాణ స్టడీ సర్కిల్స్ కు చెందిన వెబ్ సైట్ (https://studycircle.cgg.gov.in/) ను ఓపెన్ చేయాలి. అందులో Backward Classes Welfare Department పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Apply Online పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలన్నీ పూరించాలి.
పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, ఆధార్ కార్డ్ నెంబర్, నేటివ్ జిల్లా, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, దివ్యాంగులా?, అనాథలా? కులం, తండ్రి/గార్డియన్ వార్షిక ఆదాయం, విద్యార్హతలు, శిక్షణ తీసుకోబోయే అంశం తదితర వివరాలు ఎంటర్ చేయాలి.
అలాగే, అభ్యర్థి చిరునామా, పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన సంవత్సరం, సాధించిన మార్కులు, పర్సంటేజీ, చదివిన సంస్థ, బోర్డు తదితర వివరాలు తెలియజేయాలి.
అనంతరం ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. అభ్యర్థి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
2. అభ్యర్థి సంతకం
3. కులం సర్టిఫికెట్
4. ఇటీవలే తీసుకున్న ఆదాయం సర్టిఫికెట్
5. పదో తరగతి మెమో
6. ఇంటర్మీడియట్/ డిప్లొమా సర్టిఫికెట్
7. డిగ్రీ మెమో
8. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్
9. నేటివిటీ సర్టిఫికెట్
10. ఆధార్ కార్డ్
పై అన్ని సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
Important Points
- ప్రస్తుతం రెగ్యులర్ కోర్సు చేస్తున్న విద్యార్థులు, ఏదైనా కేడర్ లో ఏదైనా పోస్ట్ లో పనిచేస్తున్న వ్యక్తులు ఈ శిక్షణకు అనర్హులు.
- ఇంతకు ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ స్టడీ సర్కిళ్లలో ఉచితంగా శిక్షణ పొందిన వారు దరఖాస్తు చేసుకోకూడదు.
- ఇప్పటికే బీసీ స్టడీ సర్కిళ్లలో నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.
Important Dates
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ : ఆగస్టు 25, 2022
ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన : ఆగస్టు 27, 2022
శిక్షణ ప్రారంభం : సెప్టెంబర్ 01, 2022
వివరాల కోసం హైదరాబాద్ లోని బీసీ స్టడీ సర్కిల్ ఫోన్ నెంబర్
040-24071178, టోల్ ఫ్రీ నెంబర్ 18004250039 ను సంప్రదించవచ్చు.
– Coaching in BC Study Circles