Teacher Jobs in Siddipet KVA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Teacher Jobs in Siddipet KV : సిద్దిపేటలోని కేంద్రీయ విద్యాలయం (Kendriya Vidyalaya Siddipet)లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), స్పెషల్ ఎడ్యుకేటర్ (Special Educator) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

Details of Posts

1. Trained Graduate Teacher (TGT)
a. TGT (Sanskrit)
b. TGT (Hindi)
c. TGT (English)
d. TGT (Social Studies)
e. TGT (Maths)
f. TGT (Science)

2. Primary Teacher
3. Special Educator

TGT Qualifications

  • NCERT యొక్క రీజినల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో సంబంధిత సబ్జెక్టు లో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు 50 శాతం మార్కులతో పాసైన వారు, లేదా సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
  • TGT (Sanskrit) : గ్రాడ్యుయేషన్ లో మూడు సంవత్సరాలు సంస్కృతంను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
  • TGT (Hindi) : గ్రాడ్యుయేషన్ లో మూడు సంవత్సరాలు హిందీని ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
  • TGT (English) : గ్రాడ్యుయేషన్ లో మూడు సంవత్సరాలు ఇంగ్లిష్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
  • TGT (Social Studies) : గ్రాడ్యుయేషన్ లో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ లలో ఏవైనా రెండు సబ్జెక్టులను చదివి ఉండాలి. లేదా హిస్టరీ లేదా జియోగ్రఫీ చదివి ఉండాలి.
  • TGT (Maths) : ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, స్టాటిస్టిక్స్ సబ్జెక్టులలో ఏవైనా రెండు సబ్జెక్టులతో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
  • TGT (Science) : బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
  • NCTE ద్వారా రూపొందించబడిన మార్గదర్శకాలకు అనుగుణంగా CBSE నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) ఉత్తీర్ణులై ఉండాలి.
  • హిందీ మరియు ఇంగ్లిష్ భాషలలో బోధించే నైపుణ్యం ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం.

Primary Teacher

  • 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పాసై, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా చేసిన వారు. లేదా నాలుగు సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (B.El.Ed) చేసిన వారు, లేదా రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన వారు, లేదా గ్రాడ్యుయేషన్ తో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) చేసిన వారు అర్హులు.
  • హిందీ మరియు ఇంగ్లిష్ భాషలలో బోధించే నైపుణ్యం ఉండాలి.
  • కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం.

Special Educator

  • స్పెషల్ ఎడ్యుకేషన్లో B.Ed లేదా D.Ed చేసిన వారు అర్హులు.
  • ప్రాథమిక మరియు సెకండరీ స్థాయిలలో ప్రత్యేక పిల్లలను మేనేజ్ చేసిన అనుభవం ఉండాలి.
  • వీటితోపై పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం.

Age Limit

Trained Graduate Teacher (TGT) పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
Primary Teacher, Special Educator పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 30 సంవత్సరాల లోపు ఉండాలి.
SC, ST లతో పాటు ఇతర వర్గాలకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

How to Attend Interview

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు Kendriya Vidyalaya Siddipet కు సంబంధించిన వెబ్ సైట్ (https://siddipet.kvs.ac.in) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. అలాగే, అందులోని వివరాలన్నీ నింపాలి. అదేవిధంగా విద్యార్హతలు, బోధన అనుభవంనకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ ఫాంకు జతచేయాలి. అలాగే, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

Date of Interview :

TGT – ఆగస్టు 24, 2022 (బుధవారం)
PRT & Special Educator – ఆగస్టు 25, 2022 (గురువారం)
(Note: ఇంటర్వ్యూ రోజు ఉదయం 9 గంటలకే పాఠశాలకు చేరుకోవాలి. 9 గంటల నుంచి 9:30 గంటల మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.)

Interview Venue : 

Kendriya Vidyalaya,
First Floor,
Ellenki Engineering College Campus.
Near Rural Police Station, Siddipet. (TS).

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ చెల్లించరు.
  • కేంద్రీయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం జీతం చెల్లిస్తారు.

– Teacher Jobs in Siddipet KV