Staff Nurse Jobs in NIMSA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Staff Nurse Jobs in NIMS : హైదరాబాద్ లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) భారీ సంఖ్యలో స్టాఫ్ నర్స్ (Staff Nurse) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Rc.No.HR4/001/SN Contract/2022) జారీ చేసింది. మొత్తం 200 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొని అప్లికేషన్ ఫాంను నిమ్స్ కు పంపించాలి.

Eligibility

ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థ/ యూనివర్సిటీలో B.Sc. (Nursing) ఉత్తీర్ణులైనవారు అర్హులు.

Age Limit

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.

Salary

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.32,682 వేతనం చెల్లిస్తారు.

Selection Criteria

  • రాత పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఉంటుంది.
  • 60 ప్రశ్నలు ఇస్తారు. 60 నిమిషాలలో పరీక్ష రాయాల్సి ఉంటుంది.
  • ప్రశ్న పత్రం ఇంగ్లిష్ లో ఉంటుంది.
  • ప్రశ్నలు B.Sc (Nursing) సబ్జెక్టుల నుంచి ఇస్తారు.
  • ఓసీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధిస్తేనే క్వాలిఫై అవుతారు.
  • రాత పరీక్ష తేదీ, సమయం, సెంటర్ హాల్ టికెట్ లో తెలియజేస్తారు.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో Apply Online క్లిక్ చేయాలి. అందులో Register Yourself పై క్లిక్ చేసి అందులోని వివరాలన్నీ నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత ఫోన్ నెంబర్ కు అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ వస్తాయి. ఆ తర్వాత లాగిన్ పేజీ ఓపెన్ చేసి అందులో అప్లికేషన్ నెంబర్ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులోని వివరాన్నీ పూరించి సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500, ఇతరులు రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.
అనంతరం డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకోవాలి. దానిపై సంతకం చేసి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జతచేసి నిమ్స్ కు పంపించాలి.

నిమ్స్ కు పంపించాల్సిన డాక్యుమెంట్లు :
1. ఆన్ లైన్ అప్లికేషన్ ఫాం
2. పదో తరగతి మార్క్స్ మెమో
3. బీ.ఎస్సీ(నర్సింగ్) డిగ్రీ సర్టిఫికెట్
4. కులం సర్టిఫికెట్
5. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
6. ఆదాయం సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు)
7. బోనఫైడ్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి బీ.ఎస్సీ(నర్సింగ్) వరకు)
8. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్)

డాక్యుమెంట్లు పంపించాల్సిన చిరునామా :
The Executive Registrar,
2nd Floor, Old OPD Block,
Nizam’s Institute of Medical Sciences,
Hyderabad – 500082.

Important Dates

  • ఆన్ లైన్ లో దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 06, 2022
  • అప్లికేషన్ హార్డ్ కాపీ చేరాల్సిన తేదీ : సెప్టెంబర్ 10, 2022
  • హాల్ టికెట్ల జారీ : సెప్టెంబర్ 14, 2022 నుంచి
  • రాత పరీక్ష తేదీ: సెప్టెంబర్ 18, 2022

Important Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు మార్చి 03, 2023 వరకు పనిచేయాల్సి ఉంటుంది.
  • కేవలం తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్ లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రక్రియలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-23489018 నెంబర్ కు ఫోన్ చేసి (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) గానీ, [email protected] కు మెయిల్ చేసి గానీ పరిష్కారం పొందవచ్చు.

– Staff Nurse Jobs in NIMS