Jobs in Telangana Police Department : తెలంగాణ రాష్ట్ర పోలీసు డిపార్టుమెంట్ (Police Department Government of Telangana).. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ (Safe City Projecr) లో భాగంగా హైదరాబాద్ లోని రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీస్ (State Forensic Science Laboratories)లో డీఎన్ఏ, బయాలజీ, సైబర్ ఫోరెన్సిక్ విభాగాలలో సైంటిఫిక్ ఆఫీసర్ (Scientific Officer) సైంటిఫిక్ అసిస్టెంట్ (Scientific Assistant), ల్యాబ్ అసిస్టెంట్ (Lab Assistant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 32 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Scientific Officer (DNA)
2. Scientific Assistant (DNA)
3. Lab Assistant (DNA)
4. Scientific Officer (Biology Division)
5. Scientific Assistant (Biology Division)
6. Lab Assistant (Biology Division)
7. Scientific Officer (Cyber Forensic Division)
8. Scientific Assistant (Cyber Forensic Division)
9. Lab Assistant (Cyber Forensic Division)
10. Scientific Assistant (Chemical Division)
Scientific Officer (DNA)
పోస్టు పేరు: సైంటిఫిక్ ఆఫీసర్
ల్యాబోరేటరీ : డీఎన్ఏ
పోస్టు కోడ్ : 01ఏ
పోస్టుల సంఖ్య : రెండు (02)
జీతం: నెలకు రూ.45,000
అర్హతలు : బయాలజీ/ జెనెటిక్స్/ జువాలజీ/ బోటనీ/ మైక్రో బయాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై, బయాలజీ/ సెరాలజీ/ డీఎన్ఏ లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫోరెన్సిక్ సైన్స్/ బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బయాలజీ/ సెరాలజీ/ డీఎన్ఏ/ జువాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ చదివి ఉండాలి.
Scientific Assistant (DNA)
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : డీఎన్ఏ
పోస్టు కోడ్ : 02ఏ
పోస్టుల సంఖ్య : నాలుగు (04)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు : బయాలజీ/ జువాలజీ/ బోటనీ/ మైక్రో బయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ జెనెటిక్స్/ ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై, బయాలజీ/ జువాలజీ/బోటనీ/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫోరెన్సిక్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బయాలజీ/ బోటనీ/ జువాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ బయో టెక్నాలజీ చదివి ఉండాలి.
Lab Assistant (DNA)
పోస్టు పేరు : ల్యాబ్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : డీఎన్ఏ
పోస్టు కోడ్ : 03ఏ
పోస్టుల సంఖ్య : రెండు (02)
జీతం: నెలకు రూ.30,000
అర్హతలు : బయాలజీ/ జువాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ బోటనీ/ జెనెటిక్స్ లో బీ.ఎస్సీ చేసిన వారు, బీ.ఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)/ బీ.ఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన వారు అర్హులు. బీ.ఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్), బీ.ఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో బయాలజీ/ జువాలజీ/ బోటనీ చదివి ఉండాలి.
Scientific Officer (Biology Division)
పోస్టు పేరు: సైంటిఫిక్ ఆఫీసర్
ల్యాబోరేటరీ : బయాలజీ డివిజన్
పోస్టు కోడ్ : 01బీ
పోస్టుల సంఖ్య : మూడు (03)
జీతం: నెలకు రూ.45,000
అర్హతలు : బయాలజీ/ జెనెటిక్స్/ జువాలజీ/ బోటనీ/ మైక్రో బయాలజీ/ బయో టెక్నాలజీ/ బయో కెమిస్ట్రీ/ ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై, బయాలజీ/ సెరాలజీ/ డీఎన్ఏ లో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫోరెన్సిక్ సైన్స్/ బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బయాలజీ/ సెరాలజీ/ డీఎన్ఏ/ జువాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ సైకాలజీ చదివి ఉండాలి.
Scientific Assistant (Biology Division)
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : బయోలజీ డివిజన్
పోస్టు కోడ్ : 02బీ
పోస్టుల సంఖ్య : మూడు (03)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు : బయాలజీ/ జువాలజీ/ బోటనీ/ మైక్రో బయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ జెనెటిక్స్/ ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై, బయాలజీ/ జువాలజీ/ బోటనీ/ మైక్రో బయాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ సైకాలజీలో స్పెషలైజేషన్ చేసి ఉండాలి. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫోరెన్సిక్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బయాలజీ/ బోటనీ/ జువాలజీ/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ/ బయో టెక్నాలజీ చదివి ఉండాలి.
Lab Assistant (Biology Division)
పోస్టు పేరు: ల్యాబ్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : బయోలజీ డివిజన్
పోస్టు కోడ్ : 03బీ
పోస్టుల సంఖ్య : నాలుగు (04)
జీతం: నెలకు రూ.30,000
అర్హతలు : బయాలజీ/ జువాలజీ/ బయో కెమిస్ట్రీ/ బయో టెక్నాలజీ/ మైక్రో బయాలజీ/ బోటనీ/ జెనెటిక్స్ లో బీ.ఎస్సీ చేసిన వారు, బీ.ఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్)/ బీ.ఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన వారు అర్హులు. బీ.ఎస్సీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్), బీ.ఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన అభ్యర్థులు ఇంటర్మీడియట్ లో బయాలజీ/ జువాలజీ/ బోటనీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
Scientific Officer (Cyber Forensic Division)
పోస్టు పేరు: సైంటిఫిక్ ఆఫీసర్
ల్యాబోరేటరీ : సైబర్ ఫోరెన్సిక్ డివిజన్
పోస్టు కోడ్ : 01సీ
పోస్టుల సంఖ్య : రెండు (02)
జీతం: నెలకు రూ.45,000
అర్హతలు : ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) / ఎం.టెక్ (ఈఈఈ/ఈసీఈ/ సైబర్ సెక్యూరిటీ/ సైబర్ ఫోరెన్సిక్/ సీఎస్సీ/ ఐటీ)/ ఎంసీఏ/ ఫోరెన్సిక్ సైన్స్ (కంప్యూటర్స్) చేసిన వారు అర్హులు. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎంసీఏ/ ఫోరెన్సిక్ సైన్స్ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో బీ.ఎస్సీ (ఫిజికల్ సైన్స్/ కంప్యూటర్స్) చదివి ఉండాలి.
Scientific Assistant (Cyber Forensic Division)
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : సైబర్ ఫోరెన్సిక్ డివిజన్
పోస్టు కోడ్ : 02సీ
పోస్టుల సంఖ్య : ఆరు (06)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు : ఎమ్మెస్సీ (కంప్యూటర్ సైన్స్) / ఎం.టెక్ (ఈఈఈ/ఈసీఈ/సైబర్ సెక్యూరిటీ/ సైబర్ ఫోరెన్సిక్/ సీఎస్సీ/ ఐటీ)/ ఎంసీఏ/ ఫోరెన్సిక్ సైన్స్ (కంప్యూటర్స్) చేసిన వారు అర్హులు. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫోరెన్సిక్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు, ఎంసీఏ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫిజికల్ సైన్స్/ కంప్యూటర్స్ చదివి ఉండాలి.
Lab Assistant (Cyber Forensic Division)
పోస్టు పేరు: ల్యాబ్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : సైబర్ ఫోరెన్సిక్ డివిజన్
పోస్టు కోడ్ : 03సీ
పోస్టుల సంఖ్య: రెండు (02)
నెలకు రూ.30,000
అర్హతలు : కంప్యూటర్స్ తో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు లేదా బీఏసీ చేసిన అర్హులు.
Scientific Assistant (Chemical Division)
పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్
ల్యాబోరేటరీ : కెమికల్ డివిజన్
పోస్టు కోడ్ : 02డీ
పోస్టుల సంఖ్య : నాలుగు (04)
జీతం: నెలకు రూ.40,000
అర్హతలు: కెమిస్ట్రీ లేదా ఫోరెన్సిక్ సైన్స్ లో ఎమ్మెస్సీ చేసిన వారు అర్హులు. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఫోరెన్సిక్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో కెమిస్ట్రీ/ టాక్సికాలజీ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
Age Limit
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జూలై 01, 2022 వరకు 18 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
Application Fee
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజును డీడీ రూపంలో చెల్లించాలి. Director Forensic Science Lab, Hyderabad పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. సైంటిఫిక్ ఆఫీస్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 డీడీ తీయాలి. అలాగే, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 డీడీ తీయాలి. ఈ డీడీని అప్లికేషన్ ఫాంకు జతచేయాలి. ఈ ఫీజు ఒకసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు.
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు తెలంగాణ పోలీసు శాఖ వెబ్ సైట్ (https://www.tspolice.gov.in/)ను ఓపెన్ చేయాలి. అందులో స్క్రోల్ అవుతున్న TS FSL – NOTIFICATION FOR OUTSOURCING RECRUITMENT IN TSFSL పై క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్ తో పాటు చివరలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఆ అప్లికేషన్ రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, ఎస్సెస్సీ, డిగ్రీ, పీజీ విద్యార్హతల సర్టిఫికెట్లు, కులం సర్టిఫికెట్, నాన్ క్రిమీలేయర్ సర్టిఫికెట్, ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు స్టడీ బోనఫైడ్ సర్టిఫికెట్లు, అనుభవంను సంబంధించిన సర్టిఫికెట్, డీడీ అప్లికేషన్ ఫాంకు జతచేయాలి.
జిరాక్స్ సర్టిఫికెట్లన్నీ సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఒక కవర్ లో పెట్టి, కవర్ పైన దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరు, పోస్టు కోడ్ రాయాలి. ఆ కవర్ ను అక్టోబర్ 10, 2022 సాయంత్రం 5 గంటల లోపు ఈ కింది చిరునామాకు పోస్టు ద్వారా గానీ, కొరియర్ ద్వారా గానీ పంపించాలి. స్వయంగా వెళ్లి కూడా అందచేయవచ్చు.
అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా
The Director,
Telangana State Forensic Science Laboratories,
Red Hills, Nampally,
Beside Niloufer Hospital,
Hyderabad – 500004.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఓరల్ ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
- ప్రస్తుతం తెలంగాణలో అమలవుతున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగాలు కల్పిస్తారు.
– Jobs in Telangana Police Department