Medical Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా రామగుండంలోని జ్యోతినగర్ లో గల నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (National Thermal Power Corporation Limited-NTPC)కు చెందిన ధన్వంతరి ఆసుపత్రి (Dhanwantari Hospital) లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (General Duty Medical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం రెండు (02) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Details of Post
1.General Duty Medical Officer – 02
Vacancies
మొత్తం ఖాళీలు : రెండు (02). ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
Qualification
Bachelor of Medicine, Bachelor of Surgery (MBBS) ఉత్తీర్ణులై, ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ చేసిన వారు అర్హులు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Salary
ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,23,000 స్థిర వేతనం చెల్లిస్తారు.
How to Attend Interview
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం, రిజర్వుడ్ కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీలతో బయోడేటాను మరియు విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించి సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
Interview Date & Time :
అక్టోబర్ 21, 2022,
ఉదయం 9 గంటల నుంచి
Interview Venue :
First Floor, CMO Office, Dhanwantari Hospital, NTPC Township, Jyothi Nagar, Ramagundam, Peddapalli Disrict, Telangana- 505215
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే [email protected] కు మెయిల్ చేసి తెలుసుకోవచ్చు.
Important Points
- ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- మొదట నియామక తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు పనిచేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత అభ్యర్థి పనితీరు మరియు సంస్థ అవసరాలను బట్టి మరో సంవత్సరం పొడిగించవచ్చు.
- ఈ ఉద్యోగానికి ఫుల్ టైం ప్రాతిపదికన ఎంపిక చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకొనేందుకు అనుమతించరు.
- సెల్ఫ్ మెడికల్ సౌకర్యం ఉంటుంది.
- ఎంపికైన అభ్యర్థులకు లభ్యతను బట్టి టౌన్ షిప్ లో వసతి కల్పిస్తారు.
- ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ టీఏ, డీఏ లాంటివి చెల్లించదు.
- అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.
- ఎలాంటి ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి కారణాలు తెలపకుండా, నియామక ప్రక్రియను రద్దు చేయడానికి లేదా మార్పు చేయడానికి లేదా సవరించడానికి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, రామగుండం నకు కలదు.
– Medical Officer Jobs