Jobs in NHM : నేషనల్ హెల్త్ మిషన్ (National Health Mission-NHM)లో భాగంగా హైదరాబాద్ లో చేపట్టిన జాతీయ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (National Tele Mental Health Programme) లో సైకియాట్రిక్ నర్స్, కౌన్సెలర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మొత్తం 21 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. విద్యార్హతల్లో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.
Details and Vacancies Of Posts
Psychiatric Nurse – 01
Counsellors – 20
Educational Qualification & Experience
Psychiatric Nurse
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్‌లో సైకియాట్రిక్ నర్సింగ్ లో ఎమ్మెస్సీ చేసి ఉండాలి. టెలిమెడిసిన్ మరియు/లేదా టెలీ-ట్రైనింగ్‌లో క్లినికల్ మరియు/లేదా పరిశోధనలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే, మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ టీమ్‌లతో కలిసి పనిచేసిన అనుభవం ఉండాలి.
Counsellors
క్లినికల్ సైకాలజీ / సోషల్ వర్క్ / MA సోషియాలజీ / సైకాలజీలో మాస్టర్స్ చేసి ఉండాలి. లేదా సైకాలజీ లేదా సోషల్ వర్క్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేసినా అర్హులే.
Remuneration per month
Psychiatric Nurse – రూ.29,900
Counsellors – రూ.18,900
Age Limit
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు జూలై 07, 2023 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు ఉండాలి. ఓసీ, బీసీ (నాన్-క్రీమీ లేయర్) 44 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, ఎక్స్-సర్వీస్ పురుషులు/స్త్రీలు (నాన్-క్రీమీ లేయర్) 49 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్ పురుషులు/స్త్రీలు (క్రీమీ లేయర్) 47 సంవత్సరాలు, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు 44 సంవత్సరాలు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
Selection Criteria
అభ్యర్థుల విద్యార్హతలు, ఎక్స్ పీరియెన్స్, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 పాయింట్లు ఉంటాయి. విద్యార్హతలకు 40 పాయింట్లు, ఎక్స్ పీరియెన్స్ కు 20 పాయింట్లు, ఇంటర్వ్యూకు 40 పాయింట్లు కేటాయించారు. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మరియు నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ నిబంధనల ప్రకారం కట్ ఆఫ్ మార్కులు ఉంటాయి.
How to Attend Interview
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్ సైట్ (https://chfw.telangana.gov.in/) ను ఓపెన్ చేసి అందులో నిర్ణీత ఫార్మాట్ లో ఉన్న అప్లకేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. దానికి ఈ కింది సర్టఫికెట్లు జతచేయాలి.
1. ఆధార్ కార్డ్.
2. SSC లేదా పుట్టిన తేదీ సర్టిఫికెట్
3. కులం సర్టిఫికెట్
4. బోనఫైడ్ సర్టిఫికెట్ (ప్రైవేట్ చదివినవారు నివాస ధృవీకరణ పత్రం)
5. క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు.
6. వర్క్‌షాప్‌లు/శిక్షణకు హాజరైన సర్టిఫికెట్లు.
7. అనుభవ ధృవీకరణ పత్రాలు
పై సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి జతచేసి నేరుగా ఇంటర్వ్యూ హాజరు కావాలి.
Important Points
పై ఉద్యోగాలను కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు. 31 మార్చి, 2023 వరకు లేదా ప్రోగ్రాం ఆగిపోయే వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి చెల్లించరు. ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
Interview Date & Venue
Psychiatric Nurse – 20.01.2023 from 10.00 AM
Counsellors – 21.01.2023 from 10.00 AM
Venue:
O/o the Commissioner, Health & Family Welfare and Mission Director, National Health Mission, Telangana State, DM&HS Campus, DME Building, Hyderabad.
– Jobs in NHM