5th class Admissions in Residentials : తెలంగాణ రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Social Welfare Residential Educational Institutions Society, Government of Telangana – TSSWREIS) ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లిష్ మీడియం, తెలంగాణ స్టేట్ సెలబస్)లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 638 గురుకులాల్లో విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ, తెలంగాణ గురుకుల (జనరల్) పాఠశాలల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Reservation Wise Seats
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు
(Social Welfare Residential Educational Institutions-TSWREIS)
ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 230 ఉన్నాయి.
వీటిలో ఎస్సీ(SC) విద్యార్థులకు 75 శాతం, ఎస్టీ(ST)లకు 6 శాతం, బీసీ(BC) లకు 12 శాతం, ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ (SC Converted Christians) కు 2 శాతం, ఇతరులకు (OC) లకు 2 శాతం, మైనారిటీ (Minority) విద్యార్థులకు లకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు
(Tribal Welfare Residential Educational Institutions-TTWREIS)
ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 76 ఉన్నాయి.
వీటిలో ఎస్సీ(SC) విద్యార్థులకు 12 శాతం, ఎస్టీ(ST)లకు 64 శాతం, ఎస్టీ ఏజెన్సీ(ST Agency)విద్యార్థులకు 10 శాతం, బీసీ(BC) లకు 5 శాతం, ఇతరులకు (OC) లకు 3 శాతం, దివ్యాంగులకు (PHC) 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు
(MJPTBC Welfare Residential Educational Institutions-MJPTBCWREIS)
ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 261 ఉన్నాయి.
వీటిలో ఎస్సీ(SC) విద్యార్థులకు 15 శాతం, బీసీ(BC) లకు 3 శాతం, ఎస్టీ(ST)లకు 5 శాతం, బీసీ(ఏ)(BC-(A)) విద్యార్థులకు 15 శాతం, బీసీ(బీ)(BC-(B)) విద్యార్థులకు 25 శాతం, బీసీ(డీ)(BC-(D)) విద్యార్థులకు 17 శాతం, బీసీ(ఈ)(BC-(E)) విద్యార్థులకు 10 శాతం, ఎంబీసీ(MBC) విద్యార్థులకు 5 శాతం, ఇతరులకు (OC) లకు 2 శాతం, అనాథ (Orphan) విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
తెలంగాణ గురుకుల (జనరల్) పాఠశాలలు
(Telangana Residential Educational Institutions-TREIS)
ఈ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా 35 ఉన్నాయి.
వీటిలో ఎస్సీ(SC) విద్యార్థులకు 15 శాతం, బీసీ(BC) లకు 3 శాతం, ఎస్టీ(ST)లకు 6 శాతం, బీసీ(ఏ)(BC-(A)) విద్యార్థులకు 7 శాతం, బీసీ(బీ)(BC-(B)) విద్యార్థులకు 10 శాతం, బీసీ(సీ)(BC-(C)) విద్యార్థులకు 1 శాతం, బీసీ(డీ)(BC-(D)) విద్యార్థులకు 7 శాతం, బీసీ(ఈ)(BC-(E)) విద్యార్థులకు 4 శాతం, ఇతరులకు (OC) లకు 41 శాతం, ఈడబ్ల్యూఎస్(EWS) విద్యార్థులకు 10 శాతం, అనాథ (Orphan) విద్యార్థులకు 3 శాతం, దివ్యాంగులకు (PHC) 3 శాతం, మాజీ సైనికుల పిల్లలకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
Qualifictions
2022-2023 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బోనఫైడ్ / స్టడీ సర్టిఫికెట్ ను అప్ లోడ్ చేయాలి.
ఓసీ (OC), బీసీ (BC) విద్యార్థులు 01.09.2012 నుంచి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. 9 సంవత్సరాలు నిండి ఉండాలి. 11 సంవత్సరాలు నిండి ఉండకూడదు.
ఎస్సీ (SC), ఎస్టీ(ST) విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి. 9 సంవత్సరాలు నిండి ఉండాలి. 13 సంవత్సరాలు నిండి ఉండకూడదు.
ఎస్సీ కన్వర్టెడ్ క్రైస్తవ విద్యార్థులు 01.09.2010 నుంచి 31.08.2014 మధ్య జన్మించినవారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు అర్హులు.
విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, అర్బన్ ప్రాంతాల్లో రూ.2,00,000 మించకూడదు.
Entrance Test
ప్రవేశ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్, గణితం, మెంటల్ ఎబిలిటీ, పరిసరాల విజ్ఞానం సబ్జెక్టులలో 3, 4వ తరగతి స్థాయిలో ఉంటుంది. 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది.
తెలుగు సబ్జెక్టుకు 20 మార్కులు, ఇంగ్లిష్కు 25, గణితంకు 25, పరిసరాల విజ్ఞానంకు 20, మెంటల్ ఎబిలిటీకి 10 మార్కులు కేటాయించారు. ఓఎంఆర్ షీట్ లో ప్రవేశ పరీక్ష జవాబులు గుర్తించాలి. పరీక్షకు 10 రోజుల ముందు నుంచి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ప్రశ్నపత్రం తెలుగు మరియు ఇంగ్లిష్ మీడియంలో ఉంటుంది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది.
ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం, స్థానికత ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
How to Apply
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.tswreis.ac.in, http:/tgcet.cgg.gov.in, http:/tgtwgurukulam.telangana.gov.in, http:/mjptbcwreis.telangana.gov.in ఈ నాలుగు వెబ్ సైట్లలోని ఏదైనా ఒక సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
ముందుగా Online Payment పై క్లిక్చేసి విద్యార్థి జిల్లా, ఇంటి పేరు, పేరు, కులం, ఫోన్ నెంబర్ (తల్లిదండ్రులది), తదితర వివరాలు ఎంటర్ చేసి రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులతో దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసువాలి.
ఆ తర్వాత మళ్లీ Online Application పై క్లిక్ చేయాలి. అందులో జర్నల్ నెంబర్, దరఖాస్తు ఫీజు చెల్లించిన తేదీ, విద్యార్థి పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ వస్తుంది. దానిలో వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి. ఫొటో, సంతకం స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి. సబ్మిట్ చేసిన దరఖాస్తు ఫారంను ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి. దరఖాస్తులు ఆన్లైన్లోనే సమర్పించాలి. నేరుగా వెళ్లి ఇవ్వకూడదు.
దరఖాస్తు చేసే సమయానికే అభ్యర్థి కులం, పుట్టిన తేదీ సర్టిఫికెట్లు తీసుకొని ఉండాలి. ఒకవేళ దరఖాస్తు సమయానికి తీసుకోకపోతె అడ్మిషన్ టైంకైనా తప్పకుండా తీసుకోవాలి. లేనియెడల ఆ విద్యార్థిని ఎంపిక చేయరు. ఏ గురుకులంలో ఏఏ కులాలవారికి ఎన్ని సీట్లు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని, నాలుగు గురుకులాల్లో ప్రాధాన్యతను బట్టి దరఖాస్తు చేయాలి. విద్యార్థి పుట్టిన తేదీ, కులం, జెండర్ జాగ్రత్తగా నింపాలి. ఒకసారి నింపిన దరఖాస్తు ఫాంలో మార్పులకు అవకాశం ఉండదు. అందుకే జాగ్రత్తగా నింపాలి.
Help Line Numbers
ఆన్లైన్ దరఖాస్తు నింపే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 1800 425 45678 (TSWREIS), 040-24734899 (TREIS), 9121174434 (TTWREIS), 040-23328266 (MJPTBCWREIS) నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.
Free Facilities for Students
ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి, సీటు పొందిన విద్యార్థులకు ఈ కింది సౌకర్యాలు కల్పిస్తారు.
1. సన్న బియ్యంతో సహా అన్ని పోషక విలువలు ఉన్న చక్కటి రుచికరమైన భోజనం అందిస్తారు.
2. నెలకు నాలుగు సార్లు చికెన్, రెండు సార్లు మటన్ తో భోజనం పెడతారు.
3. పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు ఉచితంగా అందజేస్తారు.
4. పెన్సిల్స్, రికార్డు పుస్తకాలు ఉచితంగా ఇస్తారు.
5. మూడు జతల స్కూల్ యూనిఫాంలు, ట్రంక్ పెట్టెలు / ట్రాలీ అందజేస్తారు.
6. పీటీ డ్రెస్, ట్రాక్ సూట్, స్పోర్ట్స్ షూ, సాక్స్, నైట్ డ్రెస్, ప్లేట్, గ్లాస్, కటోర, స్పూన్, బెడ్ షీట్, బ్లాంకెట్, పరుపులు ఉచితంగా సరఫరా చేస్తారు.
7. విద్యార్థినీ, విద్యార్థులకు సబ్బులు కొనుగోలుకు డబ్బులు ఇస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ : 06.03.2023
ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ : 23.04.2023 (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)
– 5th class Admissions in Residentials