Tutor Jobs in Mancherial GMC : తెలంగాణ ప్రభుత్వ మెడికల్ ఎడ్యుకేషన్ (Government of Telangana, Directorate of Medical Education-DME) పరిధిలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాల (Government Medical College, Mancherial)లో ట్యూటర్ (Tutor) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification.01/Tutor/GMC_MNCL/2023) జారీ అయింది. మొత్తం పదమూడు (13) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts & Vacancies
1. అనాటమీ (Anatomy) – 04
2. ఫిజియాలజీ (Physiology) – 03
3. బయో కెమిస్ట్రీ (Bio chemistry) – 03
4. ఫార్మకాలజీ (Pharmacology) – 01
5. ఫోరెన్సిక్ మెడిసిన్ (Forensic Medicine) – 02
Qualification
సంబంధిత విభాగాలలో ఎమ్మెస్సీ (మెడికల్) (M.Sc (Medical)) చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అలాగే, మెడికల్ ఇనిస్టిట్యూషన్స్‌లో టీచర్స్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఉండాలి.
Consolidated Pay
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.57,700ల జీతం చెల్లిస్తారు.
Age Limit
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు. అపాయింట్మెంట్ తేదీ నాటికి గరిష్ట వయసు 45 సంవత్సరాలలోపు ఉండాలి.
How to Apply
అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల వెబ్సైట్ (https://www.gmcmancherial.org) లేదా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ వెబ్సైట్ (https://www.dme.telangana.gov.in)లలో నిర్ణీత ఫార్మాట్లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్లోడ్ చేసుకోవాలి. సంబంధిత వెబ్సైట్లలో నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ ఫాం (Application Form) కూడా ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత అందులో రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. ఆ అప్లికేషన్ ఫాంకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్సెస్సీ మెమో లేదా బర్త్ సర్టిఫికెట్ (డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం), 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ/బోనఫైడ్ సర్టిఫికెట్లు, బీ.ఎస్సీ మరియు ఎమ్మెస్సీ సర్టిఫికెట్లు, ఎమ్మెస్సీ మార్క్స్ మెమోలు జతచేయాలి. వీటన్నింటినీ ఒకే పీడీఎఫ్ ఫైల్ చేసి ఈ నెల 20వ తేదీన (20.02.2023) సాయంత్రం 5 గంటలలోపు [email protected] ఈ-మెయిల్ ఐడీకి పంపించాలి. లేదా నేరుగా వెళ్లి అయినా మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కార్యాలయంలో అందజేయవచ్చు.
Selection Criteria
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మార్కుల్లో మెరిట్, టీచింగ్ అనుభవం, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులలో విద్యార్హతల(M.Sc)కు 80 మార్కులు, టీచింగ్ ఎక్స్‌పీరియెన్స్‌కు 10 మార్కులు (ఒక సంవత్సరానికి ఒక మార్కు చొప్పున), ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అన్ని అర్హతలు ఉన్నవారిని ఫిబ్రవరి 27వ తేదీన ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అభ్యర్థులు పైన సూచించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
Important Points
- ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి.
- కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులు మెడికల్ కళాశాలలో మూడు (03) సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ : 20.02.2023 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తులు పంపాల్సిన ఈ-మెయిల్ ఐడీ : [email protected]
ఇంటర్వ్యూ నిర్వహించు తేదీ : 27.02.2023
వెబ్‌సైట్స్ : https://www.gmcmancherial.org, https://www.dme.telangana.gov.in
– Tutor Jobs in Mancherial GMC