Medical Jobs in Bhupalapally : జయశంకర్ భూపాలపల్లి జిల్లా (Jayashankar Bhupalpally District)లో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం (National Health Mission Programme-NHM)లో పనిచేయుటకు పలు ఉద్యోగాల భర్తీకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పది (10) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలోని వెళ్లి మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో బయోడేటా ఫాం అందజేసి దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Posts
1. Pathologist
2. Biochemist
3. Microbiologist
4. Radiologist
5. Lab Manager
6. Radiographer
7. Pharmacist
8. Data entry operator
9. Sanitary Helper
Pathologist
ఉద్యోగం పేరు : పాథాలజిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (పాథాలజీ)
Biochemist
ఉద్యోగం పేరు : బయోకెమిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (బయోకెమిస్ట్)
Microbiologist
ఉద్యోగం పేరు : మైక్రోబయాలజిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (మైక్రోబయాలజీ)
Radiologist
ఉద్యోగం పేరు : రేడియాలజిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎండీ (రేడియాలజీ)
Lab Manager
ఉద్యోగం పేరు : ల్యాబ్ మేనేజర్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : ఎమ్మెస్సీ (మైక్రోబయాలజీ/బయోకెమిస్ట్రీ)
Radiographer
ఉద్యోగం పేరు : రేడియోగ్రాఫర్
ఉద్యోగాల సంఖ్య : రెండు (02)
అర్హతలు : డిప్లొమా/బీఎస్సీ (రేడియోథెరపీ) డీఎంఎల్టీ /(డిప్లొమా ఇన్ మెడికల్ఇ మేజింగ్ టెక్నాలజీ)
Pharmacist
ఉద్యోగం పేరు : ఫార్మసిస్ట్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : బీఫార్మసీ లేదా డీ ఫార్మసీ
Data Entry Operator
ఉద్యోగం పేరు : డాటా ఎంట్రీ ఆపరేటర్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : డిగ్రీతో పాటు కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ లో అనుభవం ఉండాలి.
Sanitary Helper
ఉద్యోగం పేరు : డాటా ఎంట్రీ ఆపరేటర్
ఉద్యోగాల సంఖ్య : ఒకటి (01)
అర్హతలు : రాష్ట్ర శానిటేషన్ విధానం ప్రకారం ఎంపిక చేస్తారు.
How to Apply
అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి బయోడేటా ఫాంతో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పని వేళల్లో (ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల లోపు) అందజేయాలి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 డీడీ తీయాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ పేరిట డీడీ తీయాలి. ఈ డీడీ కూడా బయోడెటాకు జతచేయాలి. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ మార్చి 04, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
Selection Procedure
నేషనల్ హెల్త్ మిషన్ (NHM) సూచనల మేరకు జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరించే జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తుంది. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
Important Points
- పై ఉద్యోగాలన్నీ తాత్కాలికమైనవి.
- పాథాలజిస్ట్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, రేడియాలజిస్ట్, ల్యాబ్ మేనేజర్, రేడియోగ్రాఫర్ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
- ఫార్మసిస్ట్, డాటా ఎంట్రీ ఆపరేటర్, శానిటరీ హెల్పర్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేదీ : 04 మార్చి, 2023 సాయంత్రం 5 గంటల వరకు.
– Medical Jobs in Bhupalapally