Teaching Posts in Army School : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్ లోని రామకృష్ణపురంలో గల ఆర్మీ పబ్లిక్ స్కూల్ (Army Public School Ramakrishnapuram)లో పలు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Post Graduate Teacher (PGT)
పోస్టులు, సంఖ్య: ఏడు (07)
1.సైకాలజీ (Psychology), ఖాళీలు: ఒకటి (01)
2. కామర్స్ (Commerce), ఖాళీలు: ఒకటి (01)
3. ఫైన్ ఆర్ట్స్ (Fine Arts), ఖాళీలు: ఒకటి (01)
4.జియోగ్రఫీ (Geography), ఖాళీలు: ఒకటి (01)
5.బయోలజీ (Biology), ఖాళీలు: ఒకటి (01)
6.ఎకనామిక్స్ (Economics), ఖాళీలు: ఒకటి (01)
7.ఫిజికల్ ఎడ్యుకేషన్ (Physical Education), ఖాళీలు: ఒకటి (01)
అర్హతలు:
సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు సీబీఎస్ఈ XI & XII సీనియర్ సెకండరీ క్లాసులు బోధించాల్సి ఉంటుంది.
Trained Graduate Teacher (PGT)
పోస్టులు, సంఖ్య: ఇరవై (20)
1.సోషల్ సైన్స్ (Social Science), ఖాళీలు: నాలుగు (04)
2.ఇంగ్లిష్ (English), ఖాళీలు: ఐదు (05)
3.హిందీ (Hindi), ఖాళీలు: ఐదు (05)
4. సంస్కృతం (Sanskrit), ఖాళీలు: రెండు (02)
5.గణితం (Maths), ఖాళీలు: ఒకటి (01)
6. కంప్యూటర్ సైన్స్ (Computer Science (IP)), ఖాళీలు: ఒకటి (01)
7.ఫిజికల్ ఎడ్యుకేషన్ (Physical Education), ఖాళీలు: ఒకటి (01)
8.స్పెషల్ ఎడ్యుకేటర్ (Special Educator), ఖాళీలు: ఒకటి (01)
అర్హతలు:
50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీఈడీ చేసి ఉండాలి. సంబంధిత సబ్జెక్టుల్లో 50 శాతం అంతకంటే ఎక్కువ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు సీబీఎస్ఈ VI X సెకండరీ క్లాసులు బోధించాల్సి ఉంటుంది.
Primary Teachers (PRT) (All Subjects)
పోస్టులు, సంఖ్య: పదిహేను (15)
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బీ.ఈడీ(B.Ed) లేదా డీఈడీ (D.Ed) చేసి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ప్రైమరీ క్లాసులు బోధించాల్సి ఉంటుంది.
Primary Teachers (PRT)
1. మ్యూజిక్ వెస్టర్న్ (Music (Western)), ఖాళీలు: ఒకటి (01)
2. డ్యాన్స్ (Dance), ఖాళీలు: ఒకటి (01)
3. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ (Art & Craft), ఖాళీలు: ఒకటి (01)
అర్హతలు: సీబీఎస్ఈ (CBSE) బై లాస్, ఏడబ్ల్యూఈఎస్ (Army Welfare Education Socity-AWES) మార్గదర్శకాల ప్రకారం సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులు.
Age
తాజా అభ్యర్థులు 40 సంవత్సరాలలోపు ఉండాలి. ఐదు సంవత్సరాల టీచిం గ్ అనుభవం ఉండాలి. అనుభవం కలిగిన అభ్యర్థులు 57 సంవత్సరాలలోపు ఉండాలి. గడిచిన పదేళ్లలో ఐదు సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.
Application Procedure
ఆసక్తికలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా Army Public School, RK Puram పేరిట సికింద్రాబాద్ లో చెల్లుబాటు అయ్యేలా రూ.100 డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి. ఆ తర్వాత స్కూల్ వెబ్ సైట్ (www.apsrkpuram.edu.in.) లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిలోని వివరాలను పూర్తిగా నింపాలి. రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించాలి. విద్యార్హతలు, అనుభవానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు ఆధార్ కార్డును జతచేసి జూన్ 6, 2022 లోపు పోస్టు ద్వారా గానీ, స్వయంగా వెళ్లిగాని పాఠశాలలో అందజేయాలి. సీబీఎస్ఈ, ఏడబ్ల్యూఈఎస్ నిబంధనల ప్రకారం దరఖాస్తుల పరిశీలన తర్వాత ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పాఠశాల చిరునామా: ఆర్మీ పబ్లిక్ స్కూల్, రామకృష్ణపురం, సికింద్రాబాద్-500056
ఈ-మెయిల్ ఐడీ: [email protected]
ఫోన్ నెంబర్: 040-27794729
వెబ్ సైట్: https://kautilyacreative.com/
– Teaching Posts in Army School