Junior Lineman Jobs in TSSPDCL : హైదరాబాద్ లోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (Southern Power Distribution  Company of Telangana Limited- TSSPDCL) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా వెయ్యి (1000) జూనియర్ లైన్ మెన్ (Junior Lineman) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.03/2022) జారీ చేసింది. ఇందులో 447 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా, 553 లిమిటెడ్ రిక్రూట్ మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేస్తారు. సంస్థ పరిధిలోని జిల్లాల్లో అభ్యర్థులకు 95 శాతం, ఇతరులకు 5 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పరీక్ష నిర్వహిస్తారు.

మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. ఇతర జిల్లాల అభ్యర్థులకు 5 శాతం ఉద్యోగాలు లభిస్తాయి.

Qualifications

అభ్యర్థులు పదో తరగతితో పాటు ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్ మెన్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ ట్రేడ్ లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోరుపాసైన వారు కూడా అర్హులే.

Age

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్
(SC/ST/BC/EWS) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది.

Pay Scale

824340-480-25780-695-29255-910-33805-1120-39405

Application and Examination Fee

అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి అభ్యర్థి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే, రూ.120 పరీక్ష ఫీజు
చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి
చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు. ఫీజు మినహాయింపు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.

Application Procedure

అర్హులైన అభ్యర్థులు ముందుగా TSSPDCL వెబ్ సైట్ (http://tssouthernpower.cgg.gov.in) లోకి లాగిన్ కావాలి. అందులో Make Payment అప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్ సైట్ లో Submit Application అప్షన్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో గానీ, హాల్ టికెట్ డౌన్ చేసుకొనే సమయంలో గానీ ఏవైనా సమస్యలు ఎదురైతే హెల్ప్ డెస్క్ నెంబర్ 040-23120303 కు ఫోన్ చేయవచ్చు. ఉదయం 10:30 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేయాలి. లేదా http://tssouthernpower.cgg.gov.in వెబ్ సైట్ లోని కంప్లైంట్ బాక్స్ ద్వారా కూడా తెలియజేసి పరిష్కారం పొందవచ్చు.

Important Dates

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 8 జూన్, 2022 (సాయంత్రం 5 వరకు)
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 8 జూన్, 2022 (రాత్రి 11:59 వరకు)
హాల్ టికెట్ ల డౌన్ లోడ్ : 11 జూలై, 2022
రాత పరీక్ష : 17 జూలై, 2022 (ఆదివారం)

Circle Wise Vacancies

మహబూబ్ నగర్
OC-15 (95%)
EWS- 3 (95%)
BC-A-3 (95%)
BC-B-1(5%) -5(95%)
BC-C-2 (95%)
BC-D-3 (95%)
BC-E-3 (95%)
SC-5 (95%)
ST-3 (95%)

నారాయణపేట
OC-1(5%) -6(95%)
EWS- 2 (95%)
BC-A-2 (95%)
BC-B-1(95%)
BC-C-1 (95%)
BC-D-1 (95%)
BC-E-1 (95%)
SC-2 (95%)
ST-1 (95%)

వనపర్తి
OC-1(5%) -8(95%)
EWS- 1 (95%)
BC-A-1 (95%)
BC-B-1(95%)
BC-C-1 (95%)
BC-D-2 (95%)
BC-E-1 (95%)
SC-2 (95%)
ST-1 (95%)

నాగర్ కర్నూర్
OC-1(5%) -11(95%)
EWS- 2 (95%)
BC-A-4 (95%)
BC-B-3(95%)
BC-C-2 (95%)
BC-D-1 (95%)
BC-E-1 (95%)
SC-5 (95%)
ST-1 (95%)

గద్వాల్
OC- 4 (95%)
EWS- 1 (95%)
BC-A-1 (95%)
BC-B-1 (95%)
BC-C-1 (95%)
BC-D-1 (95%)
BC-E-1 (95%)
SC-1 (95%)
ST-1 (95%)

నల్గొండ
OC- 3 (5%) 22 (95%)
EWS- 6 (95%)
BC-A-4 (95%)
BC-B-6 (95%)
BC-C-1 (95%)
BC-D-5 (95%)
BC-E-2 (95%)
SC-8 (95%)
ST-4 (95%)

సూర్యాపేట
OC- 1 (5%) 16 (95%)
EWS- 5 (95%)
BC-A-3 (95%)
BC-B-5 (95%)
BC-C-1 (95%)
BC-D-1 (5%), 3 (95%)
BC-E-2 (95%)
SC-8 (95%)
ST-3 (95%)

యాదాద్రి
OC- 1 (5%) 14 (95%)
EWS- 4 (95%)
BC-A-3 (95%)
BC-B-3 (95%)
BC-C-2 (95%)
BC-D-1 (5%), 3 (95%)
BC-E-4 (95%)
SC-7 (95%)
ST-2 (95%)

మెదక్
OC- 1 (5%) 10 (95%)
EWS- 3 (95%)
BC-A-2 (95%)
BC-B-2 (95%)
BC-C-2 (95%)
BC-D-1 (95%)
BC-E-1 (95%)
SC-3 (95%)
ST-2 (95%)

సిద్దిపేట
OC- 11 (95%)
EWS- 3 (95%)
BC-A-4 (95%)
BC-B-3 (95%)
BC-C-2 (95%)
BC-D-4 (95%)
BC-E-4 (95%)
SC-1 (5%) 5 (95%)
ST-2 (95%)

సంగారెడ్డి
OC- 1 (5%), 11 (95%)
EWS- 2 (95%)
BC-A-13 (95%)
BC-B-14 (95%)
BC-C-2 (95%)
BC-D-3 (95%)
BC-E-5 (95%)
SC-3 (95%)
ST-2 (95%)

వికారాబాద్
OC- 4 (95%)
EWS- 2 (95%)
BC-A-6 (95%)
BC-B-6 (95%)
BC-C-2 (95%)
BC-D-1 (95%)
BC-E-1 (95%)
SC- 1 (5%), 2 (95%)
ST-1 (95%)

మేడ్చల్
OC- 1 (5%), 3 (95%)
BC-A-10 (95%)
BC-B-13 (95%)
BC-C-2 (95%)
BC-D-10 (95%)
BC-E-6 (95%)
SC- 1 (5%), 20 (95%)
ST-9 (95%)

హబ్సిగూడ
OC- 1 (5%), 3 (95%)
EWS- 1 (95%)
BC-A-12 (95%)
BC-B-16 (95%)
BC-C-2 (95%)
BC-D-12 (95%)
BC-E-7 (95%)
SC- 24 (95%)
ST-9 (95%)

నైబర్ సిటీ
OC- 1 (5%), 6 (95%)
EWS- 1 (95%)
BC-A-9 (95%)
BC-B-11 (95%)
BC-C-2 (95%)
BC-D-7 (95%)
BC-E-6 (95%)
SC- 1 (95%)
ST-1 (95%)

రాజేంద్రనగర్
OC- 6 (95%)
EWS- 1 (95%)
BC-A-10 (95%)
BC-B-11 (95%)
BC-C-2 (95%)
BC-D-6 (95%)
BC-E-5 (95%)
SC- 1 (5%), 4 (95%)
ST-2 (95%)

సరూర్ నగర్
OC- 7 (95%)
EWS- 2 (95%)
BC-A- 1 (5%), 7 (95%)
BC-B-8 (95%)
BC-C-2 (95%)
BC-D-6 (95%)
BC-E-5 (95%)
SC- 4 (95%)
ST- 6 (95%)

బంజారాహిల్స్
OC- 3 (95%)
BC-A- 1 (5%), 8 (95%)
BC-B-12 (95%)
BC-C-2 (95%)
BC-D-8 (95%)
BC-E-5 (95%)
SC- 19 (95%)
ST- 9 (95%)

సికింద్రాబాద్
OC- 2 (95%)
BC-A- 2 (5%), 9 (95%)
BC-B-14 (95%)
BC-C-2 (95%)
BC-D-10 (95%)
BC-E-6 (95%)
SC- 1 (5%), 20 (95%)
ST- 9 (95%)

హైదరాబాద్ సౌత్
OC- 1 (5%)
EWS-1 (95%)
BC-A- 1 (5%), 7 (95%)
BC-B-11 (95%)
BC-C-2 (95%)
BC-D-8 (95%)
BC-E-5 (95%)
SC- 16 (95%)
ST- 7 (95%)

హైదరాబాద్ సెంట్రల్
OC- 1 (95%)
EWS-1 (95%)
BC-A- 1 (5%), 9 (95%)
BC-B-12 (95%)
BC-C-2 (95%)
BC-D-8 (95%)
BC-E-5 (95%)
SC- 19 (95%)
ST- 1 (5%), 7 (95%)

SCADA
OC- 2 (95%)
EWS-1 (95%)
BC-B-1 (5%)
BC-D-1 (95%)

– Junior Lineman Jobs in TSSPDCL