Admissions in B Sc Nursing : హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2023 విద్యాసంవత్సరానికి నాలుగు సంవత్సరాల బీ.ఎస్సీ (నర్సింగ్) (B.Sc.(Nursing)) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 100 సీట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
B.Sc(Nursing) నాలుగు సంవత్సరాల కోర్సులో అడ్మిషన్‌కు అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2023 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే, డిసెంబర్ 31, 2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. దివ్యాంగులకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది.
ఈ కోర్సుకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in)ను ఓపెన్ చేయాలి.
అందులో Apply Online పై క్లిక్ చేయాలి.
దాంట్లో Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి.
వాటితో లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
అందులో అడిగే అన్ని సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి.
క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ ఫీజు చెల్లించవచ్చు.
ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి మార్క్స్ మెమో
2. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ ట్రాన్స్ ఫర్ (టీసీ)/మైగ్రేషన్ సర్టిఫికెట్
4. స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
5. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
6. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
7. టీఎస్ ఎంసెట్-2023 ర్యాంక్ కార్డ్
8. సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి.
ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి.
ఆ మొత్తం సర్టిఫికెట్లను జులై 03, 2023 సాయంత్రం 5 గంటల లోపు ఈ కింది చిరునామాకు వ్యక్తిగతంగా గానీ లేదా రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
The Associate Dean,
Academic-2, 2nd floor, Old OPD Block,
Nizam’s Institute of Medical Sciences,
Hyderabad – 500 082
అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో నిమ్స్ లోని Academic-2, 2nd floor, Old OPD block కార్యాలయంలో సంప్రదించాలి.
లేదా, nimsadat@gmail.com ఈ-మెయిల్ కు లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నిమ్స్ లోని నోటీస్ బోర్డు అలాగే, వెబ్ సైట్ లో ఉంచుతారు.
వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
అడ్మిషన్ ఫీజు – రూ.3,000 (One Time) (Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్ – రూ.1,000 (One Time) (Refundable)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.31,250 చొప్పున నాలుగు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున నాలుగు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1,300 చొప్పున నాలుగు సంవత్సరాలు.
ట్రాన్స్‌పోర్టేషన్ ఫీజు – ఏడాదికి రూ.1,500 చొప్పున నాలుగు సంవత్సరాలు.
అఫిలియేషన్ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున నాలుగు సంవత్సరాలు.
ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్ 28, 2023
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: జులై 3, 2023
ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే (వెబ్సైట్) : జులై 19, 2023
ఫైనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే (వెబ్సైట్) : జులై 22, 2023
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ డిస్ప్లే : జులై 22, 2023
కౌన్సెలింగ్ లెటర్స్ ఇష్యూ (త్రూ లాగిన్) : జులై 24, 2023
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ : ఆగస్టు 08, 2023 శనివారం
– Admissions in B Sc Nursing
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…