Education

Admissions in Basara IIIT

Admissions in Basara IIIT : తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా బాసరలో గల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (Rajiv Gandhi University of Knowledge Technologies-RGUKT) (Basara IIIT)  2022-23 విద్యా సంవత్సరానికి గాను ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ ప్రోగాం (6-Year Integrated B. Tech Program)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సుకు ఎంపికైన విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత వసతి, యూనిఫాంతోపాటు ల్యాప్ టాప్ వంటివి అందజేస్తుంది. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన వారు ఇంజినీరింగ్ లో ఉన్నత విద్యను అభ్యసించడంతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Course Details

ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సును రెండు విభాగాలు అందిస్తారు.

1. ప్రీ యూనివర్సిటీ కోర్సు (Pre University Course)

ఈ కోర్సు రెండు (02) సంవత్సరాలు ఉంటుంది. ఎంపీసీ (MPC) కోర్సు బోధిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్ (Mathematics), ఫిజిక్స్ (Physics), కెమిస్ట్రీ(Chemistry), ఇంగ్లిష్ (English), తెలుగు/ సంస్కృతం (Telugu/Sanskrit), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Information Technology), ఎన్విరాన్మెంటల్ సైన్స్ (Environmental Science) సబ్జెక్టులు ఉంటాయి. తెలుగును ద్వితీయ భాషగా చదవని ఇతర భాషలకు చెందిన అభ్యర్థులకు మాత్రమే సంస్కృతం బోధిస్తారు.

2. బీ.టెక్ (B.Tech)

ఈ కోర్సు నాలుగు (04) సంవత్సరాలు ఉంటుంది. ఇందులో కెమికల్ ఇంజినీరింగ్ (Chemical Engineering), సివిల్ ఇంజినీరింగ్ (Civil Engineering), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (Computer Science & Engineering), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్(Electronics & Communicati ons Engineering), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (Electrical & Electronics Engineering), మెకానికల్ ఇంజినీరింగ్ (Mechanical Engineering), మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్ (Metallurgical & Materials Engineering) కోర్సులు బోధిస్తారు.

Eligibility

  • 2022లో 10వ తరగతి ఫస్ట్ అటెంప్ట్ లో పాసైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు.
  • విద్యార్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 18 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 21 సంవత్సరాల లోపు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • భారతీయ పౌరసత్వం కలిగి ఉండి ఇతర దేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గ్లోబల్ కేటగిరీలో దరఖాస్తు చేసుకొన్న తెలంగాణ విద్యార్థులు కూడా జనరల్ కేటగిరీగా పరిగణించబడతారు.

Admission Procedure

విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన గ్రేడ్ పాయింట్ ఆవరేజ్ (GPA)లో మెరిట్, మరియు ప్రతి సబ్జెక్టులో పొందిన గ్రేడ్ ఆధారంగా, అలాగే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. ఆర్థికంగా వెనకబడి, నాన్ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు 10వ తరగతిలో సాధించిన జీపీఏకి అదనంగా 0.4 స్కోర్ జోడిస్తారు.
మొత్తం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్ర (లోకల్) విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన 15 శాతం సీట్లు అన్ రిజర్వుడ్ కేటగిరీకి కేటాయిచేస్తారు. వీటిని మెరిట్ ఆధారంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు.

Reservation Wise Seats

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం. విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ(SC)లకు 15 శాతం, ఎస్టీ(ST)లకు 6 శాతం, బీసీ-ఏ (BC-A)లకు 7 శాతం, బీసీ-బీ(BC-B)లకు 10 శాతం, బీసీ-సీ(BC-C)లకు 1 శాతం, బీసీ-డీ (BC-D)లకు 7 శాతం, బీసీ-ఈ(BC-E)లకు 4 శాతం సీట్లు కేటాయిస్తారు.
అలాగే, దివ్యాంగులకు (PH) 3 శాతం (VH-1%, HI-1%, OH-1%), సాయుధ దళాలలో పనిచేస్తున్న ఉద్యోగుల (CAP) పిల్లలకు 2 శాతం, ఎన్సీసీ కేడెట్స్ కు ఒక శాతం, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు 0.5 శాతం సీట్లు కేటాయిస్తారు.
దివ్యాంగులు స్టేట్ మెడికల్ బోర్డు జారీచేసిన వైకల్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే CAP, Sports కోటా విద్యార్థులు జిల్లా బోర్డులు
జారీచేసిన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
పై అన్ని కేటగిరీలలో బాలికలకు 33 శాతం సీట్లు కేటాయించడం జరుగుతుంది.

How to Apply

దరఖాస్తు ప్రక్రియ మూడు దశలలో ఉంటుంది. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ఆన్ లైన్ అప్లికేషన్ ను నింపాలి. PH/CAP/NCC/Sports అభ్యర్థులు తమ కేటగిరీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను RGUKT కి పోస్టు ద్వారా పంపించాలి.
దరఖాస్తు ప్రక్రియను RGUKT వెబ్ సైట్ (https://www.rgukt.ac.in/) లోకి లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. లేదా ఏదైనా టీఎస్ ఆన్ లైన్ సెంటర్ నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్ ఆన్ లైన్ సెంటర్ నుంచి దరఖాస్తు చేస్తే అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. టీఎస్ ఆన్ లైన్ సెంటర్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే రిసిప్ట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.

Application Fee

దరఖాస్తు ప్రక్రియలో ముందుగా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.350, ఇతర దేశాలు, రాష్ట్రాలలో ఉంటున్న ఏపీ, తెలంగాణ విద్యార్థులు రూ.1200, ఖాళీగా ఉన్న గ్లోబల్ సీట్ల ప్రవేశం కోరే విద్యార్థులు రూ.1200, ఎన్ఆర్ఎస్ఐ,  ఇంటర్నేషనల్ విద్యార్థులు US$:40 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు విద్యార్థులు RGUKT వెబ్ సైట్ (https://www.rgukt.ac.in/)లోకి లాగిన్ కావాలి. అందులో స్క్రోల్ అవుతున్న Admission to UG Program 2022-23 Notification – Apply Online(new) పై క్లిక్ చేయాలి. అందులో Show Payment పై క్లిక్ చేయాలి. అనంతరం Citizen IIIT RGUKT Basar UG Admission Fee Payment ఫై క్లిక్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో పదో తరగతి హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి బోర్డు, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, రాష్ట్రం, లోకల్ ఏరియా, రిజర్వేషన్ కేటగిరీ తదితర వివరాలు నింపి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ ఐడీ వస్తుంది.

Application Submission

  • అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత వచ్చిన ఐడీ, పదో తరగతి హాల్ టికెట్ నెంబర్ తో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
  • ఇందుకోసం మళ్లీ RGUKT వెబ్ సైట్ (https://www.rgukt.ac.in/)లోకి లాగిన్ కావాలి.
  • అందులో స్క్రోల్ అవుతున్న Admission to UG Program 2022-23 Notification – Apply Online(new) పై క్లిక్ చేయాలి.
  • అందులో Apply Now పై క్లిక్ చేయాలి. అందులో Application ID, 10th Hall Ticket Number ఎంటర్ చేసి Proceed to Fill Application పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు అప్లికేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అన్ని వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాంను ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
  • PH/CAP/NCC/Sports తదితర స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు మాత్రం తమ కేటగిరీకి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో టీఎస్ ఆన్ లైన్ సెంటర్ లో ఇచ్చిన రిసిప్ట్, అప్లికేషన్ ఫాంను ఒక ఎనవలప్ కవర్ లో పెట్టాలి.
  • ఆ కవర్ పైన ‘Application for UG Admissions – 2022 RGUKT, Basar’ అని రాయాలి.
  • ఆ ఎనవలప్ కవర్ ను The Convener, UG Admissions 2022 23, Rajiv Gandhi University of Knowledge Technologies, Basar, Nirmal District. Telangana State-504107. చిరునామాకు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-45676699, 9000455311, 9000754253 ఫోన్ నెంబర్లను లేదా vle.support@aptonline.in ఈ-మెయిల్ ఐడీని సంప్రదించి పరిష్కారం పొందవచ్చు.
  • దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన విద్యార్థులను కౌన్సెలింగ్ కు పిలుస్తారు. కౌన్సెలింగ్ ఎంపికైన విద్యార్థుల వివరాలు RGUKT వెబ్ సైట్ (www.rgukt.ac.in, www.admissions.rgukt.ac.in)లలో పెడతారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అడ్మిషన్లు కల్పిస్తారు.

Important Dates

అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ : జూలై 15, 2022.
స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫాం పంపాల్సిన చివరి తేదీ : జూలై 19, 2022.
తాత్కాలిక సెలెక్షన్ లిస్ట్ ప్రదర్శించు తేదీ జూలై 30, 2022.

Website: https://www.ntpc.co.in
Helpline Numbers: https://www.ntpc.co.in +91 7601053134, +91
7013824050 (Between 10:00 AM to 5.00 PM, all working days)
E-mail: admissions@rgukt.ac.in

– Admissions in Basara IIIT

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago