Education

Admissions in TSWR Fine Arts School

Admissions in Fine Arts School : హైదరాబాద్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Social Welfare Residential Educational Institutions Society Hyderabad) మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం మల్కాజ్ గిరిలోని ఏదులాబాద్ లో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ పాఠశాల (బాల-బాలికలు)లో 2022-23 విద్యా సంవత్స రానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష (Common Entrance Test-2022), నైపుణ్య పరీక్ష (Skill Test) ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు 6వ తరగతి (State Syllabus) పాఠాలతో పాటు ఫైన్ ఆర్ట్స్ నేర్పిస్తారు.

Name of the Fine Arts

శాస్త్రీయ సంగీతం (గాత్రం) Classical Music (Vocal)
1.కర్ణాటక (Carnatic)
2.హిందూస్తానీ (Hindustani)

వాయిద్య సంగీతం (Instrumental Music)
1.వయోలిన్ (Violin)
2.మృదంగం (Mrudangam)
3.తబలా (Tabla)
4.కీ బోర్డు (Keyboard)
5. గిటార్ (Guitar)

నృత్యం (Dance)
1.కూచిపూడి (Kuchipudi)
2. కథక్ (Kathak)

పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ (Painting & Drawing)
1. పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ (Painting & Drawing)

Number of Seats

మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఇందులో SC అభ్యర్థులకు 75 శాతం, SC(C) అభ్యర్థులకు 2 శాతం, ST అభ్యర్థులకు 6 శాతం, BC అభ్యర్థులకు 12 శాతం, Minority అభ్యర్థులకు 3 శాతం, OC/EBC అభ్యర్థులకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 3 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయిస్తారు.

Eligibility

2021-22 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 5వ తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలు ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. అలాగే, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు మించకూడదు. ఇందుకు సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కావొచ్చు.

Age Limit

ఎస్సీ, ఎస్సీ(సీ), ఎస్టీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2008 నుంచి ఆగస్టు 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. ఆగస్టు 31, 2022 నాటికి 14 సంవత్సరాలు మించకూడదు. అలాగే, బీసీ, మైనారిటీ, ఇతర విద్యార్థులు సెప్టెంబర్ 1, 2010 నుంచి ఆగస్టు 31, 2012 మధ్య జన్మించి ఉండాలి. ఆగస్టు 31, 2022 నాటికి 12 సంవత్సరాలు మించకూడదు.

How to Apply

ఆసక్తి కలిగిన విద్యార్థులు TSWR వెబ్ సైట్ (www.tswreis.in)ను ఓపెన్ చేసి అందులోని COMMON ENTRANCE TEST-2022 నోటిఫికేషన్ కింద ఉన్న Click here for Apply పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడి పక్కన ఉన్న అప్షన్లలో Click here : To pay application Fee పై క్లిక్ చేయాలి. అందులో పేరు, ఫోన్ నెంబర్, కులం, పుట్టిన తేదీ ఇతర వివరాలు నింపి రూ.100 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లో గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా గానీ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు.

రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Click here : To submit online application పై క్లిక్ చేసి ఫోన్ నెంబర్ (Contact Number), పుట్టిన తేదీ (Date of Birth) ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. విద్యార్థులు తమ రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను 100 కేబీ సైజ్ లో జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి. ఒక విద్యార్థి ఒక ఫైన్ ఆర్ట్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఒక్కసారి ఎంచుకొన్న కోర్సును తిరిగి మార్చరు. ప్రవేశ పరీక్షలో మెరిట్, కులం ప్రాతిపదికన లభ్యతను బట్టి సీటు కేటాయిస్తారు.

Written Test

రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 5వ తరగతి వరకు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు, తెలుగు నుంచి 20 ప్రశ్నలు, గణితం నుంచి 20 ప్రశ్నలు, మెంటల్ ఎబిలిటి నుంచి 20 ప్రశ్నలు, ఎన్విరాన్మెంటల్/జనరల్ సైన్స్ నుంచి 20 ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. ఓఎంఆర్ అన్సర్ షీట్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం కేవలం ఇంగ్లిష్ లోనే ఉంటుంది.

Skill Test

నైపుణ్య పరీక్ష 50 మార్కులకు నిర్వహిస్తారు. మల్కాజ్ గిరిలోని TSWR పాఠశాలలో సబంధిత అధ్యాపకులు ఈ పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష, నైపుణ్య పరీక్షల్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు కల్పిస్తారు.

Certificates to be Submit

ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ఈ క్రింది ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు అందజేయాలి.
1. కులం సర్టిఫికెట్
2. ఆదాయం సర్టిఫికెట్
3. 5వ తరగతి టీసీ/రికార్డ్ షీట్
4. 5వ తరగతి స్టడీ సర్టిఫికెట్
5. 5వ తరగతి మార్క్స్ షీట్/ప్రోగ్రెస్ కార్డ్
6. ఆధార్ కార్డు
7. ఐదు (05) పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
8. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్

అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో గానీ, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే సమయంలో గానీ ఏమైనా సమస్యలు తలెత్తితే 1800-425-45678 నెంబర్ కు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే, మధ్యాహ్నం ఒకటిన్నర
నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.

Important Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 28 జూన్, 2022
హాల్ టికెట్ల డౌన్ లోడ్: 29 జూన్, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: 03 జూలై, 2022 (ఆదివారం)
ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 09 జూలై, 2022
అడ్మిషన్ల ప్రారంభ తేదీ: 11 జూలై, 2022

– Admissions in Fine Arts School

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago