Education

Admissions in Mahatma Jyothiba Phule Degree Colleges

Admissions in MJP Degree Colleges : తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ​ కళాశాలల్లో (Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Degree Colleges) 2023‌‌–24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society-MJPTBCWREIS) నోటిఫికేషన్ (Rc. No.E/343/2023) జారీ చేసింది. ప్రవేశ పరీక్ష (MJPTBCWRDC CET-2023)లో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఈ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంగ్లిష్​ మీడియంలో విద్యనందిస్తారు. రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలు మొత్తం 14 ఉన్నాయి. ఇందులో మహిళల కాలేజీలు 6, పురుషుల కాలేజీలు 8 ఉన్నాయి.

Courses

రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల డిగ్రీ​ కళాశాలల్లో ప్రస్తుతం ఈ కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

B.Sc.Physical Sciences:

  • MPC
  • MPCS
  • MSCS
  • MSDS
  • MSAI&ML
  • MPG
  • MES
  • MECS

B.Sc., Life Sciences:

  • BZC
  • BZG
  • BBCC
  • BTBCC
  • BTZC
  • MBZC
  • NZC
  • ANPHBC

B.Com:

  • General
  • Computer Applications
  • Business Analytics

B.A:

  • EPH
  • HPE
  • IREP
  • PPGEP

BBA
BFT

విద్యార్థులు తమ అర్హతలు, సబ్జెక్టులను బట్టి పై కోర్సులలో ఏదైనా ఒక కోర్సును ఎంపిక చేసుకోవాలి.

Eligibility

తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి/ఏప్రిల్-2023లో నిర్వహించే సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు లేదా తత్సమాన పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. సప్లిమెంటరీ & ఇన్‌స్టంట్ విద్యార్థులు అర్హులు కాదు. వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు.

మార్చి/ఏప్రిల్-2023లో నిర్వహించిన సీనియర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే 50 శాతం మార్కులతో పాస్​ కావాలి. ఒక్కో సబ్జెక్టులో 40 శాతం మార్కులు రావాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 35 శాతం మార్కులు వచ్చినా సరిపోతుంది.

విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకూడదు.

Selection Criteria

ప్రవేశ పరీక్ష (MJPTBCWRDC CET-2023)లో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఈ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

బీసీ (BCs) విద్యార్థులకు 75 శాతం ((BC-A 15%, BC-B 25%, BC-C 3%, BC-D 17%, BC-E 10%, MBC 5%) సీట్లు, ఎస్సీ (SCs) విద్యార్థులకు 15 శాతం, ఎస్టీ (STs) విద్యార్థులకు 5శాతం, ఈబీసీ (EBC) విద్యార్థులకు 2 శాతం, అనాథ (Orphan) విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. ఏ కేటగిరీలోనైనా అర్హులైన విద్యార్థులు లేకుంటే వాటిని బీసీ విద్యార్థులకు కేటాయిస్తారు.

How to Apply

ఆసక్తి క​లిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) వెబ్​సైట్​ (https://mjpabcwreis.cgg.gov.in/)ను ఓపెన్​ చేయాలి. అందులో Notification – MJPTBCW RDC-CET-2023 పక్కన ఉన్న Online Payment పై క్లిక్​ చేయాలి. అందులో వివరాలన్నీ నింపి రూ.200 ఫీజు ఆన్​లైన్​లోనే చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్​ నంబర్​ వస్తుంది. దానిని నోట్​ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి Online Application పై క్లిక్​ చేయాలి. అందులో జర్నల్​ నెంబర్​, పేమెంట్​ డేట్​, డేట్​ ఆఫ్​ బర్త్​, ఎస్సెస్సీ బోర్డు, హాల్​ టికెట్​ నెంబర్​ ఎంటర్​ చేసి, ఫొటో, సంతకం స్కాన్​ చేసి అప్​లోడ్​ చేసి Next పై క్లిక్​ చేయాలి. అప్పు అప్లికేషన్​ ఫాం వస్తుంది. అందులోని వివరాలన్నీ నింపి, సంబంధిత సర్టిఫికెట్లు అప్​ లోడ్​ చేయాలి. 

దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040–23322377 నెంబర్​కు కాల్​ చేసి పరిష్కారం పొందవచ్చు.

Important Points

  • తెలంగాణ రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు తహసీల్దార్​ జారీ చేసిన నేటివిటీ సర్టిఫికెట్ సమర్పించాలి
  • విద్యార్థులు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి.

Important Dates

  • దరఖాస్తులకు చివరి తేదీ : ఏప్రిల్​ 16, 2023
  • హాల్​ టికెట్ల డౌన్​ లోడ్​ : ఏప్రిల్​ 20, 2023 నుంచి
  • ప్రవేశ పరీక్ష తేదీ : ఏప్రిల్​ 29, 2023, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు

– Admissions in MJP Degree Colleges

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago