Admissions in MJPTBCWREIS : తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో (Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Junior Colleges) 2023–24 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Mahatma Jyothiba Phule Telangana Backward Classes Welfare Residential Educational Institutions Society-MJPTBCWREIS) నోటిఫికేషన్ (Rc. No.E/343/2023) జారీ చేసింది. ప్రవేశ పరీక్ష (MJPTBCWRJC CET-2023)లో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఈ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యనందిస్తారు. రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు మొత్తం 255 ఉన్నాయి. ఇందులో బాలుర కాలేజీలు 130, బాలికల కాలేజీలు 125 ఉన్నాయి. ఇందులో నాలుగు కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) ఉన్నాయి. అలాగే, 15 వృత్తి విద్యా కాలేజీలు (Vocational Colleges) కూడా ఉన్నాయి. ఇందులో బాలురకు 10 కాలేజీలు, బాలికలకు ఐదు కాలేజీలు ఉన్నాయి.
రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రస్తుతం ఈ కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
వృత్తి విద్యా కాలేజీల్లో ఈ కింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
2022-23లో ఎస్సెస్సీ (SSC) (లేదా) దాని సమానమైన కోర్సును పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. అడ్వాన్స్ సప్లిమెంటరీ అభ్యర్థులు అర్హులు కాదు.
విద్యార్థుల తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకూడదు.
ప్రవేశ పరీక్ష (MJPTBCWRJC CET-2023)లో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా ఈ కాలేజీల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
బీసీ (BCs) విద్యార్థులకు 75 శాతం ((BC-A 15%, BC-B 25%, BC-C 3%, BC-D 17%, BC-E 10%, MBC 5%) సీట్లు, ఎస్సీ (SCs) విద్యార్థులకు 15 శాతం, ఎస్టీ (STs) విద్యార్థులకు 5శాతం, ఓసీ/ఈబీసీ (OC/EBC) విద్యార్థులకు 2 శాతం, అనాథ (Orphan) విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు.
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టల్లో ఉంటూ చదువుకున్న విదాయర్థులకు 25 సీట్లు కేటాయిస్తారు.
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPTBCWREIS) వెబ్సైట్ (https://mjpabcwreis.cgg.gov.in/)ను ఓపెన్ చేయాలి. అందులో Notification – MJPTBCW RJC-CET-2023 పక్కన ఉన్న Online Payment పై క్లిక్ చేయాలి. అందులో వివరాలన్నీ నింపి రూ.200 ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి Online Application పై క్లిక్ చేయాలి. అందులో జర్నల్ నెంబర్, పేమెంట్ డేట్, డేట్ ఆఫ్ బర్త్, ఎస్సెస్సీ బోర్డు, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, ఫొటో, సంతకం స్కాన్ చేసి అప్లోడ్ చేసి Next పై క్లిక్ చేయాలి. అప్పు అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులోని వివరాలన్నీ నింపి, సంబంధిత సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040–23328266 నెంబర్కు కాల్ చేసి పరిష్కారం పొందవచ్చు.
– Admissions in MJPTBCWREIS
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…