Admissions in NTRUHS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (Dr. NTR University of Health Sciences-NTRUHS) నాలుగు సంవత్సరాల బీ.ఎస్సీ (నర్సింగ్) (B.Sc (Nursing)), బీపీటీ (BPT), బీ.ఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ B.Sc (Paramedical Technology) కోర్సులలో 2022-23 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Courses
1. Bachelor of Science in Nursing (B.Sc (Nursing)) 4 Years
2. Bachelor of Physiotherapy (BPT)
3. Bachelor of Science in Paramedical Technology (B.Sc Paramedical Technology)
B.Sc (Paramedical Technology) Courses :
1. B.Sc (Medical Lab Technology)
2. B.Sc (Neuro Physiology Technology)
3. B.Sc (Optometric Technology (Optometry))
4. B.Sc (Renal Dialysis Technology)
5. B.Sc (Perfusion Technology)
6. B.Sc (Cardiac Care Technology & Cardio Vascular Technology)
7. B.Sc (Anesthesiology Technology & Operation Technology)
8. B.Sc (Imaging Technology)
9. B.Sc (Emergency Medical Technology)
10. B.Sc (Respiratory Therapy Technology)
Eligibility
బీ.ఎస్సీ (నర్సింగ్) : ఇంగ్లిష్ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులైనవారు, AISSCE/ CBSE/ ICSE/SSCE/ HSCE/ NIOS/APOSS గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులైనవారు, బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ లో బ్రిడ్జ్ కోర్సుతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైనవారు అర్హులు. సైన్స్ సబ్జెక్టులలో ఓసీ అభ్యర్థులు 45 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి.
బీపీటీ: ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైనవారు, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో అందుకు సమానమైన కోర్సు ఉత్తీర్ణులైనవారు, బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ లో బ్రిడ్జ్ కోర్సుతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైనవారు, బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ తో APOSS ఉత్తీర్ణులైనవారు అర్హులు.
బీ.ఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ) : ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైనవారు, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో అందుకు సమానమైన కోర్సు ఉత్తీర్ణులైనవారు, బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ లో బ్రిడ్జ్ కోర్సుతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులైనవారు, బయోలాజికల్ సైన్సెస్ అండ్ ఫిజికల్ సైన్సెస్ తో APOSS ఉత్తీర్ణులైనవారు అర్హులు.
Age Limit
బీ.ఎస్సీ (నర్సింగ్) అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. బీపీటీ, బీ.ఎస్సీ (పారామెడికల్ టెక్నాలజీ) కోర్సులకు 17 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దివ్యాంగులు ఆన్ లైన్ దరఖాస్తు ఫాంలో కేటగిరీని పేర్కొనాలి. ఆ తర్వాత నిర్ణీత సమయంలో యూనివర్సిటీ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
Application and Processing Fee
పై కోర్సులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులు రూ.2,360, బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.1,888 చెల్లించాలి. అభ్యర్థులు డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ యాప్ ల ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి. ఈ ఫీజు ఒకసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం వెబ్ సైట్ (https://ugparamedical.ntruhsadmissions.com/) ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆరు దశలలో ఉంటుంది. మొదటి దశలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండో దశలో లాగిన్ కావాలి. మూడో దశలో ఆన్ లైన్ అప్లికేషన్ ను నింపాలి. నాలుగో దశలో అప్లికేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఐదో దశలో విద్యార్హతలు, కేటగిరీ, ఇతర డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి. ఆరో దశలో అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి.
ఈ ప్రక్రియలో అభ్యర్థి బేసిక్ ఇన్ఫర్మేషన్ తో రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత మొబైల్ నెంబర్ కు రిజిస్ట్రేషన్ నెంబర్ ను పంపిస్తారు. దానిని అభ్యర్థులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
దరఖాస్తుల పరిశీలన అనంతరం యూనివర్సిటీ అధికారులు కోర్సులకు ఎంపికైన అభ్యర్థుల తాత్కాలిక జాబితాను వెబ్ సైట్ లో ఉంచుతారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఫైనల్ జాబితాను ప్రకటిస్తారు.
ఈ అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం కేవలం యూనివర్సిటీ వెబ్ సైట్ లోనే ఉంచుతారు. వ్యక్తిగతంగా పంపించరు.
అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 02, 2022 (సాయంత్రం 4 గంటల వరకు)
దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే ఈ కింది నెంబర్లను సంప్రదించవచ్చు.
8333883934, 7416563063, 7416253073, 9063400829
కోర్సులకు సంబంధించిన వివరాల కోసం ఈ కింది నెంబర్లను సంప్రదించవచ్చు.
8978780501, 7997710168, 9391805238, 9391805239
7416563063, 7416253073 నెంబర్లలో వాట్సాప్ చాట్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
– Admissions in NTRUHS