Admissions in Paramedical Allied Health Sciences : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2022 విద్యాసంవత్సరానికి నాలుగు సంవత్సరాల పారామెడికల్ అలైడ్ సైన్సెస్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (Bachelor of Science in Paramedical Allied Sciences) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులో మొత్తం 11 విభాగాలలో 100 సీట్లు ఉంటాయి. రాత పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
Courses & Number of seats
1. B.Sc. (Anesthesia Technology) – 10
2. B.Sc. ( Dialysis Therapy Technology) – 20
3. B.Sc. (Cardiovascular Technology) – 12
4. B.Sc. (Emergency & Trauma Care Technology) – 08
5. B.Sc. (Radiography & Imaging Technology) – 10
6. B.Sc. (Medical Laboratory Technology) – 12
7. B.Sc. (Neuro Technology) – 06
8. B.Sc. (Perfusion Technology) – 04
9. B.Sc. (Radiation Therapy Technology) – 04
10. B.Sc. (Respiratory Therapy Technology) – 10
11. B.Sc. (Transfusion Medicine) – 04
Qualification
బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) పాసైన వారు అర్హులు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడిట్ ఎడ్యుకేషన్ తో పాటు CBSE/ ICSE/ TOSS తదితర గుర్తింపు పొందిన బోర్డులలో ఇంటర్మీడియట్ చేసిన వారు కూడా అర్హులే.
ఈ కోర్సు వ్యవధి మొత్తం నాలుగు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఒక సంవత్సరం ఇంటర్న్ షిప్ ఉంటుంది. నిమ్స్ నిబంధనల మేరకు ఇంటర్న్ షిప్ సమయంలో స్టైపెండ్ కూడా ఇస్తారు.
Age Limit
అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.
Reservation Wise Seats
మొత్తం 100 సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం (బీసీ(ఏ)-7శాతం, బీసీ(బీ)-10శాతం, బీసీ(సీ)-ఒక శాతం, బీసీ (డీ)-7శాతం, బీసీ(ఈ)-4శాతం) కేటాయించారు. దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయించారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయించారు. ఇందులో 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం ఇతర రాష్ట్రాటలకు చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది.
How to Apply
అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in) ను ఓపెన్ చేసి ముందుగా Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రూ.700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Documents to be Submitted
ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి మార్క్స్ మెమో
2. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ ట్రాన్స్ ఫర్ (టీసీ)/మైగ్రేషన్ సర్టిఫికెట్
4. స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
5. రెసిడెన్స్ సర్టిఫికెట్
6. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
7. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
8. సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ (ఈ) అభ్యర్థులు)
పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఆగస్టు 4, 2022 సాయంత్రం 5 గంటల లోపు The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad – 500 082 చిరునామాకు పంపించాలి. రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో నిమ్స్ లోని Academic-2, 2nd floor, Old OPD block కార్యాలయంలో సంప్రదించాలి. లేదా, [email protected] ఈ-మెయిల్ కు లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నిమ్స్ లోని నోటీస్ బోర్డు అలాగే, వెబ్ సైట్ లో ఉంచుతారు. వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.
Selection Procedure
ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష 90 మార్కులకు ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఇస్తారు. పరీక్ష రెండు గంటలలో రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమెస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ లోనే
ఉంటుంది. క్వాలిఫై కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులను కౌన్సెలింగ్ కు ఆహ్వానించి అడ్మిషన్లు కల్పిస్తారు.
Course Fee
అడ్మిషన్ ఫీజు – రూ.3,000 (One Time) (Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్ – రూ.1,000 (One Time) (Refundable)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.39,750 చొప్పున మూడు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున మూడు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1,500 చొప్పున మూడు సంవత్సరాలు.
Importanat Dates
ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: ఆగస్టు 4, 2022
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : అక్టోబర్ 10, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: అక్టోబర్ 16, 2022
తాత్కాలిక ఫలితాల వెల్లడి: అక్టోబర్ 18, 2022
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీ: అక్టోబర్ 31, 2022
తరగతులు ప్రారంభం : నవంబర్ 07, 2022
– Admissions in Paramedical Allied Health Sciences