Admissions in PGRRCDE OUA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions in PGRRCDE OU : హైద‌రాబాద్ లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University)లో గ‌ల ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి దూర విద్యా కేంద్రం (Prof. G Ram Reddy Centre for Distance Education-PGRRCDE) 2022-2023 సంవత్సరానికి గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ, స‌ర్టిఫికెట్‌ కోర్సుల‌లో ప్ర‌వేశాల‌కు (1వ ఫేజ్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Details of Courses

MBA and MCA Courses
1. M.B.A (Master of Business Administration)
2. M.C.A (Master of Computer Application)

Post-Graduate Courses (MA, M.Com, M.Sc)
1. M.A (Urdu/Hindi/Telugu/Sanskrit)
2. M.A (English)
3. M.A.( Philosophy/Sociology/Public Personnel Mgt/Public Administration)
4. M.A. (Economics/ Pol. Science/ History)
5. M.A (Psychology)
6. M.Com
7. M.Sc (Mathematics)
8. M.Sc. (Statistics)

Graduate Courses (BA, B.Com, BBA)
1. B.A (Bachelor of Arts)
2. B.A (Mathematics & Statistics)
3. B.Com (General)
4. BBA

Post-Graduate Diploma Courses
1. P.G. Diploma in Mathematics
2. P.G. Diploma in English Language Teaching
3. P.G. Diploma in Business Management
4. P.G. Diploma in Bioinformatics
5. P.G. Diploma in Computer Applications
6. P.G. Diploma in Data Science
7. P.G. Diploma in Entrepreneurship Development

Certificate course
1. Certificate course in Yoga

M.B.A.

కోర్సు పేరు: (ఎంబీఏ మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు (నాలుగు సెమిస్టర్లు)
ఫీజు: ప్రతి సెమిస్టర్ కు రూ.10,000/-
అర్హత‌లు: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి TS ICET/ AP ICET – 2022లో అర్హత సాధించాలి. లేదా PGRRCDE, OU నిర్వహించిన ప్రవేశ పరీక్షలో నిర్ణీత కనీస మార్కులను పొంది ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3 లేదా 10+2+4 లేదా 10+3+3 ప్యాట‌ర్న్)లో 50% మార్కులు పొంది ఉండాలి. (BC/ SC/ ST అభ్యర్థులు 45% మార్కులు సాధించినా స‌రిపోతుంది.)

M.C.A.

కోర్సు పేరు: ఎంసీఏ (మాస్ట‌ర్ ఆఫ్ కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు (నాలుగు సెమిస్టర్లు)
ఫీజు: ప్రతి సెమిస్టర్ కు రూ.7,500/-
అర్హత‌లు: ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి TS ICET/ AP ICET – 2022లో అర్హత సాధించాలి. లేదా PGRRCDE, OU నిర్వహించిన ప్రవేశ పరీక్షలో నిర్ణీత కనీస మార్కులను పొంది ఉండాలి. ఏదైనా గ్రాడ్యుయేషన్ (10+2+3 లేదా 10+2+4 లేదా 10+3+3 ప్యాట‌ర్న్)లో 50% మార్కులు పొంది ఉండాలి (BC/ SC/ ST అభ్యర్థులు 45% మార్కులు సాధించినా స‌రిపోతుంది.) నాలుగు సెమిస్ట‌ర్లు. అలాగే, అభ్య‌ర్థులు 10+2 లేదా డిగ్రీలో గ‌ణితంను ఒక స‌బ్జెక్టుగా చ‌దివి ఉండాలి.

Post-Graduate Courses

MA (Urdu/Hindi/Telugu/Sanskrit)
కోర్సు పేరు: ఎం.ఏ (ఉర్దూ/ హిందీ/ తెలుగు సంస్కృతం)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,000 (ఏడాదికి)
అర్హత‌లు: సంబంధిత స‌బ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. BE, B.Tech, BCA చేసిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

M.A. (English)
కోర్సు పేరు: ఎం.ఏ (ఇంగ్లిష్‌)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,500 (ఏడాదికి)
అర్హత‌లు: సంబంధిత స‌బ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు. BE, B.Tech, BCA చేసిన వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

M.A.( Philosophy/Sociology/Public Personnel Mgt/Public Administration)
కోర్సు పేరు: ఎం.ఏ (ఫిలాసఫీ/ సోషియాలజీ/ పబ్లిక్ పర్సన‌ల్ మేనేజ్మెంట్‌ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,000 (ఏడాదికి)
అర్హత‌లు: ఏ ఫ్యాకల్టీలోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.

M.A. (Economics/ Pol. Science/ History)
కోర్సు పేరు: ఎం.ఏ (ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్స్/ హిస్టరీ)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,000 (ఏడాదికి)
అర్హత‌లు: అండ‌ర్ గ్రాడ్యుయేష‌న్ స్థాయి(UG)లో సంబంధిత సబ్జెక్ట్స్ లో గ్రాడ్యుయేట్ చేసిన వారు అర్హులు. B.Com గ్రాడ్యుయేట్స్ M.A (ఎకనామిక్స్)లో అడ్మిషన్ పొందుటకు అర్హులు.

M.A. (Psychology)
కోర్సు పేరు: ఎం.ఏ (సైకాలజీ)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.9,000 (ఏడాదికి)
అర్హత‌లు: ఏ ఫ్యాకల్టీలోనైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు అర్హులు.

M.Com
కోర్సు పేరు: ఎం.కం
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,500 (ఏడాదికి)
అర్హత‌లు: B.Com లో ఉత్తీర్ణులైన‌ వారు అర్హులు.

M.Sc. (Mathematics)
కోర్సు పేరు: ఎమ్మెస్సీ (మ్యాథ‌మెటిక్స్)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,500 (ఏడాదికి)
అర్హత‌లు: సంబంధిత స‌బ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన‌ వారు అర్హులు.

M.Sc. (Statistics)
కోర్సు పేరు: ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్)
కోర్సు వ్య‌వ‌ధి: రెండు సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.6,000 (ఏడాదికి)
అర్హత‌లు: మ్యాథ‌మెటిక్స్ మ‌రియు స్టాటిస్టిక్స్ లో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైన‌ వారు అర్హులు.

Graduate Courses

B.A. (Bachelor of Arts)
కోర్సు పేరు: బీఏ (బ్యాచిల‌ర్ ఆఫ్ ఆర్ట్స్)
కోర్సు వ్య‌వ‌ధి: మూడు (03) సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.4,000 (ఏడాదికి)
అర్హత‌లు: ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా అందుకు స‌మాన‌మైన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

B.A (Mathematics & Statistics)
కోర్సు పేరు: బీఏ (మ్యాథ‌మెటిక్స్ & స్టాటిస్టిక్స్)
కోర్సు వ్య‌వ‌ధి: మూడు (03) సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.4,000 (ఏడాదికి)
అర్హత‌లు: మ్యాథ‌మెటిక్స్ ఆప్ష‌న‌ల్ స‌బ్జెక్టుగా ఇంటర్మీడియట్ లేదా 10+2 ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

B.Com (General)
కోర్సు పేరు: బీకం (జనరల్)
కోర్సు వ్య‌వ‌ధి: మూడు (03) సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.5,000 (ఏడాదికి)
అర్హత‌లు: ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా అందుకు స‌మాన‌మైన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

BBA
కోర్సు పేరు: బీబీఏ
కోర్సు వ్య‌వ‌ధి: మూడు (03) సంవ‌త్స‌రాలు
ఫీజు: రూ.8,000 (ఏడాదికి)
అర్హత‌లు: ఇంటర్మీడియట్ లేదా 10+2 లేదా అందుకు స‌మాన‌మైన ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

Post-Graduate Diploma Courses

P.G. Diploma in Mathematics
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ మ్యాథమ్యాటిక్స్
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం
ఫీజు: రూ.6,000
అర్హత‌లు: ఏ ఫ్యాక‌ల్టీలోనైనా గ్రాడ్యుయేష‌న్ ( మూడు సంవత్స‌రాలు) ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

P.G. Diploma in English Language Teaching
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్ టీచింగ్
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం
ఫీజు: రూ.6,000
అర్హత‌లు: ఏ ఫ్యాక‌ల్టీలోనైనా గ్రాడ్యుయేష‌న్ (మూడు సంవత్స‌రాలు) ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

P.G. Diploma in Business Management
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజేమెంట్
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం
ఫీజు: రూ.6,000
అర్హత‌లు: ఏ ఫ్యాక‌ల్టీలోనైనా గ్రాడ్యుయేష‌న్ (మూడు సంవత్స‌రాలు) ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

P.G. Diploma in Bioinformatics
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం
ఫీజు: రూ.30,000
అర్హత‌లు: 50% మార్కుల‌తో B.Sc./M.Sc/B.Sc.(Ag.)/B.Pharmacy/BVSc./MBBS/BDS/BAMS/BUMS/BHMS/BE ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

P.G. Diploma in Computer Applications
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం (రెండు (02) సెమిస్ట‌ర్లు)
ఫీజు: రూ.8,000
అర్హత‌లు: ఏ ఫ్యాకల్టీలోనైనా గ్రాడ్యుయేష‌న్‌ ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

P.G. Diploma in Data Science
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ డాటా సైన్స్
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం (రెండు (02) సెమిస్ట‌ర్లు)
ఫీజు: రూ.10,000
అర్హత‌లు: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ (మూడు సంవ‌త్స‌రాలు) ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

P.G. Diploma in Entrepreneurship Development
కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ డెవ‌ల‌ప్మెంట్‌
కోర్సు వ్య‌వ‌ధి: ఒక‌ సంవ‌త్స‌రం (రెండు (02) సెమిస్ట‌ర్లు)
ఫీజు: రూ.7,500
అర్హత‌లు: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ (మూడు సంవ‌త్స‌రాలు) ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

Certificate Course

Certificate Course in Yoga
కోర్సు పేరు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ యోగా
కోర్సు వ్య‌వ‌ధి: ఆరు నెల‌లు
ఫీజు: రూ.6,000
అర్హత‌లు: ఎస్సెస్సీ లేదా మెట్రిక్యులేష‌న్ లేదా అందుకు స‌మాన‌మైన ప‌రీక్ష‌ ఉత్తీర్ణులైన‌వారు అర్హులు.

How to Apply

ఈ కోర్సులలో చేరదలుచుకొన్న అభ్యర్థులు PGRRCDE, OU వెబ్ సైట్ (www.oucde.net) లోకి లాగిన్ కావాలి. అందులో Online Services ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Online Admissions పై క్లిక్ చేసి అందులో సూచించిన విధంగా వరుస క్రమంలో కోర్సును ఎంచుకొని, రిజిస్ట్రేషన్ చేసుకొని, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫాంను ప్రింట్ తీసుకొని, అన్ని ఒరిజినల్
సర్టిఫికెట్లతో పదిహేను రోజుల లోపు PGRRCDE, OU కి స్వయంగా వెళ్లాలి. అక్కడ అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

  • పై కోర్సులలో ఒక్కో కోర్సులో 50 మందిని తీసుకొంటారు.
  • 1వ ఫేజ్ అడ్మిషన్లకు ఆగస్టు 03, 2022 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 16, 2022న ముగుస్తాయి.

Website : www.oucde.net

– Admissions in PGRRCDE OU