Admissions in Sircilla FAA : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Residential Educational Institutions Society-TTWREIS) ఆధ్వర్యంలో కొనసాగుతున్న సిరిసిల్లలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ (ఉమెన్) (TTWR Fine Arts Academy (Women))లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీఏ(ఆనర్స్) ఫ్యాషన్ డిజైన్, బీఏ(ఆనర్స్) ఇంటీరియర్ డిజైన్, బీఏ(ఆనర్స్) ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ డిగ్రీ కోర్సుల్లో ఫస్ట్ ఇయర్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మార్కుల్లో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
Details of Courses
1. బీఏ(ఆనర్స్) ఫ్యాషన్ డిజైన్ (BA (Hons) Fashion Design)
2. బీఏ(ఆనర్స్) ఇంటీరియర్ డిజైన్ (BA (Hons) Interior Design)
3. బీఏ(ఆనర్స్) ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ (BA (Photography & Digital Imaging)
Number Seats
బీఏ(ఆనర్స్) ఫ్యాషన్ డిజైన్ కోర్సులో 60 సీట్లు, బీఏ(ఆనర్స్) ఇంటీరియర్ డిజైన్ కోర్సులో 40 సీట్లు, బీఏ(ఆనర్స్) ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి.
Course Duration
ఈ కోర్సుల వ్యవధి మూడు సంవత్సరాలు ఉంటుంది.
Eligibility
- ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలలో 2021-22 విద్యా సంవత్సరంలో ఏదైనా కోర్సులో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన, 2022-23 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తిచేయబోయే మహిళా అభ్యర్థులు అర్హులు.
- 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.
- జూలై 1 నాటికి 16 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులు.
- ఎన్సీసీ/గేమ్స్ అండ్ స్పోర్ట్స్/ఎక్స్-సర్వీస్‌మెన్/అనాథ/ఏఈక్యూకి చెందిన విద్యార్థులకు రిజర్వేషన్ ప్రకారం సంబంధిత కమ్యూనిటీ కోటా కింద ఈ కేటగిరీలన్నింటికీ ఒక్కో కేటగిరీలో సీట్లు కేటాయించబడతాయి.
- విద్యార్థిని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000 మించకూడదు.
- ఇందుకు సంబంధించి తహసీల్దార్ జారీచేసిన సర్టిఫికెట్ జతపరచవలసి ఉంటుంది.
- తెలుగు/ఇంగ్లిష్ రెండు మీడియంలలో చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
How to Apply
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా The Secretary, TTWREIS, Gurukulam పేరిట, State Bank of India ,DSS bhavan ,Masab Tank Hyderabad లో చెల్లుబాటు అయ్యేలా రూ.300 డీడీ తీయాలి.
- ఆ తర్వాత www.ttwrdcs.ac.in లేదా https://tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్‌ను ఓపెన్ చేయాలి.
- అందులో Online applications are invited from female candidates all over Telangana for admission into first year 1 st year Under Graduate Courses of B A ( Fashion Design, B A ( Interior Design B A ( Hons)(Photography Digital Imaging. CLICK HERE TO APPLY పై క్లిక్ చేయాలి.
- దాంట్లో ప్రాస్పెక్టస్తో పాటు అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకొని అందులో రీసెంట్ పాస్ట్‌పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి.
- అందులోనే Fill & submit the GOOGLE FORM : https://forms.gle/aTyihBMxBY2Hep9Q8 అని ఉంటుంది.
- అందులో https://forms.gle/aTyihBMxBY2Hep9Q8 లింక్‌పై క్లిక్ చేయాలి. దానిలోని వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి.
- అనంతరం డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫాంకు ఇంటర్మీడియట్ మెమో, ఎస్సెస్సీ మెమో, కులం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, ఆధార్‌కార్డ్ జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు జతచేయాలి. అన్ని సర్టిఫికెట్లపై సంతకం చేయాలి.
- వాటన్నింటినీ మే 14, 2023 లోపు The Principal, TTWRDC (W), Siricilla, Lakshmipur Road, Tangelapally-505405, Rajanna Sircilla (Dist) చిరునామాకు పంపించాలి. పోస్టు ద్వారా పంపవచ్చు. లేదా నేరుగా వెళ్లి అందజేయవచ్చు.
- ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
- అర్హులైన అభ్యర్థులను స్పాట్ కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. కౌనెసలింగ్ తర్వాత అడ్మిషన్లు కల్పిస్తారు.
- ఎంపికైన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ఈ కింది సర్టిఫికెట్‌లు ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ తీసుకెళ్లాలి.
1) కుల ధృవీకరణ పత్రం
2) ఆదాయ ధ్రువీకరణ పత్రం
3) బదిలీ సర్టిఫికెట్ (టీసీ)
4) బోనఫైడ్ సర్టిఫికెట్
5) మార్కుల షీట్ / ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్
6) ఆధార్ కార్డ్
7) పాస్‌పోర్ట్ ఫోటోలు ఐదు
8) ఆరోగ్యశ్రీ/ రేషన్ కార్డ్
Important Points
- సిరిసిల్లలోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ మొదటి ప్రభుత్వ ఫైన్ ఆర్ట్స్ కోర్సుల కళాశాల.
- ఇందులో ఉచితంగా బోధిస్తారు.
- ఈ కాలేజీ హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతోంది.
- తెలంగాణలోని అన్ని జిల్లాల మహిళా అభ్యర్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఈ కోర్సులను ఇంగ్లిష్ మీడియంలోనే బోధిస్తారు.
- పూర్తి వివరాల కోసం 9121174434 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
– Admissions in Sircilla FAA