Admissions in Telugu University : హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం (Potti Sriramulu Telugu University) డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రవేశ పరీక్ష నిర్వహించి కోర్సులలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ ప్రాంగణంలో ఈ క్రింది కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ)
విభాగాలు: శిల్పం, చిత్ర లేఖనం, ప్రింట్ మేకింగ్
వ్యవధి: నాలుగు సంవత్సరాలు (ఎనిమిది సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-30, సెల్ఫ్ సపోర్టింగ్-20
అర్హతలు: ఇంటర్మీడియట్ పాసైన వారు అర్హులు.
కోర్సు పేరు: మాస్టర్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ (ఎంవీఏ)
విభాగాలు: శిల్పం, చిత్ర లేఖనం, ప్రింట్ మేకింగ్ (ఐదుగురికంటే తక్కువ ఉంటే ఆ విభాగం రద్దవుతుంది)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-25, సెల్ఫ్ సపోర్టింగ్-20
అర్హతలు: బీఎఫ్ఏ పాసైన వారు అర్హులు.
కోర్సు పేరు: ఎంఏ (జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-50, సెల్ఫ్ సపోర్టింగ్-20
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఏ/బీకాం/బీఎస్సీ/ బీఎఫ్ఏ డిగ్రీ పాసైన వారు అర్హులు.
కోర్సు పేరు: ఎంఏ (అనువర్తిత భాషాశాస్త్రం)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: 50
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో తెలుగు రెండో భాషగా బీఏ/బీకాం/బీఎస్సీ డిగ్రీ పాసైన వారు అర్హులు.
కోర్సు పేరు: ఎంఏ (కర్ణాటక సంగీతం)
విభాగాలు: గాత్రం, మృదంగం, వీణ, వయోలిన్
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: 40
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో కర్ణాటక సంగీతంలో డిగ్రీ పాసైన వారు అర్హులు. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా డిగ్రీ పాసై ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో సంగీతంలో సంబంధిత విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. లేదా సంగీతంలో సంబంధిత విభాగంలో ఆకాశవాణి ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి.
కోర్సు పేరు: ఎంఏ (తెలుగు)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: 70
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో మొదటి, రెండు సంవత్సరాలలో తెలుగు రెండో భాషగా బీఏ/బీకాం/బీఎస్సీ డిగ్రీ పాసైన అర్హులు. అలాగే, తెలుగు ఆప్షనల్ గా డిగ్రీ పాసైన వారు కూడా అర్హులే.
కోర్సు పేరు: ఎంఏ (హిస్టరీ, కల్చర్ & టూరిజం)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-40, సెల్ఫ్ సపోర్టింగ్-10
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఏ/బీకాం/బీఎస్సీ డిగ్రీ పాసైన అర్హులు.
కోర్సు పేరు: ఎంపీఏ నృత్యం
విభాగాలు: కూచిపూడి/ఆంధ్ర నాట్యం
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: 40
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్యంలో డిగ్రీ పాసైన వారు అర్హులు. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా డిగ్రీ పాసై.. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో కూచిపూడి నృత్యంలో సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య సంస్థలలో ఐదు సంవత్సరాల ప్రదర్శన అనుభవం ఉండాలి. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా కూచిపూడి విభాగంలో దూరదర్శన్ లో ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి.
కోర్సు పేరు: ఎంపీఏ (జానపద కళలు)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: 70
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో తెలుగు రెండో భాషగా బీఏ/బీకాం/బీఎస్సీ/ బీఎఫ్ఏ/ బీఏ (లాంగ్వేజెస్) డిగ్రీ పాసై ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో జానపద కళలు, రంగస్థల కళలు, సంగీతం, నృత్యంలో డిప్లొమా/సర్టిఫికెట్ కలిగి ఉండాలి. రేడియో/ దూరదర్శన్ లో జానపద సంగీతం/ నృత్యం సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
కోర్సు పేరు: ఎంపీఏ (రంగస్థల కళలు)
వ్యవధి: రెండు సంవత్సరాలు (నాలుగు సెమిస్టర్లు)
సీట్లు: 40
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో రంగస్థల కళల్లో బీఏ డిగ్రీ పాసై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో డిగ్రీ పాసై.. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రసిద్ధ నాట్య, నాటక కళా సంస్థలలో ఐదు సంవత్సరాల అనుభవం ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో రంగస్థల కళల్లో ఏడాది కాలపరిమితికి తక్కువ కాని డిప్లొమా చేసి ఉండాలి. లేదా రంగస్థల కళల విభాగంలో ఆకాశవాణి ‘బీ’ గ్రేడ్ ఆర్టిస్టు అయి ఉండాలి. లేదా దూరదర్శన్ లో రంగస్థల కళల కార్యక్రమాల్లో ఐదు సంవత్సరాలు పనిచేసి ఉండాలి. అందుకు సంబంధించిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ప్రొడక్ట్ డిజైన్
వ్యవధి: నాలుగు సంవత్సరాలు (ఎనిమిది సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-20, సెల్ఫ్ సపోర్టింగ్-40
అర్హతలు: 10+2 లేదా ఇంటర్మీడియట్ పాసైన అర్హులు.
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ విజువల్ కమ్యూనికేషన్
వ్యవధి: నాలుగు సంవత్సరాలు (ఎనిమిది సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-20, సెల్ఫ్ సపోర్టింగ్-40
అర్హతలు: 10+2 లేదా ఇంటర్మీడియట్ పాసైన అర్హులు.
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ ఇన్ ఇంటీరియర్ డిజైన్
వ్యవధి: నాలుగు సంవత్సరాలు (ఎనిమిది సెమిస్టర్లు)
సీట్లు: రెగ్యులర్-20, సెల్ఫ్ సపోర్టింగ్-40
అర్హతలు: 10+2 లేదా ఇంటర్మీడియట్ పాసైన అర్హులు.
కోర్సు పేరు: బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్
వ్యవధి: ఒక సంవత్సరం (రెండు సెమిస్టర్లు)
సీట్లు: 40
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఏదైనా డిగ్రీ పాసైన వారు అర్హులు.
రెగ్యులర్ (పూర్తికాలిక) కోర్సులలో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షలో 100 మార్కులు ఉంటాయి. పరీక్ష మల్టిపుల్ చాయిర్ విధానంలో ఉంటుంది.
కోర్సులలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షలో జనరల్ అభ్యర్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాలి.
ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగ అభ్యర్థులు 15 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది.
హైదరాబాద్, వరంగల్, రాజమండ్రి, శ్రీశైలం, కూచిపూడిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణాల్లో ప్రవేశ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
హాల్ టికెట్లు www.pstucet.org నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
సీట్ల సంఖ్య కంటే తక్కువ దరఖాస్తులు వస్తే ప్రవేశ పరీక్ష నిర్వహించకుండా విద్యార్హతల్లో మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
ప్రతి కోర్సులో 33 శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 25 శాతం (బీసీ(ఏ)- 7శాతం, బీసీ(బీ)- 10శాతం, బీసీ(సీ)- ఒక శాతం, బీసీ(డీ)- శాతం, బీసీ (ఇ) (ముస్లింలు) 4 శాతం), వికలాంగులకు 5 శాతం. ఈడబ్ల్యూఎస్ కు – 10 శాతం సీట్లు కేటాయిస్తారు.
ఈ కోర్సులకు అభ్యర్థులు ఆన్ లైన్ పద్ధతిలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ (www.pstucet.org) ను ఓపెన్ చేసి అందులో Online Application పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Proceed to pay Fee through Payment Gateway Using Credit Card / Debit Card పై క్లిక్ చేయాలి. అందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్
టికెట్ నెంబర్, అభ్యర్థి పేరు. చేరదలుచుకున్న క్యాంపస్ పేరు. చేయదలిచిన కోర్సు గ్రూపు. చేయదలిచిన కోర్సు పేరు. ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ ఎంటర్ చేసి రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు ప్రభుత్వ బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత Reference ID, Transaction ID వస్తాయి. వాటిని ఓ పేపర్ పై రాసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి www.pstucet.org ను ఓపెన్ చేసి అందులో Online Application పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Proceed to Venify and fill Application Form online if you have already paid పై క్లిక్ చేయాలి. Reference ID, Transaction ID ఎంటర్ చేసి Proceed to online Application Form filling పై క్లిక్ చేసి ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను నింపి సబ్మిట్ చేయాలి.
ప్రవేశ పరీక్ష దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 21, 2022
రూ.100 ఆలస్య రుసుముతో : ఆగస్టు 02, 2022
రూ.1000 ఆలస్య రుసుముతో ప్రవేశ పరీక్ష ముందు రోజు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూనివర్సిటీ చిరునామా:
లలిత కళాక్షేత్రం.
పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాద్ – 500 004
ఫోన్ నెంబర్లు: 040-23230435, 0404-2323041
– Admissions in Telugu University
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…