Admissions in TSWRDC SiricillaA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions in TSWRDC Siricilla : హైదరాబాద్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Social Welfare Residential Educational Institutions Society-TSWREIS) సిరిసిల్లలో గల తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల (Telangana Social Welfare Degree College (TSWRDC) for Women, Siricilla) లో B.Sc (Hons) Design and Technology కోర్సులో మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. Telangana Social Welfare – Design and Technology Aptitude Test (TSW-DeTAT ’22) ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.

Eligibility

ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
ఇంటర్మీడియట్ లో వృత్తి విద్యా కోర్సు అయిన కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించకూడదు.

Selection Procedure

  • స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
  • స్క్రీనింగ్ టెస్ట్ 100 మార్కులకు నిర్వహిస్తారు. టెస్ట్ లో రెండు సెక్షన్లు ఉంటాయి.
  • మొదటి సెక్షన్ లో జనరల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 30 మార్కులు ఉంటాయి.
  • రెండో సెక్షన్ లో డిజైన్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. 70 మార్కులు ఉంటాయి.
  • జనరల్ ఎబిలిటీ సెక్షన్ లో లాజికల్ ఎబిలిటీ, బేసిక్ మ్యాథ్స్, కాంప్రహెన్షన్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ తదితర సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • డిజైన్ ఎబిలిటీ సెక్షన్ లో దుస్తుల పరిశ్రమలో ప్రాథమిక పరిజ్ఞానంపై ప్రశ్నలు ఇస్తారు. డిజైజన్ ఎబిలిటీ, బేసిక్ డ్రాయింగ్, స్కెచింగ్, కలరింగ్ తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
  • ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ విధానంలో మరియు షార్ట్ ఆన్సర్స్, డ్రాయింగ్/స్కెచింగ్ విధానంలో ఉంటాయి.
    డ్రాయింగ్/ స్కెచింగ్ కు అవసరమైన కలర్ పెన్సిళ్లు, ఎరేజర్, స్కెచ్ పెన్నులు అభ్యర్థులే తీసుకెళ్లాల్సి ఉంటుంది.

How to Apply

ఆసక్తి కలిగిన అభ్యర్థులు TSWREIS వెబ్ సైట్ (www.tswreis.ac.in)ను ఓపెన్ చేసి అందులోని Application for admission into the B.Sc.(Hons), Design and Technology Course at TSWRDCW, Siricilla(W) నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Step-1: Registration with payment పై క్లిక్ చేయాలి. అందులో పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, జెండర్ తదితర వివరాలు నింపి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు నిమిత్తం రూ.150 చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Step-2 : Online application పై క్లిక్ చేసి పుట్టిన తేదీ (Date of Birth), ఫోన్ నెంబర్ (Contact Number) ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి.
ఆ తర్వాత సమాచారం కోసం అభ్యర్థులు TSWREIS వెబ్ సైట్ (www.tswreis.ac.in)ను తరచూ చూస్తుండాలి.

Important Points

  • ఈ కోర్సు వ్యవధి నాలుగు (04) సంవత్సరాలు.
  • ఈ కోర్సులో మొత్తం నలభై (40) సీట్లు ఉంటాయి.
  • కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 24, 2022

– Admissions in TSWRDC Siricilla