Admissions in TTWR Fine Arts School

Admissions in TTWR Fine Arts School : హైదరాబాద్ లోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Residential Educational Institutions Society-TTWRES) మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల ఫైన్ ఆర్ట్స్ పాఠశాల (బాల-బాలికలు) (Telangana Tribal Welfare Residential Fine Arts School(Co-ed))లో 2022-23 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ (Rc.No.TTWRES-ACAD/ACB5/FART/1/2022) జారీ చేసింది. ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష (Entrance Test), నైపుణ్య పరీక్ష (Skill Test) ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థినీ విద్యార్థులకు 6వ తరగతి పాఠాలతో పాటు మ్యూజిక్, డ్యాన్స్, ఫైన్ ఆర్ట్స్ నేర్పిస్తారు.

Name of Courses & Seats

1.వోకల్ (Vocal), సీట్లు-16
2.వయోలిన్ (Violin), సీట్లు-6
3. మృదంగం (Mrudangam), సీట్లు-6
4.తబలా (Tabla), సీట్లు-6
5.కీ బోర్డు (Keyboard), సీట్లు-6
6.గిటార్ (Guitar), సీట్లు-6
7.నృత్యం (Dance), సీట్లు-16
8.పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ (Painting & Drawing), సీట్లు-18

Eligibility

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ స్కూళ్లు, జిల్లా పరిషత్ స్కూళ్లలో 2022 ఏప్రిల్ లో 2022 విద్యా సంవత్సరంలో 5వ తరగతి ఉత్తీర్ణులైన బాల బాలికలు మాత్రమే ప్రవేశ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
అలాగే, విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక (2022-23) ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు మించకూడదు. ఇందుకు సంబంధించి తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. తెలుగు మరియు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరు కావొచ్చు.

Age Limit

విద్యార్థులు ఏప్రిల్ 1, 2010కి ముందు, మార్చి 31, 2012 తర్వాత జన్మించి ఉండకూడదు. మార్చి 31, 2012కి ముందు, ఏప్రిల్ 1, 2010 తర్వాత జన్మించి ఉండాలి. స్టడీ సర్టిఫికెట్ లేదా ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ లో ఉన్న పుట్టిన తేదీనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.

How to Apply

  • ఆసక్తి కలిగిన విద్యార్థులు TTWRES వెబ్ సైట్ (https://tgtwgurukulam.telangana.gov.in/)ను ఓపెన్ చేసి అందులోని TTWR FINE ARTS of 6th CLASS for the Acad Year 2022 23 నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత కుడి పక్కన ఉన్న ఆప్షన్లలో Click here : To pay application Fee పై క్లిక్ చేయాలి.
  • అందులో పేరు, పుట్టిన తేదీ ఫోన్ నెంబర్, కేటగిరీ ఇతర వివరాలు నింపి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లో గానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా గానీ అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లి Click here : To submit online application పై క్లిక్ చేసి పుట్టిన తేదీ
    (Date of Birth), ఫోన్ నెంబర్ (Contact Number) ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. అందులో పూర్తి వివరాలు ఎంటర్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి.
  • విద్యార్థులు తమ రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను 100 కేబీ సైజ్ లోపు, సంతకం 50 కేబీ సైజ్ లోపు జేపీజీ లేదా
    జేపీఈజీ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి.

Written Test

రాత పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. 5వ తరగతి వరకు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇస్తారు. తెలుగు నుంచి 20 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 30 ప్రశ్నలు, గణితం నుంచి 30 ప్రశ్నలు, సైన్స్ నుంచి 10 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఉంటుంది. ఓఎంఆర్ షీట్ లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్ భాషలోనే ఉంటుంది.
రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని నైపుణ్య పరీక్షకు ఆహ్వానిస్తారు. రాత పరీక్ష, నైపుణ్య పరీక్షలో మెరిట్ సాధించిన విద్యార్థులకు మాత్రమే
అడ్మిషన్లు కల్పిస్తారు.
అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో గానీ, హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకొనే సమయంలో గానీ ఏమైనా సమస్యలు తలెత్తితే 9121174434/9121333472 నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే,
మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఈ నంబర్ అందుబాటులో ఉంటుంది.

Important Dates

దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ. 10 జూలై, 2022
హాల్ టికెట్ల డౌన్ లోడ్: 15 జూలై, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: 24 జూలై, 2022 (ఆదివారం)
ప్రవేశ పరీక్ష ఫలితాలు వెల్లడి: 03 ఆగస్టు, 2022
స్కిల్ టెస్ట్ నిర్వహించు తేదీ: 08 ఆగస్టు, 2022
అడ్మిషన్ల ప్రారంభ తేదీ: 16 జూలై, 2022

– Admissions in TTWR Fine Arts School