Admissions in Warangal Sainik SchoolA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions in Warangal Sainik School : వరంగల్ జిల్లా అశోక్​నగర్​లోని బాలుర సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్​ ఎంపీసీ ఫస్ట్​ ఇయర్​లో అడ్మిషన్లు కల్పించేందుకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Residential Educational Institutions Society‌‌-TTWREIS) నోటిఫికేషన్​ జారీ చేసింది. రాత పరీక్ష ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ (NDA), సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) తదితర సైనిక దళాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు గాను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా అశోక్​నగర్​లో బాలుర సైనిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి, ఇంటర్మీడియట్​ ఎంపీసీ ఫస్ట్​ ఇయర్​లో సీబీఎస్​ఈ (CBSE) సెలబస్​లో బోధించడంతో పాటు ఎన్​డీఏ, ఎస్​ఎస్​బీ శిక్షణ కూడా ఇస్తారు. సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. అలాగే, ఉచిత వసతి, భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలు తదితరాలు అందిస్తారు.

Number of Seats

ఈ పాఠశాలలో 6వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియట్​ ఎంపీసీ ఫస్ట్​ ఇయర్​లో 80 సీట్లు ఉంటాయి. ఇందులో బీసీ విద్యార్థులకు ఐదు(05), ఎస్సీ విద్యార్థులకు ఐదు(05), మైనార్టీ విద్యార్థులకు ఐదు(05), ఎస్టీ విద్యార్థులకు యాభై ఎనిమిది (58), ఇతర కులాల విద్యార్థులకు ఐదు(05), గురుకుల ఎంప్లాయీస్​ కోటాలో ఒకటి, స్పోర్ట్స్​ కోటాలో ఒక సీటు కేటాయిస్తారు. ఒక వేళ ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ, గురుకులం ఉద్యోగుల కోటా, స్పోర్ట్స్ కోటాలో ఖాళీలు ఉంటే వాటిని మెరిట్  ప్రకారం ఎస్టీ విద్యార్థులకే కేటాయిస్తారు.

Eligibility

  • 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం 2022-23 విద్యా సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి ఐదో తరగతి వార్షిక పరీక్షకు హాజరుకాబోయే వారు బాలుర విద్యార్థులు అర్హులు.
  • ఇంటర్​మీడియట్​ ఎంపీసీ ఫస్ట్​ ఇయర్​లో అడ్మిషన్ల కోసం 2022-23 విద్యా
    సంవత్సరంలో ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి వార్షిక పరీక్షకు హాజరైన బాలుర విద్యార్థులు అర్హులు.
  • విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు మించకూడదు.
  • తెలుగు, ఇంగ్లిష్ రెండు మీడియంల విద్యార్థులు అర్హులు.

Age Limit

ఇంటర్మీడియట్​లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్​ 01, 2006 నుంచి జూన్​ 31, 2008 మధ్య జన్మించిన బాలురు అర్హులు.
6వ తరగతిలో అడ్మిషన్ల కోసం ఏప్రిల్​ 01, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్య జన్మించిన బాలురు అర్హులు.

Selection Procedure

రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్​ ఆధారంగా, శారీరక సామర్థ్య పరీక్ష, మెడికల్​ టెస్టులు నిర్వహించిన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

Written Test

  • రాత పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటుంది.
  • ప్రశ్నలు 100 ఉంటాయి.
  • ఆరో తరగతి రాత పరీక్షకు ఐదో తరగతి స్థాయి నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • తెలుగు నుంచి 20 ప్రశ్నలు, ఇంగ్లిష్ నుంచి 30 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 30 ప్రశ్నలు, సైన్స్  నుంచి 10 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు.
  • ఇంటర్ రాత పరీక్షకు 8-10వ తరగతి స్థాయి నుంచి ప్రశ్నలు ఇస్తారు.
  • ఇంగ్లిష్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 40 ప్రశ్నలు, ఫిజిక్స్ నుంచి 20 ప్రశ్నలు, కెమిస్ట్రీ నుంచి 15 ప్రశ్నలు, బయాలజీ నుంచి 5 ప్రశ్నలు ఇస్తారు.

How to Apply

ఆసక్తికలిగిన విద్యార్థులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్​ చేసుకొని ఆ తర్వాత రూ.200 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ఆన్​లైన్​ అప్లికేషన్​ ఫాం నింపి సబ్మిట్​ చేయాలి. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 9121174434 / 9121333472 నెంబర్లకు ఫోన్​చేసి పరిష్కారం పొందవచ్చు.

ఆన్​లైన్​ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్​ 08, 2023

– Admissions in Warangal Sainik School