Admissions in Warangal Sainik School : వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లోని బాలుర సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో అడ్మిషన్లు కల్పించేందుకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Tribal Welfare Residential Educational Institutions Society-TTWREIS) నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష ఆధారంగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) తదితర సైనిక దళాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు గాను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా అశోక్‌నగర్‌లో బాలుర సైనిక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి, ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో సీబీఎస్ఈ (CBSE) సెలబస్‌లో బోధించడంతో పాటు ఎన్డీఏ, ఎస్ఎస్బీ శిక్షణ కూడా ఇస్తారు. సైనిక శిక్షణే ప్రధానాంశంగా ఉంటుంది. అలాగే, ఉచిత వసతి, భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలు తదితరాలు అందిస్తారు.
ఈ పాఠశాలలో 6వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 80 సీట్లు ఉంటాయి. ఇందులో బీసీ విద్యార్థులకు ఐదు(05), ఎస్సీ విద్యార్థులకు ఐదు(05), మైనార్టీ విద్యార్థులకు ఐదు(05), ఎస్టీ విద్యార్థులకు యాభై ఎనిమిది (58), ఇతర కులాల విద్యార్థులకు ఐదు(05), గురుకుల ఎంప్లాయీస్ కోటాలో ఒకటి, స్పోర్ట్స్ కోటాలో ఒక సీటు కేటాయిస్తారు. ఒక వేళ ఓసీ, బీసీ, ఎస్సీ, మైనారిటీ, గురుకులం ఉద్యోగుల కోటా, స్పోర్ట్స్ కోటాలో ఖాళీలు ఉంటే వాటిని మెరిట్ ప్రకారం ఎస్టీ విద్యార్థులకే కేటాయిస్తారు.
ఇంటర్మీడియట్లో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 01, 2006 నుంచి జూన్ 31, 2008 మధ్య జన్మించిన బాలురు అర్హులు.
6వ తరగతిలో అడ్మిషన్ల కోసం ఏప్రిల్ 01, 2011 నుంచి మార్చి 31, 2013 మధ్య జన్మించిన బాలురు అర్హులు.
రాత పరీక్షలో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా, శారీరక సామర్థ్య పరీక్ష, మెడికల్ టెస్టులు నిర్వహించిన విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు.
ఆసక్తికలిగిన విద్యార్థులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫాం నింపి సబ్మిట్ చేయాలి. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే 9121174434 / 9121333472 నెంబర్లకు ఫోన్‌చేసి పరిష్కారం పొందవచ్చు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 08, 2023
– Admissions in Warangal Sainik School
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…