Admissions into BPT NursingA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Admissions into BPT Nursing : వరంగల్ లోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of Health Sciences-KNRUHS) 2022-23 విద్యా సంవత్సరానికి గాను కన్వీనర్ కోటా కింద బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (BPT), నాలుగు సంవత్సరాల బీ.ఎస్సీ (నర్సింగ్) (B.Sc(Nursing)), రెండు సంవత్సరాల పోస్ట్ బేసిక్ బీ.ఎస్సీ(నర్సింగ్) (P.B.B.Sc(Nursing)) కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులకు రాష్ట్రంలోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Details of Courses

1.Bachelor of Physiotheraphy (BPT)
2. Bachelor of Science in Nursing (B.Sc (Nursing)) 4 Years Degree Course
3. Post Basic Bachelor of Science in Nursing (P.B.B.Sc (Nursing)) 2 Years Degree Course

Eligibility

BPT : ఈ కోర్సులో అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఈ కింది కోర్సులలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి.
1. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్
2. ఇంటర్మీడియట్ వొకేషనల్ (ఫిజియోథెరపీ)
3. ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఆఫ్ బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్
4. బయోలాజికల్ మరియు ఫిజికల్ సైన్సెస్ తో TOSS (డిసెంబర్ 31, 2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి)

B.Sc(Nursing) 4Yrs Course : ఈ కోర్సులో అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఈ కింది కోర్సులలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి.
1. ఇంటర్మీడియట్ (10+2) సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) సబ్జెక్టులతో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి. ఇంగ్లిష్ కంపల్సరీ సబ్జెక్టు.
2. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులతో AISSCE/CBSE/ICSE/SSCE/HSCE/NIOS/ TOSS గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులు కావాలి.
3. బయోలాజికల్ మరియు ఫిజికల్ సైన్సెస్ లో బ్రిడ్జ్ కోర్సుతో ఇంటర్మీడి
4. సైన్స్ గ్రూపు సబ్జెక్టులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనా సరిపోతుంది. ఇంగ్లిష్ కంపల్సరీ సబ్జెక్టుగా ఉండాలి.

P.B.B.Sc(Nursing) 2Yrs Course : ఈ కోర్సులో అడ్మిషన్ కోసం అభ్యర్థులు ఈ కింది కోర్సులలో ఏదైనా ఒకటి చేసి ఉండాలి.
1. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
2. తెలంగాణలోని యూనివర్సిటీ లేదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లేదా NIOS, TOSS ఇంటియన్ నర్సింగ్ కౌన్సిల్ రెగ్యులేషన్స్ ద్వారా
గుర్తించబడిన ఏదైనా పరీక్ష (10+2 నమూనాలో)లో ఉత్తీర్ణులై.. తెలంగాణ ప్రభ్వుం లేదా నర్సింగ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాచే గుర్తింపు పొందిన సంస్థలో జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ (GNM) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఆగస్టు 31, 2022 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య శాఖ మరియు వైద్య విధాన పరిషత్ లలో స్టాఫ్ నర్స్ గా రెండు (02) సంవత్సరాల సర్వీసు పూర్తిచేసి ఉండాలి. వారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదా వైద్య విధాన పరిషత్ కమిషనర్ జారీ చేసిన సర్వీస్ సర్టిఫికెట్, స్టాఫ్ నర్స్ గా రెగ్యులరైజేషన్ చేసిన సర్టిఫికెట్లు జతచేయాలి. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు కేటాయిస్తారు.

Age Limit

BPT, B.Sc(Nursing) 4Yrs కోర్సులకు అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. జనవరి 02, 2006న లేదా ఆ తర్వాత జన్మించిన వారు అనర్హులు.
P.B.B.Sc(Nursing) 2Yrs కోర్సుకు అభ్యర్థుల కనిష వయసు 21 సంవత్సరాలు, గరిష్ట వయసు 45 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ఠ వయసులో మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.

Selection Criteria

అభ్యర్థులు ఆన్ లైన్ లో సబ్మిట్ చేసిన దరఖాస్తులోని వివరాలు, అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లను పరిశీలించి, విద్యార్హతలు, లోక్ నాన్ లోకల్, కులం ఆధారంగా తాత్కాలిక మెరిట్ జాబితాను తయారుచేసి యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ తేదీలను ప్రకటిస్తారు. వివరాల కోసం అభ్యర్థులు తరచూ యూనివర్సిటీ వెబ్ సైట్ ను చూస్తుండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన విధంగా ట్యూషన్ ఫీజు ఉంటుంది.

Registration and Processing Fee

ఈ కోర్సులలో అడ్మిషన్ కోసం అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ మరియు బీసీ అభ్యర్థులు రూ.2,500, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు రూ.2,000 చెల్లించాలి. బ్యాంక్ ట్రాన్హాక్షన్ ఫీజులు అదనం. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ఈ ఫీజు ఒకసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు.

How to Apply

ఈ కోర్సులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
అయితే, అభ్యర్థులు ముందుగా ఈ కోర్సులకు సంబంధించి కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్ సైట్ (www.knruhs.telan-gana.gov.in) లో విడివిడిగా ఉంచిన ప్రాస్పెక్టస్ లను పూర్తిగా చదవాలి.
ఆ తర్వాత ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు https://tspgmed.tsche.in వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి. అందులో ముందుగా మొబైల్ అండ్ ఈ-మెయిల్,
క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత డాటా అప్ డేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫాంలోని అన్ని ఖాళీలు తప్పకుండా పూరించాలి.
అనంతరం ఈ కింద సూచించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. బర్త్ సర్టిఫికెట్ (ఎస్సెస్సీ మార్క్స్ మెమో)
2. అర్హత పరీక్షల (ఇంటర్మీడియట్/ జీఎన్ఎం) మార్కుల మెమోలు
3. 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్/ జీఎన్ఎం వరకు స్టడీ సర్టిఫికెట్లు
4. ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
5. ఇటీవల తీసుకొన్న కులం సర్టిఫికెట్
6. ఇటీవల తీసుకొన్న తల్లిదండ్రుల ఆదాయం సర్టిఫికెట్
7. అభ్యర్థి లేదా తల్లిదండ్రుల రెసిడెన్స్ సర్టిఫికెట్ (ఇతర రాష్ట్రాలలో చదివిన అభ్యర్థులు మాత్రమే)
8. తల్లిదండ్రుల ఉద్యోగ ధ్రువీకరణ పత్రం (అవసరమైన వారు మాత్రమే)
9. ఆధార్ కార్డ్
10. సర్వీస్ సర్టిఫికెట్ (ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు)
11. బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికెట్ కోర్సు చేసిన వారు మాత్రమే)
12. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
13. అభ్యర్థి రీసెంట్ పాస్ట్ పోర్ట్ ఫొటో, సంతకం
ఫొటో, సంతకం జేపీజీ/ జేపీఈజీ ఫార్మాట్ లో మిగిలిన అన్ని సర్టిఫికెట్లు పీడీఎఫ్ ఫార్మాట్ లో అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం 100 కేబీ సైజ్, మిగిలిన అన్ని సర్టిఫికెట్లు 500 కేబీ సైజ్ లోపు ఉండాలి.
అవసరమైన అన్ని సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం తప్పకుండా అప్ లోడ్ చేయాలి. లేదంటే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో పై అన్ని సర్టిఫికెట్లు (ఒరిజినల్) తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
సీటు పొందిన తర్వాత సంబంధిత కళాశాలలో అప్లికేషన్ ఫాంతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఒక నెట్ జిరాక్స్ కాపీలు
అందజేయాల్సి ఉంటుంది.

Helpline Numbers

ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు ఈ కింది ఫోన్ నెంబర్లు, ఈ-మెయిల్ ను సంప్రదించవచ్చు.

సాంకేతిక సహాయం కోసం :
ఫోన్ నెంబర్లు : 9392685856, 7842542216, 9059672216
ఈ-మెయిల్ : [email protected]

అప్లికేషన్ ఫీజు చెల్లింపులో సమస్యలు తలెత్తితే : 9121013812 నెంబర్ ను సంప్రదించాలి.

నిబంధనలపై వివరణ కోసం :
ఫోన్ నెంబర్లు : 9490585796, 8500646769

ఇతర సమస్యల పరిష్కారం కోసం :
[email protected] కు మెయిల్ చేయవచ్చు.

పై ఫోన్ నెంబర్లకు ఆఫీసు సమయాల్లో మాత్రమే (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫోన్ చేయాలి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 23, 2022 (ఉదయం 9 గంటల నుంచి)
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: అక్టోబర్ 03, 2022 (సాయంత్రం 6 గంటల వరకు)

– Admissions into BPT Nursing