Education

Admissions into PG Medical/Diploma Courses

Admissions into PG Medical Courses : తెలంగాణ రాష్ట్రంలోని కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of Health Sciences- KNRUHS) మరియు నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) అనుబంధ మెడికల్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను కన్వీనర్ కోటా కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ/ డిప్లొమా కోర్సులలో (Post Graduate Medical Degree/Diploma courses) ప్రవేశాలకు కాళోజీ నారాయణ రావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. NEET-PG-2022 లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Cut-off score in NEET-PG-2022

NEET-PG-2022లో అభ్యర్థులు కటాప్ స్కోర్ ఈ కింది విధంగా లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి.

SC/ST/OBC Category :
Minimum Eligibility Criteria : 40th Percentile
Cut off Score (out of 800) : 245

Persons with Disability (OC) :
Minimum Eligibility Criteria : 45th Percentile
Cut off Score (out of 800) : 260

General Category :
Minimum Eligibility Criteria : 50th Percentile
Cut off Score (out of 800) : 275

Eligibility

  • అభ్యర్థులు NEET-PG-2022లో కటాప్ స్కోర్ లేదా అంతకంటే ఎక్కువ సాధించి ఉండాలి.
  • మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన మెడికల్ ఇనిస్టిట్యూట్ లో ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణులై ఉండాలి.
  • రొటేటింగ్ ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా/ స్టేట్ మెడికల్ కౌన్సిల్ లో శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి.
  • జూలై 31 2022 లోపు ఎంసీఐ/ ఎన్ఎంసీ గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీలో ఇంటర్న్ షిప్ పూర్తిచేసి ఉండాలి.

Registration and Processing Fee

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ మరియు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ మరియు బీసీ అభ్యర్థులు రూ.5,500, ఎస్సీ మరియు ఎన్టీ అభ్యర్థులు రూ.5000 చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించాలి.

How to Apply

ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు https://tspgmed.tsche.in వెబ్సైట్ లోకి లాగిన్ కావాలి. అందులో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫాంను పూరించి సబ్మిట్ చేయాలి. అలాగే, ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
2. NEET-PG-2022 అడ్మిట్ కార్డు మరియు ర్యాంక్ కార్డ్
3. ఒరిజినల్/ ప్రొవిజినల్ డిగ్రీ సర్టిఫికెట్
4. ఆధార్ కార్డ్
5. స్టడీ సర్టిఫికెట్లు (ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు)
6. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాలలో చదివిన వారు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు
7. ఇటీవల తీసుకొన్న కులం సర్టిఫికెట్
8. మైనారిటీ సర్టిఫికెట్ (మైనారిటీ అభ్యర్థులు మాత్రమే)
9. సర్వీస్ సర్టిఫికెట్ (ఈ నెలలో పొందినదే అప్ లోడ్ చేయాలి)
10. ఇంటర్న్ షిప్ సర్టిఫికెట్
11. శాశ్వత మెడికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
12. పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిప్లొమా సర్టిఫికెట్
13. ఫొటో ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్ కార్డు)
14. ఇతర రాష్ట్రాలలో ఎంబీబీఎస్ చదివిన అభ్యర్థులు 10 సంవత్సరాల రెసిడెన్స్ సర్టిఫికెట్ అప్ లోడ్ చేయాలి.

Important Points

ఆన్ లైన్ అప్లికేషన్ ఫాంను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి.
సీటు పొందిన తర్వాత సంబంధిత కళాశాలలో అప్లికేషన్ ఫాంతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సెల్ఫ్ అటెస్ట్ చేసిన ఒక సెట్ జిరాక్స్ కాపీలు
అందజేయాల్సి ఉంటుంది.
దివ్యాంగులు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే మెడికల్ బోర్డు ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

Selection Criteria

అభ్యర్థులు ఆన్ లైన్ లో సబ్మిట్ చేసిన దరఖాస్తులోని వివరాలు, అప్ లోడ్ చేసిన సర్టిఫికెట్లను పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను.
యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఉంచుతారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ తేదీలను ప్రకటిస్తారు. అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

Helpline Numbers

ఆన్ లైన్ దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు ఈ కింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
సాంకేతిక సహాయం కోసం :
ఫోన్ నెంబర్లు 9392685856, 7842542216, 9059672216
ఈ-మెయిల్ : tspgmed2022@gmail.com

నిబంధనలపై వివరణ కోసం :
ఫోన్ నెంబర్లు 9490585796, 8500646769

ఇతర సమస్యల పరిష్కారం కోసం knrpgadmission2022@gmail.com కు మెయిల్ చేయవచ్చు.
పై ఫోన్ నెంబర్లకు ఆఫీసు సమయాల్లో మాత్రమే (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) ఫోన్ చేయాలి.

ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల అప్ లోడ్ కు చివరి తేదీ : ఆగస్టు 30, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)

– Admissions into PG Medical Courses

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago