AP College of JournalismA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

AP College of Journalism : హైద‌రాబాద్ లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం (AP College of Journalism) 2022-23 విద్యా సంవత్సరానికి ప‌లు జ‌ర్న‌లిజం కోర్సుల్లో ప్ర‌వేశానికి నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం నాలుగు (04) కోర్సుల్లో అడ్మిష‌న్ల‌కు ప్ర‌క‌ట‌న‌ విడుద‌ల చేసింది. ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్ లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

Details of Courses

1. పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం (PG Diploma in Journalism-PGDJ)
2. డిప్లొమా ఇన్‌ జర్నలిజం (Diploma in Journalism-DJ)
3. డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం(Diploma in TV Journalism-DTVJ)
4. సర్టిఫికెట్‌ కోర్స్‌ ఆఫ్‌ జర్నలిజం(Certificate Course in Journalism-CJ)

PG Diploma in Journalism

కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం
విద్యార్హ‌త‌: ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
వ్య‌వ‌ధి: ఒక సంవ‌త్స‌రం (12 నెల‌లు)
మీడియం: తెలుగు/ఇంగ్గిష్‌
ఫీజు: రూ.21,000

Diploma in Journalism

కోర్సు పేరు: డిప్లొమా ఇన్‌ జర్నలిజం
విద్యార్హ‌త‌: ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
వ్య‌వ‌ధి: ఆరు (06) నెల‌లు
మీడియం: తెలుగు/ఇంగ్గిష్‌
ఫీజు: రూ.16,000

Diploma in TV Journalism

కోర్సు పేరు: డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం
విద్యార్హ‌త‌: ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు అర్హులు.
వ్య‌వ‌ధి: ఆరు (06) నెల‌లు
మీడియం: తెలుగు
ఫీజు: రూ.16,000

Certificate Course in Journalism

కోర్సు పేరు: సర్టిఫికెట్‌ కోర్స్ ఇన్‌ జర్నలిజం
విద్యార్హ‌త‌: ప‌దో త‌ర‌గ‌తి (ఎస్సెస్సీ) పాసైన‌వారు అర్హులు.
వ్య‌వ‌ధి: మూడు (03) నెల‌లు
మీడియం: తెలుగు/ఇంగ్గిష్‌
ఫీజు: రూ.8,000

Important Points

  • ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ గుర్తింపు (Recognized by Govt of AP) పొందిన క‌ళాశాల‌.
  • పై కోర్సుల సెల‌బ‌స్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయ్య‌ర్ ఎడ్యుకేష‌న్ (Syllabus Approved by APSCHE) ఆమోదం పొందిన‌ది.
  • ఈ కోర్సులను రెగ్యులర్ విధానంలో అలాగే, దూరవిద్య ద్వారా కూడా చేయవచ్చు.
  • తెలుగు లేదా ఇంగ్లిష్ మీడియంలో చేయ‌వ‌చ్చు.
  • కొవిడ్‌-19 కారణంగా మరి కొన్నినెలల పాటు అందరికీ ఆన్ లైన్ లోనే తరగతులు నిర్వ‌హించ‌నున్నారు.

How to Apply

ఆస‌క్తి క‌లిగిన‌, అర్హులైన అభ్య‌ర్థులు ముందుగా కాలేజీ బ్యాంక్ అకౌంట్ (Account Name: Director, A P College of Journalism, Bank Name : Karur Vysya Bank, Abids, Hyderabad. Account No. : 1443155000015751, IFSC Code : KVBL0001443) కు ఆన్ లైన్ ద్వారా రూ.500 ట్రాన్స్ ఫర్ చేయాలి. నగదు, చెక్కు, డీడీ అనుమతించరు.
నగదు బదిలీ చేసిన త‌ర్వాత [email protected] ఈ-మెయిల్‌ కు పేరు, అడ్రస్‌ తో పాటు 500 రూపాయ‌ల‌కు సంబంధించిన‌ Transaction Details పంపించాలి.
నగదు అందిన వెంట‌నే అభ్య‌ర్థి Registration ప్రాసెస్ అవుతుంది. ఈ-మెయిల్ ద్వారా నంబర్ ముద్రించిన దరఖాస్తు ఫారం పంపిస్తారు.
ఆ దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని అందులోని వివ‌రాల‌న్నీ పూర్తి చేయాలి. దరఖాస్తుఫారంలో సూచించిన విధంగా మొదటి వాయిదా ఫీజు ఆన్ లైన్ లో చెల్లించి, సంబంధిత డాక్యుమెంట్లను ఆన్ లైన్ లోనే అప్ లోడ్ చేయాలి.

పూర్తి వివరాలకు 98485 12767 , 83415 58346, 72860 13388 ఫోన్‌ నెంబర్లను సంప్రదించవచ్చు.
దరఖాస్తు ఫారం పొందటానికి చివరి తేదీ: 5 ఆగస్టు 2022.
పూర్తి చేసిన దరఖాస్తు పంపడానికి చివరి తేదీ: 12 ఆగస్టు 2022

కళాశాల చిరునామా:
AP College Of Journalism, First Floor, Chabda Towers,
SRT-42 (Near Ashok Nagar Cross Roads) Jawahar Nagar, Hyderabad-500 020.

– AP College of Journalism