Apply Various Programmes in NALSAR

Apply Various Programmes in NALSAR : నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ లో 2022-23 విద్యా సంవత్సరంలో రెండేళ్ల వ్యవధి గల ఎంఏ, ఏడాది వ్యవధి గల అడ్వాన్సుడ్ డిప్లొమా ప్రోగ్రామ్ లలో ప్రవేశానికి ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా www.dde.nalsar.ac.in లేదా www.nalsarpro.org వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

మొదట ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, రాష్ట్రం, చేయబోయే ప్రోగ్రామ్ పేరు, ఈ నోటిఫికేషన్ గురించి ఎలా తెలిసింది తదితర వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఈ-మెయిల్ ఐడీకి వస్తాయి. అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ లను మార్చకూడదు. ఒక అభ్యర్థి ఒక ప్రోగ్రామ్ ను
మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఒక్కసారి ఎంచుకున్న ప్రోగ్రామ్ ను మార్చుకోవడానికి వీలు ఉండదు.

ఈ-మెయిల్ కు వచ్చిన ఐడీ, పాస్ వర్డ్ తో లాగిన్ కావాలి. అందులో అప్లికేషన్ ఫాంను పూర్తి నింపాలి. పేరును పదో తరగతి మెమోలో ఉన్నట్టుగా పూర్తిగా రాయాలి. జెండర్, క్యాటగిరీ, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, ఏదైనా ఒక ఐడీ ప్రూఫ్, తల్లిదండ్రుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు, విద్యార్హతలు నింపాలి. అడ్రస్ ప్రస్తుతం అభ్యర్థులు నివసిస్తున్నది మాత్రమే ఇవ్వాలి. అదే అడ్రస్ కు ప్రోగ్రామ్ కు సంబంధించిన మెటీరియల్, ఐడీ కారు, ఇతరాలు పంపిస్తారు. అన్ని వివరాలు నింపిన తర్వాత ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.

Documents to be Uploaded

1. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో (నైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి)
2. అటెస్టెడ్ చేయించిన పదో తరగతి మెమో (సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్ మాత్రమే అప్ లోడ్ చేయాలి)
3. అటెస్టెడ్ చేయించిన ఇంటర్మీడియట్ మెమో (సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్ మాత్రమే అప్ లోడ్ చేయాలి)
4. ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ (సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్ మాత్రమే అప్ లోడ్ చేయాలి)
5. అటెస్టెడ్ చేయించిన క్యాటరిగీ సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ) ( సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్ మాత్రమే అప్ లోడ్ చేయాలి)
6. డిఫెన్స్ ఐడీ ప్రూఫ్ (సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్ అప్ లోడ్ చేయాలి)
7. ఫలితాల కోసం ఎదురుచూసే వారు అండర్ టేకింగ్ లెటర్ సబ్మిట్ చేయాలి. (సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్ మాత్రమే అప్ లోడ్ చేయాలి)
8. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వారు గత ఏడాదికి సంబంధించిన మార్క్స్ షీట్ ను సబ్మిట్ చేయాలి. (నైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి, పీడీఎఫ్ మాత్రమే అప్ లోడ్ చేయాలి)
9. డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రొవిజినల్ లేదా ఒరిజినల్ డిగ్రీని అటెస్టెడ్ చేయించి సబ్మిట్ చేయాలి. (సైజ్ 1 ఎంబీ లోపు ఉండాలి. పీడీఎఫ్
మాత్రమే అప్ లోడ్ చేయాలి)

పై సర్టిఫికెట్లు అన్ని అప్ లోడ్ చేసి అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫాంను సబ్మిట్ చేసిన తర్వాత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించే ముందు ఒకసారి చేయబోయే ప్రోగ్రామ్ ను చూసుకోవాలి. ఆ తర్వాత క్యాటగిరీ ప్రకారం ఫీజు చెల్లించాలి. చెల్లించిన ఫీజుకు సంబంధించిన రశీదు, సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసి పెట్టుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే క్రమంలో ఏవైనా సందేహాలు ఉంటే Ask Any Query అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే వెంటనే తగిన సమాచారం వస్తుంది.

Course Fee (Per Annum)

M.A. Programmes (2 Yera Duration)
1. ఎం.ఏ (ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ మేనేజ్ మెంట్) – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.38,000, రక్షణ సిబ్బంది – రూ.35,000)

అడ్వాన్సుడ్ డిప్లొమా అభ్యర్థులకు ఎంఏ రెండో ఏడాదికి – రూ.50,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.47,500, రక్షణ సిబ్బంది – రూ.45,000)

2. నెక్యూటరిటీ అండ్ డిఫెన్స్ లాస్ – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.38,000, రక్షణ సిబ్బంది – రూ.35,000)

3. ఎం.ఏ (స్పేస్ అండ్ టెలీ కమ్యూనికేషన్ లాస్) – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.38,000)

4. ఎం.ఏ (మారిటైం లాస్) – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ – రూ.38,000, రక్షణ సిబ్బంది రూ.35,000)

అడ్వాన్సుడ్ డిప్లొమా అభ్యర్థులకు ఎంఏ రెండో ఏడాదికి – రూ.50,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.47,500, రక్షణ సిబ్బంది – రూ.45,000)

5. ఎం.ఏ (క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్) – రూ.35,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూణ్ – రూ.33,250)

అడ్వాన్సుడ్ డిప్లొమా అభ్యర్థులకు ఎంఏ రెండో ఏడాదికి – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.38,000)

6. ఎం.ఏ (ఇంటర్నేషనల్ టాక్సేషన్) – రూ.50,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.47,500)

7. ఎం.ఏ (యానిమల్ ప్రొటెక్షన్ లాస్) – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.28,500)

అడ్వాన్సుడ్ డిప్లొమా అభ్యర్థులకు ఎంఏ రెండో ఏడాదికి – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.28,500)

Diploma Programmes (1 Year Duration)

1. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ వేటెంట్స్ లా – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.28,500)

2. ఆడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ నైబర్ లాస్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.28,500)

3. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ మీడియా లాస్ – రూ.20,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.19,000)

4. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా – రూ.12,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.11,400)
(SAARC Countries – 240 USD, Other Countries – 350 USD)

5. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.28,500)

6. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ రెజల్యూషన్ – రూ.25,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.23,750)

7. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ క్రాఫ్టింగ్ నెగోషియేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంటాక్ట్స్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.28,500)

8. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఏవియేషన్ లా అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్ మెంట్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ – రూ.28,500, రక్షణ సిబ్బంది రూ.25,000)

9. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ జీఐఎస్ ఆండ్ రిమోట్ సెన్సింగ్ లాస్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.28,500)

10. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ మారిటైం లాస్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ – రూ.28,500, రక్షణ సిబ్బంది – రూ.25,000

11. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ క్రిమినల్ లా అండ్ ఫోరెన్సిక్ సైన్స్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ – రూ.28,500)

12. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ లెజిస్ట్రేషన్స్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.28,500)

13. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ కార్పొరేట్ టాక్సేషన్ – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.38,000)

14. అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ యానిమల్ ప్రొటెక్షన్ లాస్ – రూ.30,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ-రూ.28,500)

15.అడ్వాన్సుడ్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ ఆండ్ డాటా ప్రొటెక్షన్ లాస్ – రూ.40,000
(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ -రూ.38,000)

దరఖాస్తులకు చివరి తేదీ : 15 జూలై, 2022

– Apply Various Programmes in NALSAR