Govt Job

Assistant Engineer Jobs in TSSPDCL

Assistant Engineer Jobs in TSSPDCL : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (Southern Power Distribution Company of Telangana Limited- TSSPDCL) డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 70 అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) (Assistant Engineer (Electrical)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.01/2022) జారీ చేసింది. ఈ పోస్టులను కొత్త జోనల్ విధానం ప్రకారం భర్తీ చేస్తారు. సంస్థ పరిధిలోని 15 జిల్లాల అభ్యర్థులకు 95 శాతం, ఇతరులకు 5 శాతం ఉద్యోగాలు కల్పిస్తారు. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో పరీక్ష నిర్వహిస్తారు.
మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లాలు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాల అభ్యర్థులకు 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి.

Vacancies

Vacancies (95%)

OC(General)-15, OC(Women)-9
EWS(General)-5, EWS(Women)-2
BC-A(General)-4, BC-A(Women)-1
BC-B(General)-4, BC-B(Women)-2
BC-D(General)-5, BC-B(Women)-1
BC-E(General)-3
SC(General)-6, SC(Women)-3
ST(General)-3, ST(Women)-1

Vacancies (5%)

OC(General)-1
SC(General)-1
ST(General)-1

Physically Handicapped Vacancies 95 % quota

OC-PH (HH)-1
OC-PH (OH)-1
Autism & Multiple Disabilities(W)-1

Qualifications

అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో
బ్యాచ్ లర్ డిగ్రీ చేసి ఉండాలి.

Age

జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ (SC/ST/BC/EWS) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగులకు పది సంవత్సరాల సడలింపు ఉంది.

Salary

నెలకు రూ.64295

Application and Examination Fee

ప్రతి అభ్యర్థి రూ.200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అలాగే, రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు పరీక్ష ఫీజు
చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు, అలాగే పరీక్ష ఫీజు ఒక్కసారి చెల్లిస్తే మళ్లీ తిరిగి ఇవ్వరు. ఫీజు మినహాయింపు ఉన్నవారు ఈ విషయాన్ని గమనించాలి.

Application Procedure

అర్హులైన అభ్యర్థులు ముందుగా TSSPDCL వెబ్ సైట్ (http://tssouthernpower.cgg.gov.in) లోకి లాగిన్ కావాలి. అందులో Make Payment అప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి. ఫీజు చెల్లించిన తర్వాత జర్నల్ నెంబర్ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత అదే వెబ్ సైట్ లో Submit Application ఆప్షన్ ఫై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

Scheme of Exam

రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. సెక్షన్-ఏ, సెక్షన్-బీ రెండు విభాగాలలో పరీక్ష ఉంటుంది. సెక్షన్-ఏలో టెక్నికల్ సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్-బీ జనరల్ అవేర్ నెస్. న్యుమరికల్ ఎబిలిటీ, తెలంగాణ సంస్కృతి, ఉద్యమం. చరిత్ర నుంచి 20 పరశ్నలు ఇస్తారు. రెండు గంటలలో పరీక్ష రాయాలి. ఒక్క ప్రశకు ఒక మార్కు ఉంటుంది.

Important Dates

ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: 3 జూన్, 2022 (సాయంత్రం 5 వరకు) దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 3 జూన్, 2022 (రాత్రి 11:59 వరకు)
హాల్ టికెట్ ల డౌన్ లోడ్ : 11 జూల్ 2022
రాత పరీక్ష: 17 జూలై, 2022 (ఆదివారం)

– Assistant Engineer Jobs in TSSPDCL

Kautilya Creative

Recent Posts

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

3 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

5 months ago

Jobs in ESI Dispensaries and Diagnostic Centres

Jobs in ESI Dispensaries : తెలంగాణ ప్రభుత్వ బీమా వైద్య సేవల శాఖ (Government of Telangana Insurance…

8 months ago

Nursing Officer Jobs in All India Institute of Medical Sciences

Nursing Officer in AIIMS : ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(All India Institute of Medical…

9 months ago

Para Medical Jobs in Satish Dhawan Space Centre Shar

Para Medical Jobs in Shar : భారత ప్రభుత్వ (Government of India) స్పేస్ డిపార్ట్‌మెంట్ (Department of…

9 months ago

Admissions in Master of Public Health Course

Admissions in MPH Course : వరంగల్​లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of…

10 months ago