Education

Bachelor of Physiotherapy Admissions in Nims

BPT Admissions in Nims : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-నిమ్స్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) 2022 విద్యాసంవత్సరానికి నాలుగున్నర సంవత్సరాల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (Bachelor of Physiotherapy-BPT) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులో మొత్తం 50 సీట్లు ఉంటాయి. రాత పరీక్ష, కౌన్సెలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Qualification

ఇంటర్మీడియట్ పాసైన వారు లేదా బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో అందుకు సమానమైన కోర్సు చేసినవారు అర్హులు. లేదా బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ బ్రడ్జి కోర్సుతో వొకేషనల్ ఫిజియోథెరపీ చేసిన వారు కూడా అర్హులే.

Age Limit

అభ్యర్థుల వయసు డిసెంబర్ 31, 2022 నాటికి 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.

Reservation Wise Seats

మొత్తం 50 సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం (బీసీ(ఏ)-7శాతం, బీసీ(బీ)-10శాతం, బీసీ(సీ) -ఒక శాతం, బీసీ (డీ)-7శాతం, బీసీ(ఈ)-4శాతం) కేటాయించారు. దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 85 శాతం సీట్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన  అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం ఇతర రాష్ట్రాటలకు చెందిన అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇందులో తెలంగాణ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది.

How to Apply

  • అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు NIMS వెబ్ సైట్ (www.nims.edu.in) ను ఓపెన్ చేసి ముందుగా Register Yourself పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్టర్ చేసుకొన్న తర్వాత అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తాయి. వాటితో లాగిన్ అయ్యి ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
    ఆన్ లైన్ అప్లికేషన్ ను సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థులు రూ.700 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

Documents to be Submitted

ఆన్ లైన్ అప్లికేషన్ ను విజయవంతంగా సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ఆ అప్లికేషన్ కు ఈ క్రింది సర్టిఫికెట్లు జతచేయాలి.
1. పదో తరగతి మార్క్స్ మెమో
2. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
3. ఇంటర్మీడియట్ ట్రాన్స్ ఫర్ (టీసీ)/మైగ్రేషన్ సర్టిఫికెట్
4. స్టడీ అండ్ కండక్ట్ సర్టిఫికెట్స్ (6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు)
5. రెసిడెన్స్ సర్టిఫికెట్
6. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఇన్ సర్వీస్ అభ్యర్థులు)
7. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
8. సోషల్ స్టాటస్ సర్టిఫికెట్ (బీసీ(ఈ) అభ్యర్థులు)

పై అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేయాలి. ఆ తర్వాత వాటన్నింటినీ అప్లికేషన్ కు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఆగస్టు 4, 2022 సాయంత్రం 5 గంటల లోపు The Associate Dean, Academic-2, 2nd floor, Old OPD Block, Nizam’s Institute of Medical Sciences, Hyderabad-500 082 చిరునామాకు పంపించాలి. రిజిస్టర్ పోస్ట్/ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలి.
అప్లికేషన్ అందిన తర్వాత ఎస్ఎంఎస్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఒకవేళ అప్లికేషన్ అందినట్టు సమాచారం రాకుంటే వారం రోజుల్లో నిమ్స్ లోని Academic-2, 2nd floor, Old OPD block కార్యాలయంలో సంప్రదించాలి. లేదా, nimsadat@gmail.com ఈ-మెయిల్ కు లేదా 040-23489189 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ అడ్మిషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం నిమ్స్ లోని నోటీస్ బోర్డు
అలాగే, వెబ్ సైట్ లో ఉంచుతారు. వ్యక్తిగతంగా ఎలాంటి సమాచారం ఇవ్వరు అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

Selection Procedure

ఈ కోర్సులో ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష 90 మార్కులకు ఉంటుంది. ఒక్కో జవాబుకు ఒక మార్కు ఇస్తారు. పరీక్ష రెండు గంటలలో రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలు ఫిజిక్స్, కెమెస్ట్రీ, బాటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. క్వాలిఫై కోసం ఓసీ, బీసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. క్వాలిఫై అయిన అభ్యర్థులను కౌన్సెలింగ్ కు ఆహ్వానించి అడ్మిషన్లు కల్పిస్తారు.

Course Fee

అడ్మిషన్ ఫీజు – రూ.3,000 (One Time) (Non Refundable)
సెక్యూరిటీ డిపాజిట్- రూ.1,000 (One Time) (Refundable)
ట్యూషన్ ఫీజు – ఏడాదికి రూ.39,750 చొప్పున నాలుగు సంవత్సరాలు.
లైబ్రరీ ఫీజు – ఏడాదికి రూ.1,000 చొప్పున నాలుగు సంవత్సరాలు.
పరీక్ష ఫీజు – ఏడాదికి రూ.1,500 చొప్పున నాలుగు సంవత్సరాలు.

Importanat Dates

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: ఆగస్టు 1, 2022
అప్లికేషన్ హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: ఆగస్టు 4, 2022
హాల్ టికెట్స్ డౌన్ లోడ్ : ఆగస్టు 30, 2022
ప్రవేశ పరీక్ష తేదీ: సెప్టెంబర్ 04, 2022
తాత్కాలిక ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 06, 2022
ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీ: సెప్టెంబర్ 26, 2022
తరగతులు ప్రారంభం : అక్టోబర్ 10, 2022

– BPT Admissions in Nims

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago