CAS Spl Jobs in TVVP : హైదరాబాద్ జిల్లా లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) (Telangana Vaidya Vidhana Parishad-TVVP) ఆసుపత్రుల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) (CAS (Spl)) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NOTIFICATION NO.3131/DSC/POHS&I/HYD/2021-3) జారీ అయింది. మొత్తం ఎనిమిది (08) విభాగాలలో యాభై (50) పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఓబీ&జీవై, రేడియాలజీ, అనస్తీషీయా, పీడీయాట్రిక్స్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ, జీడీఎంవో విభాగాలలో ఖాళీలు భర్తీ చేయనున్నారు. మల్టీ జోన్-II (Multi Zone-II) పరిధిలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం, విద్యార్హతలలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం (31-03-2023) వరకు పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.
Details of Vacancies
1.ఓబీ&జీవై (Ob&Gy), ఖాళీలు – 17
2.రేడియాలజీ (Radiology), ఖాళీలు – 5
3. అనస్తీషియా (Anesthesia), ఖాళీలు – 14
4.పీడీయాట్రిక్స్ (Pediatrics), ఖాళీలు – 2
5.జనరల్ మెడిసిన్ (General Medicine), ఖాళీలు – 3
6.అర్థోపెడిక్స్ (Orthopedics), ఖాళీలు – 2
7.జనరల్ సర్జరీ (General surgery), ఖాళీలు – 2
8.జీడీఎంవో (GDMO), ఖాళీలు – 5
Qualifications
అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్ లలో డిప్లొమా లేదా డిగ్రీ లేదా DNB చేసి ఉండాలి. అలాగే, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్
చేసుకొని ఉండాలి.
Age Limit
జనరల్ అభ్యర్థుల వయసు 34 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది. మాజీ సైనికులకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది. దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు ఉంది. అలాగే, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
How to Apply
అర్హులైన ఆసక్తి కలిగిన అభ్యర్థులు హైదరాబాద్ జిల్లా అధికారిక వెబ్ సైట్ (www.hyderabad.telangana.gov.in)లో పొందుపరిచిన అప్లికేషన్ ఫంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిపై రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి అందులోని వివరాలన్నీ పూర్తిగా నింపాలి. అలాగే, ఆ దరఖాస్తు ఫాంకు విద్యార్హతలు, కేటగిరీ, వైకల్యం, ఆదాయం తదితర సర్టిఫికెట్లు జత చేయాలి. అన్ని సర్టిఫికెట్లను సెల్ఫ్ అటెస్ట్ చేసి జత చేయాలి. వాటన్నింటినీ జూన్ 27, 2022 సాయంత్రం 5 గంటలలోపు O/o Programme Officer (HS&I), Hyderabad at 4th floor, Community Health center Khairathabad, Opposite to ‘Khairathabad Ganesh pandal Khairathabad, Hyderabad. చిరునామాలో అందజేయాలి.
Selection Criteria
ఈ పోస్టులకు అభ్యర్థులను విద్యార్హతలలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులలో 90 మార్కులు విద్యార్థులకు కేటాయిస్తారు. క్వాలిఫైయింగ్ కోర్సు పూర్తయిన తర్వాత వెయిటింగ్ పిరియడ్ కు ఏడాదికి ఒక మార్కు చొప్పున 10 మార్కులు కేటాయిస్తారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికే షన్ కోసం పిలుస్తారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థులకు జూన్ 29, 2022న అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన వైద్యులు ఏడాది కాలానికి రూ.110ల నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ పై అగ్రిమెంట్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫాంకు జత చేయాల్సిన సర్టిఫికెట్లు
1. పదో తరగతి సర్టిఫికెట్
2. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్
3. తహసీల్దార్/ఎమ్మార్వో జారీ చేసిన కులం సర్టిఫికెట్
4. అంగవైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు మాత్రమే)
5. సర్వీస్ సర్టిఫికెట్ (మాజీ సైనికులు మాత్రమే)
6. బోనఫైడ్ సర్టిఫికెట్ (ప్రైవేట్ లో చదివితే రెసిడెన్స్ సర్టిఫికెట్)
7. విద్యార్హతల మార్కుల మెమోలు
8. ఎంబీబీఎస్, ఎండీ/డిప్లొమా/డీఎన్బీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
9. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూన్ 27, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
– CAS Spl Jobs in TVVP