CDE Jobs in Telanagana : తెలంగాణ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ (Department of Handlooms and Textiles, Government of Telanagana-DHT) క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (Cluster Development Executives – CDEs) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 15 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు హైదరాబాద్లోని నాంపల్లిలో గల చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయంలో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Detalis of Posts
1.క్లస్టర్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ (Cluster Development Executives – CDE)
Educational Qualifications
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (Indian Institutes of Handloom Technology) నుంచి చేనేత టెక్నాలజీలో డిప్లొమా (Diploma in Handloom and Textile Technology – DTH)ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
Experience
చేనేత రంగంలో క్లస్టర్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ (సీడీఈ)గా కనీసం రెండు (02) సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రధానంగా క్లస్టర్లలో పని చేసిన అనుభవము ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు రికార్డులు మరియు ఖాతా పుస్తకాల నిర్వహణ మొదలైన బాధ్యతలు నిర్వహించ వలసి ఉంటుంది.
Salary
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (NHDP) గైడ్లైన్స్ ప్రకారం నెలకు రూ.24,000 చెల్లిస్తారు.
Process of Selection
తెలంగాణ ప్రభుత్వ చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ అధ్యక్షతన, ఇతర కమిటీ సభ్యుల నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల విద్యార్హతలు, అనుభవం, వయస్సు, నివాసం తదితర అంశాలను పరిశీలించి అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
How to Apply
- అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- బయోడేటాతో విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు హైదరాబాద్లోని నాంపల్లిలో గల చేనేత మరియు జౌళి శాఖ కార్యాలయానికి పంపించి దరఖాస్తు చేసుకోవాలి.
- నేరుగా కార్యాలయానికి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు.
- ఈ ఉద్యోగ ప్రకటన ఫిబ్రవరి 04, 2023న విడుదలైంది.
- ఈ తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. 21వ రోజు సెలవు దినం ఉంటు ఆ మరుసటి రోజు చివరి తేదీగా భావించాలి.
Office Address
Commissioner,
Handlooms & Textiles & AEPs,
3rd Floor,ChenethaBhavan,
Nampally, Hyderabad-500 001
Telangana State.
Important Points
ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు మూడు (03) సంవత్సరాల పాటు పనిచేయాల్సి ఉంటుంది. మొదట ఒక సంవత్సరానికి ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి పనితీరు ఆధారంగా పొడిగిస్తారు.
Website : https://handtex.telangana.gov.in/
– CDE Jobs in Telanagana