Certificate Courses in SCDE JNTUH : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో గల జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (Jawaharlal Nehru Technological University Hyderabad-JNTUH) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కూల్ అఫ్ కంటీన్యూయింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (School of Continuing and Distance Education-SCDE) 2022 విద్యా సంవత్సరంలో ఆరు నెలల వ్యవధి గల ఆన్ లైన్ సర్టిఫికెట్ కోర్సుల్లో (Online Certificate Courses) ప్రవేశానికి నోటిఫికేషన్ (Advt.No.:JNTUH/Admissions/Certificate Course/2022) జారీ చేసింది. అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు ఈ కోర్సులు చేయవచ్చు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Details of Courses
1. బ్లాక్ చెయిన్ (Blockchain)
ఇందులో మూడు సబ్జెక్టులు ఉంటాయి.
- బ్లాక్ చెయిన్ టెక్నాలజీ (Blockchain Technology)
- బిట్ కాయిన్ అండ్ క్రిప్టోకరెన్సీ (Bitcoin and Cryptocurrency)
- ఎథీరియం అండ్ హైపర్ లెడ్జర్ (Ethereum and Hyper Ledger)
2.డాటా సైన్స్ విత్ పైథాన్ ప్రోగ్రామింగ్ (Data Science with Python Programming)
ఇందులో మూడు సబ్జెక్టులు ఉంటాయి..
- ప్రోగ్రామింగ్ యూనింగ్ పైథాన్ (Programming using Python)
- మెషిన్ లెర్నింగ్ (Machine Learning)
- నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్ఎల్పీ) అండ్ బిగ్ డాటా (Natural Language Processing (NLP) and Big Data)
3.క్లౌడ్ అండ్ డివోప్స్ (Cloud and DevOps)
ఇందులో మూడు సబ్జెక్టులు ఉంటాయి.
- క్లౌడ్ టెక్నాలజీ ఏడబ్ల్యూఎస్ అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ (Cloud Technology AWS & Microsoft Azure)
- కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్/ కంటిన్యూయస్ డెప్లాయ్ మెంట్ విత్ గిట్, జెన్ కిన్స్ అండ్ అన్సిబుల్ (Continuous Integration/ Continuous deployment with Git, Jenkins and Ansible)
- ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ విత్ డాకర్, కుబెర్నేట్స్ అండ్ టెర్రాఫార్మ్ (Infrastructure provisioning with Docker, Kubernates and Terraform)
Course Duration
ఒక్కో కోర్సు వ్యవధి ఆరు నెలలు ఉంటుంది. ప్రతి కోర్సులో మూడు థియరీ సబ్జెక్టులతో పాటు ప్రాజెక్ట్ వర్క్ ఉంటుంది. థియరీ మరియు ప్రాక్టికల్ సెషన్ ఆన్ లైన్ మోడ్ లో నిర్వహిస్తారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు తరగతులు ఉంటాయి. థియరీ మరియు ల్యాబ్ సెషన్స్ లో 75 శాతం హాజరు తప్పనిసరి.
Eligibility
ఏదైనా డిప్లొమా లేదా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం చదువుతున్న వారు కూడా అర్హులే. కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అలాగే, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. అడ్మిషన్స్ కమిటీ పరిశీలన తర్వాత అడ్మిషన్లు కల్పిస్తారు.
How to Apply
ఆసక్తి కలిగిన విద్యార్థులు JNTUH వెబ్ సైట్ (https://doa.jntuh.ac.in/)ను ఓపెన్ చేసి, కొంచెం కిందికి స్క్రోల్ చేసి అందులోని ONLINE SUBMISSIONS పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కింద Admission into Certificate Courses-2022, offered by SCDE, JNTUH పక్కన బ్లింక్ అవుతున్న Online Submission పై క్లిక్ చేయాలి. అందులో ఏ కోర్సుకు అప్లై చేయదలుచుకుంటే దాని పక్కన బ్లింక్ అవుతున్న Online Submission పై క్లిక్ చేయాలి. అప్పుడు Application Fee Payment పేజీ ఓపెన్ అవుతుంది. అందులో సబ్జెక్టు, ఆధార్ కార్డు నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన తర్వాత యూజర్ నేమ్, పాస్ వర్డ్, పీ పేమెంట్ ట్రాంజాక్షన్ ఐడీ ఈ-మెయిల్ ఐడీకి పంపిస్తారు. వాటితో అప్లికేషన్ ఫాం నింపాలి. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే [email protected] మెయిల్ కు పంపించి పరిష్కారం పొందవచ్చు.
Documents to be upload
అప్లికేషన్ ఫాంతో పాటు ఈ క్రింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. ఎస్సెస్సీ మెమో. (SSC)
2. ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, మార్కుల మెమో/ డిప్లొమా సర్టిఫికెట్.
3. అండర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ మరియు మార్కుల మెమో/ స్టడీ సర్టి ఫికెట్.
4. ఇతర ఏదైనా సంబంధిత సర్టిఫికెట్లు.
Course Fee
అడ్మిషన్ పొందిన తర్వాత అడ్మిషన్ ఫీజు రూ.1000 చెల్లించాలి. అదే విధంగా అడ్మిషన్ సమయంలో కోర్సు ఫీజు రూ.25,000 చెల్లించాలి. కోర్సు ఫీజు ఒకసారి చెల్లిస్తే తిరిగి ఇవ్వబడదు.
Important Dates
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: జూలై 23, 2022
రూ.500 ఆలస్య రుసుముతో రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: జూలై 30, 2022
కోర్సు ఫీజు చెల్లింపు ప్రారంభ తేదీ: ఆగస్టు 6, 2022
కోర్సు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 13, 2022
తరగతులు ప్రారంభం: ఆగస్టు 15, 2022
Website: https://doa.jntuh.ac.in/
– Certificate Courses in SCDE JNTUH