Consultant Jobs in NFDB : భారత ప్రభుత్వ మత్స్య సంపద, పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ (Ministry of Fisheries, Animal Husbandry & Dairying, Government of India) కు చెందిన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల జాతీయ మత్స్య సంపద అభివృద్ధి బోర్డు (National Fisheries Development-NFDB) లో కన్సల్టెంట్ (Consultant) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం తొమ్మిది (09) ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి అందులో ప్రతిభ చూపిన వారికి ఈ ఉద్యోగాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1.Consultant (Grade-I)
2.Consultant (Grade-II)
Consultant (Gr-I-Technical)
పోస్టుల సంఖ్య: రెండు (02)
జీతం: నెలకు రూ.53,000
విద్యార్హతలు : ఫిషరీస్ లో స్పెషలైజేషన్ తో పాటు ఫిషరీస్ సైన్స్/ ఆక్వాకల్చర్/ మెరైన్ బయాలజీ ఇండస్ట్రియల్ ఫిషరీస్/ జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
అనుభవం : ఫిషరీస్ లేదా సంబంధిత విభాగంలో అభివృద్ధి/ పరిశోధన కార్యకలాపాలలో రెండు సంవత్సరాలు ఫీల్డ్ వర్క్ చేసి ఉండాలి. కంప్యూటర్
ఉండాలి.
Consultant (Gr-I-Project Monitoring Unit)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.53,000
విద్యార్హతలు : IT/HR లో స్పెషలైజేషన్ తో పాటు మేనేజ్మెంట్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
అనుభవం : ప్రాజెక్టుల పర్యవేక్షణ మరియు మూల్యాంకనంలో రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి. అలాగే, డేటా విశ్లేషణలో నైపుణ్యం కలిగి
ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
Consultant (Gr-I-Administration): Retired
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.53,000
విద్యార్హతలు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు అర్హులు. అలాగే, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
అనుభవం : జనరల్ అడ్మినిస్ట్రేషన్, కోర్టు కేసుల డీలింగ్, ఫండమెంటల్ రూల్స్, ఈ-ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ తెలిసి ఉండాలి.
Consultant (Gr-II-Infrastructure)
పోస్టుల సంఖ్య: ఒకటి (01)
జీతం: నెలకు రూ.32,000
విద్యార్హతలు : సివిల్ ఇంజినీరింగ్ లో B.E/B.Tech చేసిన వారు అర్హులు.
M.E/M.Tech చేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
అనుభవం : ఫిషరీస్ సంబంధిత ఇన్ ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టుల ప్రిపరేషన్ లో ఒక సంవత్సరం అనుభవం ఉండాలి. ఆన్ లైన్ పరిశోధనలు, డేటా విశ్లేషణలో అనుభవం ఉండాలి.
Consultant (Gr-II-Technical)
పోస్టుల సంఖ్య: రెండు (02)
జీతం: నెలకు రూ.32,000
విద్యార్హతలు : ఫిషరీస్ లో స్పెషలైజేషన్ తో పాటు ఫిషరీస్ సైన్స్/ ఆక్వాకల్చర్/ మారి కల్చర్/ మెరైన్ బయాలజీ/ ఇండస్ట్రియల్ ఫిషరీస్ / జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు అర్హులు.
అనుభవం : ఫిషరీస్ లేదా సంబంధిత విభాగంలో అభివృద్ధి/ పరిశోధన కార్యకలాపాలలో ఒక సంవత్సరం ఫీల్డ్ వర్క్ చేసి ఉండాలి. కంప్యూటర్
పరిజ్ఞానం ఉండాలి.
Consultant (Gr-II-Finance)
పోస్టుల సంఖ్య: రెండు (02)
జీతం: నెలకు రూ.32,000
విద్యార్హతలు: బీ.కాం లేదా సీఏ (ఇంటర్) చేసిన వారు అర్హులు. ఎం.కాం లేదా సీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
అనుభవం : Tally మరియు MS-Office సాఫ్ట్ వేర్ ఆపరేషన్ లో అనుభవం ఉండాలి. ఖాతాల నిర్వహణ, ఆర్థిక నివేదికల తయారీ, ఖాతాల ఆడిటింగ్, నగదు మరియు బ్యాంకు లావాదేవీల నిర్వహణ, ఆదాయపు
పన్ను/ GST రిటర్న్ లు దాఖలు తదితర వాటిలో ఏడాది అనుభవం ఉండాలి. ప్రభుత్వ సంస్థలలో పనిచేసినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
Consultant (Gr-I-Administration) పోస్టుకు అక్టోబర్ 01, 2022 నాటికి 65 సంవత్సరాల లోపు ఉండాలి. మిగిలిన అన్ని పోస్టులకు 35 సంవత్సరాల లోపు ఉండాలి.
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు NFDB వెబ్సైట్
(https://nfdb.gov.in/) లోకి లాగిన్ కావాలి. అందులో కుడివైపున దిగువ భాగంలో స్క్రోల్ అవుతున్న Applications are invited for engag-
ing of Consultants, on contractual basis at NFDB పక్కన ఉన్న Notification Document పై క్లిక్ చేయాలి. అందులో నోటిఫికేషన్ తో పాటు దిగువన అప్లికేషన్ ఫాం కూడా ఉంటుంది. దానిని డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. ఆ అప్లికేషన్ ఫాంకు విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, ఇతర సంస్థలో చివరి సారి తీసుకున్న జీతం పే స్లిప్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తదితర సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్ట్ చేసి జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను సీల్డ్ కవర్ లో పెట్టి కవర్ పైన ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నది రాయాలి. ఆ కవర్ ను నవంబర్ 02, 2022, సాయంత్రం 5 గంటలలోపు చేరేలా ఈ కింది చిరునామాకు పంపించాలి.
Senior Executive (F&A) I/c,
National Fisheries Development Board,
Pillar No: 235, PVNR Expressway,
SVPNPA Post, Hyderabad – 500 052. Telangana.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. అన్ని ఒరిజినల్ దరఖాస్తులతో అభ్యర్థులు ఇంటర్వ్యూకు
హాజరు కావాల్సి ఉంటుంది.
– Consultant Jobs in NFDB
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…