Contract Job

Jobs in Nizam’s Institute of Medical Sciences (NIMS)

Jobs in NIMS : హైదరాబాద్​లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) Multi-institutional Network Program on Systemic Lupus Erythematosus Understanding the diversity of SLE ప్రాజెక్టు కోసం సీనియర్​ రీసెర్చ్​ ఆఫీసర్ (Senior Research Officer)​, స్టడీ నర్స్​(Study Nurse), జూనియర్​ ల్యాబ్​ టెక్నీషియన్​(Junior Lab Technician) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (SRC/AC-4/401/2016) జారీ చేసింది. మొత్తం మూడు (03) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Details of Posts

  1. సీనియర్​ రీసెర్చ్​ ఆఫీసర్ (Senior Research Officer)​
  2. స్టడీ నర్స్​(Study Nurse)
  3. జూనియర్​ ల్యాబ్​ టెక్నీషియన్​(Junior Lab Technician)

Senior Research Officer

  • ఈ పోస్టుకు మెడికల్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియా (MCI) గుర్తింపు ఉన్న యూనివర్సిటీలో ఎంబీబీఎస్​(MBBS) చేసిన వారు అర్హులు.
  • అలాగే, ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీలో పీహెచ్​డీ (PhD) చేసి, నేషనల్​ లేదా ఇంటర్నేషనల్​ రీసెర్చ్​ మేనేజ్మెంట్​లో కనీసం ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అలాగే, కంప్యూటర్​ నాలెడ్జ్​ కూడా ఉండాలి.
  • వయసు 40 సంవత్సరాలు ఉండాలి.
  • జీతం నెలకు రూ.60,773 చెల్లిస్తారు.

Study Nurse

  • ఈ పోస్టుకు జనరల్​ నర్సింగ్​ అండ్​ మిడ్​వైఫరీ (GNM) చేసినవారు అర్హులు.
  • రిజిస్టర్డ్​ నర్సులు లేదా ANM లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • స్టేట్​ నర్సింగ్​ కౌన్సిల్​లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి
  • వయసు 30 సంవత్సరాలు ఉండాలి.
  • జీతం నెలకు రూ.31,500 చెల్లిస్తారు.

Junior Lab Technician

  • ఈ పోస్టుకు బీ.ఎస్సీ (B.Sc) లేదా ఇంజినీరింగ్​ అండ్​ టెక్నాలజీలో మూడు సంవత్సరాల డిప్లొమా చేసినవారు అర్హులు,
  • జీతం నెలకు రూ.20,000 చెల్లిస్తారు.

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో ఎడమ వైపున స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Recruitment of Senior Research Officer – Study Nurses and Junior Lab Technician పై క్లిక్ చేయాలి. అందులో Download పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అందులో దిగువ భాగంలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకొని అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి అన్ని విద్యార్హతలు, అనుభవం, ఇతర అన్ని సర్టిఫికెట్లు జతచేసి జులై 01, 2023 సాయంత్రం 4 గంటల లోపు ఈ కింది చిరునామాలో అందజేయాలి. ఎనవలప్​ కవర్​ మీద నోటిఫికేషన్​ నంబర్​ రాయాలి.
The Dean,
Nizam’s Institute of Medical Sciences,
Panjagutta, Hyderabad – 500082.

mportanat Points

  • దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
  • ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం ఫోన్ లేదా ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి భవిష్యత్తులో నిమ్స్ చేపట్టబోయే రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.
  • ఇంటర్వ్యూకు అలాగే, జాయినింగ్ కోసం వచ్చే సమయంలో టీఏ, డీఏలాంటివి ఇవ్వరు.
  • అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.

-‌‌ Jobs in NIMS

Kautilya Creative

Recent Posts

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

3 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

5 months ago

Jobs in ESI Dispensaries and Diagnostic Centres

Jobs in ESI Dispensaries : తెలంగాణ ప్రభుత్వ బీమా వైద్య సేవల శాఖ (Government of Telangana Insurance…

8 months ago

Nursing Officer Jobs in All India Institute of Medical Sciences

Nursing Officer in AIIMS : ఢిల్లీలోని ఆలిండియా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​(All India Institute of Medical…

9 months ago

Para Medical Jobs in Satish Dhawan Space Centre Shar

Para Medical Jobs in Shar : భారత ప్రభుత్వ (Government of India) స్పేస్ డిపార్ట్‌మెంట్ (Department of…

9 months ago

Admissions in Master of Public Health Course

Admissions in MPH Course : వరంగల్​లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం (Kaloji Narayana Rao University of…

10 months ago