Contract Jobs in ICMR NIN

Contract Jobs in ICMR NIN : హైదరాబాద్ లోని జాతీయ పోషకాహార సంస్థ (National Institute of Nutrition-NIN) ICMR నిధులతో  చేపట్టనున్న పైలట్ స్టడీ – డైట్ & బయోమార్కర్స్ సర్వే ఇన్ ఇండియా (DABS-I) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.  ఈ స్వల్పకాలిక సర్వే కోసం జూనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ రిసెర్చ్ ఫెలో, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.71/Projects/DABS/JUNE/2022) విడుదల చేసింది. విద్యార్హతలను బట్టి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అవకాశం కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

Posts & Qualifications

1. Jr. Medical Officer
పోస్టు పేరు: జూనియర్ మెడికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: రెండు (02)
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.60,000
కాల పరిమితి: రెండున్నర నెలలు (2.5 Months)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎంబీబీఎస్/బీఏఎంఎస్/బీడీఎస్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, మెడికల్/ఆయుష్/డెంటల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. మరియు కమ్యూనిటీ స్టడీస్ నిర్వహణలో ఒక  సంవత్సరం అనుభవం తప్పనిసరి.

2.SRF(Food and Nutrition)
పోస్టు పేరు: ఎస్ఆర్ఎఫ్(ఫుడ్ అండ్ న్యూట్రిషన్)
పోస్టుల సంఖ్య: ఐదు (05)
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
నెలకు రూ.44,450
కాల పరిమితి: మూడు నెలలు (3 Months)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఫుడ్ అండ్ న్యూట్రిషన్/హోం సైన్సెస్ డిగ్రీ చేసి ఉండాలి. మరియు ఫీల్డ్ వర్క్ లో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎమ్మెస్సీ డిగ్రీ చేసి ఉంటే రెండు సంవత్సరాల అనుభవంగా పరిగణించబడుతుంది. అలాగే, కమ్యూనిటీ స్టడీస్ నిర్వహణలో ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి.

3.SRF(Anthropology/Sociology/Social Work)
పోస్టు పేరు: ఎస్ఆర్ఎఫ్(ఆంత్రోపాలజీ/సోషియాలజీ/సోషల్ వర్క్)
పోస్టుల సంఖ్య: రెండు (02)
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.44,450
కాల పరిమితి: మూడు నెలలు (3 Months)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ/సోషియాలజీ/సోషల్ వర్క్ లో డిగ్రీ చేసి ఉండాలి. మరియు ఫీల్డ్ వర్క్ లో రెండు (02) సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంఏ/ఎంఎస్ డబ్ల్యూ/ఎమ్మెస్సీ డిగ్రీ చేసి ఉంటే రెండు సంవత్సరాల అనుభవంగా పరిగణించబడుతుంది. అలాగే, కమ్యూనిటీ స్టడీస్ నిర్వహణలో ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి.

4.SRF(Statistics/BioStatistics/Data Science)
పోస్టు పేరు: ఎస్ఆర్ఎఫ్(స్టాటిస్టిక్స్/బయోస్టాటిస్టిక్స్/ డాటా సైన్స్)
పోస్టుల సంఖ్య: రెండు (02)
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.44.450
కాల పరిమితి: మూడు నెలలు (3 Months)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో స్టాటిస్టిక్స్/బయోస్టాటిస్టిక్స్ లో డిగ్రీ చేసి ఉండాలి. మరియు ఫీల్డ్ వర్క్ లో రెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి. ఎంపీహెచ్/ఎమ్మెస్సీ డిగ్రీ చేసి ఉంటే రెండు సంవత్సరాల అనుభవంగా పరిగణించబడుతుంది. అలాగే, డాటా మేనేజ్మెంట్/అనాలసిస్ లో ఒక సంవత్సరం అనుభవం తప్పనిసరి.

5. Sr. Technical Assistant
పోస్టు పేరు: సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
పోస్టుల సంఖ్య: రెండు (02)
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.32,450
కాల పరిమితి: రెండున్నర నెలలు (2.5 Months)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీలో సైన్స్ సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి. మూడు (03) సంవత్సరాల అనుభవం లేదా ఏదైనా సైన్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే, ల్యాబ్ శాంపిళ్ల ప్రాసెసింగ్ లో అనుభవం ఉండాలి.

6.Project Assistant (Phlebotomist)
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ప్లెబోటోమిస్ట్)
పోస్టుల సంఖ్య: రెండు (02)
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.31,000
కాల పరిమితి: రెండున్నర నెలలు (2.5 Months)
అర్హతలు: రెండు (02) సంవత్సరాల డీఎంఎలీ లేదా ఒక సంవత్సరం డీఎంఎలీ కోర్సు చేసిన వారు అర్హులు. బ్లడ్ తీయడంలో ఏడాది అనుభవం ఉండాలి. లేదా బీ.ఎస్సీ (నర్సింగ్/ఎంఎల్బీ) చేసి ఉండాలి. అలాగే, సిరల నుంచి రక్తం తీయగలగాలి.

7.Field Worker
పోస్టు పేరు: ఫీల్డ్ వర్కర్
పోస్టుల సంఖ్య: నాలుగు (04)
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.18,000
కాల పరిమితి: రెండున్నర నెలలు (2.5 Months)
అర్హతలు: సైన్స్ సబ్జెక్టులో 12వ తరగతి పాసై ఉండాలి. మరియు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో రెండు (02) సంవత్సరాల డిప్లొమా లేదా ఒక సంవత్సరం డీఎంఎల్టి చేసి ఉండాలి. అలాగే, ఒక సంవత్సరం ఫీల్డ్ స్టడీ అనుభవం ఉండాలి.

8.MTS
పోస్టు పేరు: ఎంటీఎస్
పోస్టుల సంఖ్య: రెండు (02)
వయసు: 25 సంవత్సరాలు మించకూడదు.
జీతం: నెలకు రూ.15,800
కాల పరిమితి: రెండున్నర నెలలు (2.5 Months)
అర్హతలు: పదో తగరతి లేదా అందుకు సమానమైన కోర్సు చదివి, ఫీల్డ్ స్టడీ అనుభవం ఉండాలి.

Selection Procedure

అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జాతీయ పోషకాహార సంస్థ వెబ్ సైట్ లో (www.nin.res.in) లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిపై రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించి, దానిలోని వివరాలన్నీ పూర్తిగా నింపాలి. నోటిఫికేషన్ లో ఇచ్చిన తేదీన, ఇచ్చిన చిరునామాకు ఉదయం 9:30 గంటలకు ఒరిజినల్ సర్టిఫికెట్లు అలాగే, ఒక సెట్ సెల్ఫ్ అటెస్ట్ చేసిన జిరాక్స్ కాపీలతో హాజరు కావాలి. ఉదయం 9:30 గంటల నుంచి 11 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11 గంటల తర్వాత దరఖాస్తులు తీసుకోరు. ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురాని అభ్యర్థులను ఇంటర్వ్యూకు అనుమతించరు.
దరఖాస్తుల వెరిఫికేషన్ అనంతరం అర్హులైన అభ్యర్థులను అదే రోజు ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపి సంబంధిత పోస్టులకు ఎంపికైన వారి పేర్లను ICMR-NIN మరియు ICMR వెబ్ సైట్లలో మాత్రమే ఉంచుతారు. వ్యక్తిగత ఈ-మెయిల్, ఫోన్ నెంబర్లకు ఎలాంటి సమాచారం పంపించరు. ఈ ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు వెబ్ సైట్ లో మాత్రమే ఉంచుతారు. అభ్యర్థులు తరచూ వెబ్ సైట్ ను చూస్తుండాలి.

  • భారత ప్రభుత్వం మరియు ICMR నిబంధనల మేరకు వయసులో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు (05), ఓబీసీలకు మూడు (03) సంవత్సరాల సడలింపు ఉంది.
  • ఓబీసీ కేటగిరీ వారు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు ఆదాయం-ఆస్తుల సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
  • పై పోస్టులన్నీ తాత్కాలికమైనవే. మరియు స్వల్ప కాలిక పోస్టులు.
  • ప్రాజెక్ట్ సిబ్బందికి వారు ఫీల్డ్ వర్క్ కు హాజరైన సమయంలో వారి హాజరు శాతంను బట్టి డీఏ చెల్లిస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి ఇవ్వరు. తమ సొంత ఖర్చులతోనే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.

Interview Dates

4 జూలై 2022 (పోస్ట్ నెంబర్ 1 నుంచి 4 వరకు)
1.జూనియర్ మెడికల్ ఆఫీసర్
2.ఎస్ఆర్ఎఫ్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్)
3.ఎస్ఆర్ఎఫ్ ఆంత్రోపాలజీ/సోషియాలజీ/సోషల్ వర్క్)
4.ఎస్ఆర్ఎఫ్(స్టాటిస్టిక్స్/బయోస్టాటిస్టిక్స్/ డాటా సైన్స్)

5 జూలై 2022 (పోస్ట్ నెంబర్ 5 నుంచి 8 వరకు)
5. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
6.ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ప్లెబోటోమిస్ట్)
7. ఫీల్డ్ వర్కర్
8. ఎంటీఎస్

Interview Venue

ఇంటర్వ్యూకు హాజరు కావాల్సిన చిరునామా
ICMR – National Institute of Nutrition,
Opp: Tarnaka Metro Railway Station,
Tarnaka, Hyderabad – 500007, Telangana, India.

– Contract Jobs in ICMR NIN