Contract Job

Contract Jobs in NIEPID

Contract Jobs in NIEPID : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్టన్) (National Institute for the Empowerment of Persons with Disabilities (Divyangjan)-NIEPID) కాంట్రాక్టు పద్ధతిలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.03/2022) జారీ చేసింది. NIEPID కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఎంపికైన అభ్యర్థులు NEPID హెడ్ క్వార్టర్స్ అయిన సికింద్రాబాద్ లోని క్రాస్ డిజేబిలిటీ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, కర్నాటక రాష్ట్రంలోని దేవం గెరె, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్ నంద్ గావ్ లోని కాంపోజిట్ రీజనల్ సెంటర్స్ (CRC) లో పనిచేయాల్సి ఉంటుంది.

Details of Posts

Clinical Psychologist/Rehabilitation Psychologist
పోస్టు పేరు: క్లినికల్ సైకాలజిస్ట్/ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్-01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: క్లినికల్ సైకాలజీ లేదా రిహాబిలిటేషన్ సైకాలజీలో ఎం.ఫిల్ చేసిన వారు అర్హులు.
జీతం: నెలకు రూ.40,000.

Occupational Therapist
పోస్టు పేరు: ఆక్యుపేషనల్ థెరపిస్ట్
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: B.O.T చేసి ఉండాలి. అలాగే, రెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ. 35,000.

Audiologist and Speech language Pathologist (ASLP)
పోస్టు పేరు: ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్-01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01. CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ లో బీ.ఎస్సీ లేదా బీ.ఏ చేసి ఉండాలి. అలాగే, రెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000.

Special Educator (ID)
పోస్టు పేరు: స్పెషల్ ఎడ్యుకేటర్ (ఐడీ)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: B.ed.SE(ID) చేసి ఉండాలి. అలాగే, మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. క్రాస్ డిజేబిలిటీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.35,000.

Special Educator (HI/VI)
పోస్టు పేరు: స్పెషల్ ఎడ్యుకేటర్ (హెచ్ఐ/వీఐ)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: B.Ed.SE(HI) B.Ed.SE(VI) చేసి ఉండాలి. అలాగే, మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. క్రాస్ డిజేబిలిటీలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.35,000.

Early Interventionist
పోస్టు పేరు: ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-401, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: M.Sc(DS) లేదా PGDEI చేసిన అర్హులు.
జీతం: నెలకు రూ.35,000.

Physiotherapist
పోస్టు పేరు: ఫిజియోథెరపిస్ట్
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01. CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: B.P.T చేసి ఉండాలి. అలాగే, రెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000.

Nurse
పోస్టు పేరు: నర్స్
పోస్టుల సంఖ్య: నాలుగు (04), సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: నర్సింగ్ లో ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే, రెండు (12) సంవత్సరాల అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.30,000.

Trained Care giver
పోస్టు పేరు: ట్రెయిన్ కేర్ గివర్
పోస్టుల సంఖ్య: పన్నెండు (12). సికింద్రాబాద్-03, CRC నెల్లూరు-03, CRC దేవంగెరె-03, CRC రాజ్ నంద్ గావ్-03.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు: కేర్ గివెన్ ప్రోగ్రామ్/ సీబీఐడీ సర్టిఫికెట్ లో మిడిల్ పాస్ అయిన వారు అర్హులు.
జీతం: నెలకు రూ.20,000.

Activity Teacher (Part-time)
పోస్టు పేరు: అక్టివిటీ టీచర్ (పార్ట్ టైమ్)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్ -01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
వయసు: 35 సంవత్సరాలు మించకూడదు.
అర్హతలు:DECSE(ID) లేదా D.Ed.SE(ID) చేసిన అర్హులు.
జీతం: నెలకు రూ.15,000.

Visiting Medical Consultants

Visiting Medical Consultant (Paediatrics)
పోస్టు పేరు: విజిటింగ్ మెడికల్ కన్సల్టెంట్ (పీడీయాట్రిక్స్)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్-01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
అర్హతలు: MBBS తో పాటు MD/DNB పీడియాట్రిక్స్ చేసిన అర్హులు.
జీతం: ఒక విజిట్ కు రూ.2,500. వారంలో గరిష్టంగా నాలుగు విజిట్లు ఉంటాయి.

Visiting Medical Consultant (Psychiatry)
పోస్టు పేరు: విజిటింగ్ మెడికల్ కన్సల్టెంట్ (సైకియాట్రీ)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్-01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
అర్హతలు: MBBS తో పాటు MD/DNB సైకియాట్రీ చేసిన అర్హులు.
జీతం: ఒక విజిట్ కు రూ.2,500. వారంలో గరిష్టంగా నాలుగు విజిట్లు ఉంటాయి.

Visiting Medical Consultant (Ophthalmology)
పోస్టు పేరు: విజిటింగ్ మెడికల్ కన్సల్టెంట్ (ఆప్తమాలజీ)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్-01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గాప్-01.
అర్హతలు: MBBS తో పాటు MD/DNB ఆప్తమాలజీ చేసిన అర్హులు.
జీతం: ఒక విజిట్ కు రూ.2,500. వారంలో గరిష్టంగా నాలుగు విజిట్లు ఉంటాయి.

Visiting Medical Consultant (Neurology)
పోస్టు పేరు: విజిటింగ్ మెడికల్ కన్సల్టెంట్ (న్యూరాలజీ)
పోస్టుల సంఖ్య: నాలుగు (04). సికింద్రాబాద్-01, CRC నెల్లూరు-01, CRC దేవంగెరె-01, CRC రాజ్ నంద్ గావ్-01.
అర్హతలు: MBBS తో పాటు MD/DNB న్యూరాలజీ చేసిన అర్హులు.
జీతం: ఒక విజిట్ కు రూ.2,500. వారంలో గరిష్ఠంగా నాలుగు విజిట్లు ఉంటాయి.

Selection Procedure

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఎంపిక ప్రకియ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత
అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా రాత పరీక్షకు పిలుస్తారు. మొత్తం 100 మార్కులలో రాత పరీక్షకు 80 మార్కులు, విద్యార్హతలకు 10 మార్కులు, అనుభవానికి 10 మార్కులు కేటాయిస్తారు.

How to Apply

ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా ఏదైనా జాతీయ బ్యాంకులో డ్రాచేసుకొనేలా Director, NIEPID పేరిట రూ.500 డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) తీయాలి. డీడీ వెనక వైపు అభ్యర్థి పేరు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకొన్నది స్పష్టంగా రాయాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళ, దివ్యాంగ అభ్యర్థులు డీడీ తీయాల్సిన అవసరం లేదు. అనంతరం NIEPID వెబ్ సైట్ లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపాలి. దానికి అటెస్టెడ్ చేయించిన విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్యంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. వాటన్నింటితోపాటు డీడీని ఓ ఎనవలప్ కవర్ లో పెట్టి. కవర్ పై ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో రాయాలి. ఆ కవర్ ను జూలై 20, 2022లోపు The Director, NIEPID, Manovikasnagar, Secunderabad-500009 చిరునామాకు పంపించాలి.

– Contract Jobs in NIEPID

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago