Degree and PG Diploma in RGNAU : భారత ప్రభుత్వ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (Ministry of Civil Aviation, Government of India) కు చెందిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలో ఫుర్సత్ గంజ్ ఎయిర్ ఫీల్డ్ ప్రాంతంలోగల రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (Rajiv Gandhi National Aviation University – RGNAU) 2022 విద్యా సంవత్సరంలో డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ (Advt.No.RGNAU/5141/2/ADMIN) జారీ చేసింది. విద్యార్హతలు, షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు. విమానయాన రంగంలో స్థిరపడాలనే వారికి ఇదో మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1.బ్యాచిలర్ అఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (బీఎంఎస్) ఇన్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో
(Bachelor of Management Studies (BMS) in Aviation Services & Air Cargo)
2. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్
(Post Graduate Diploma in Airport Operations-PGDAO)
బ్యాచిలర్ అఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (బీఎంఎస్) ఇన్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో కోర్సు వ్యవధి మూడు (03) సంవత్సరాలు. నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో రెండు (02) సంవత్సరాలు తరగతి గదిలో ట్రెయినింగ్ ఉంటుంది. ఏవియేషన్ లేదా ఎయిర్ కార్గో కంపెనీలలో ఏడాది కాలం పాటు అప్రెంటిస్ షిప్ శిక్షణ ఉంటుంది. ఈ అప్రెంటిస్ షిప్ శిక్షణ కాలంలో నెలకు రూ.9 వేల వరకు స్టైపెండ్ ఇస్తారు. ఈ కోర్సును లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఏవియేషన్/ ఎయిర్ కారో సెక్టార్ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తారు. ఇందులో మొత్తం 96 సీట్లు ఉంటాయి.
అదే విధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కోర్సు వ్యవధి 18 నెలలు. ఇందులో 12 నెలలు తరగతి గదిలో ట్రెయినింగ్ ఉంటుంది. ఆరు నెలలు జీఎంఆర్ ఎయిర్ పోర్టులలో ఇంటర్న్ షిప్ చేయాల్సి ఉంటుంది. ఈ కోర్సును జీఎంఆర్ ఏవియేషన్ అకాడమీ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఇందులోనూ మొత్తం 96 సీట్లు ఉంటాయి.
పై రెండు కోర్సులలో కూడా భారతదేశంలో అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మరియు దివ్యాంగులకు సీట్లు కేటాయిస్తారు.
బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (బీఎంఎస్) ఇన్ ఏవియేషన్ సర్వీసెస్ అండ్ ఎయిర్ కార్గో కోర్సులో చేరదలుచుకొనే అభ్యర్థులు గుర్తింపు పొందిన పాఠశాల లేదా కళాశాలలో గణితం లేదా కామర్స్ గ్రూపులో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ (12వ తరగతి పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 45 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది.
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎయిర్ పోర్ట్ ఆపరేషన్స్ కోర్సులో చేరదలుచుకొనే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీలో కనీసం 55 శాతం
మార్కులతో ఏ గ్రూపులోనైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించినా సరిపోతుంది.
బీఎంఎస్ కోర్సులో చేరే అన్ని కేటగిరీల అభ్యర్థులు 31 జూలై, 2022 నాటికి 21 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. అదే విధంగా పీజీడీఏవో కోర్సులో చేరే అన్ని కేటగిరీల అభ్యర్థులు 31 జూలై, 2022 నాటికి 25 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పై రెండు కోర్సులలో చేరే అభ్యర్థులు 13 సెప్టెంబర్, 2022 నాటికి తమ విద్యార్హతలకు సంబంధించిన ఫైనల్ మార్క్స్ షీట్ ను సమర్పించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఇంటర్మీడియట్ (12వ తరగతి)లో సాధించిన మార్కుల పర్సంటేజీ, యూనివర్సిటీ నిబంధనల మేరకు గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ అన్ లైన్ ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగా బీఎంఎస్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే, డిగ్రీలో సాధించిన మార్కుల పర్సంటేజీ, యూనివర్సిటీ నిబంధనల మేరకు గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ అన్ లైన్ ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగా పీజీడీఏవో కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. 8 ఆగస్టు, 2022 నుంచి 12 అగస్టు, 2022 మధ్య ఇంటర్వ్యూ ఉండే అవకాశం ఉంది.
అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఈ క్రింది సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
1. పదో తరగతి నుంచి అపైన అన్ని విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, మార్క్స్ షీట్లు (సెల్ఫ్ అటెస్ట్ చేయాలి)
2. కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
3. కులం సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు)
4. వైకల్యానికి సంబంధించిన సర్టిఫికెట్ (దివ్యాంగులు)
5. హాల్ టికెట్ (ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు)
6. ఏదైనా ఒక ఫొటో అడెంటిటి కార్డ్
BMS
బీఎంఎస్ (మూడు సంవత్సరాలకు): రూ.2.5లక్షలు
హాస్టల్, మెస్, రవాణా చార్జీలు: రూ.1.12 లక్షలు (ఏడాదికి)
స్టూడెంట్స్ క్లబ్ అక్టివిటీస్: రూ.7,500 (ఏడాదికి)
రిఫండబుల్ డిపాజిట్: రూ.10,000 (ఏడాదికి)
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.2,500
అప్రెంటిస్ షిప్ ఫెసిలియేషన్ ఫీజు: రూ.4,000 (మూడో సంవత్సరంలో
ఇన్సూరెన్స్: రూ.2,500 (మూడో సంవత్సరంలో)
PGDAO
పీజీడీఏవో (18 నెలలకు): రూ.3,30,470
హాస్టల్, మెస్, రవాణా చార్జీలు: రూ.1,12,000 లక్షలు (ఏడాదికి)
హాస్టల్: రూ.5000 (రిఫండబుల్)
అకాడమిక్స్: రూ.5000 (రిఫండబుల్)
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.2,500 (నాన్-రిఫండబుల్)
ఆన్ లైన్ అప్లికేషన్ సమర్పణకు చివరి తేదీ: 29 జూలై, 2022 (శుక్రవారం)
షార్ట్ లిస్ట్ ప్రదర్శించే తేదీ: 4 ఆగస్టు, 2022 (గురువారం)
ఆన్ లైన్ ఇంటర్వ్యూ తేదీలు: 8 ఆగస్టు, 2022 నుంచి 12 అగస్టు, 2022 వరకు
ఫలితాల ప్రకటన: 23 ఆగస్టు, 2022 (మంగళవారం)
సర్టిఫికెట్ల పరిశీలన: 7 సెప్టెంబర్, 2022 నుంచి 13 సెప్టెంబర్, 2022 వరకు
తరగతులు ప్రారంభం: 15 సెప్టెంబర్, 2022 (గురువారం)
– Degree and PG Diploma in RGNAU
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…