Diploma Certificate Courses in SVITSA : తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణా సంస్థ (Sri Venkateswara Institute of Traditional Sculpture and Architecture-SVITSA) డిప్లొమా (Diploma in Traditional Sculpture and Architecture-DTSA), సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి సంవత్సరం మే లేదా జూన్ నెలలో ఈ నోటిఫికిషన్ ను విడుదల చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా వెళ్లిగానీ, పోస్టు ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ కోర్సులలో బాలురు, బాలికలు చేరవచ్చు. భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణా సంస్థను నెలకొల్పింది. డిప్లొమా కోర్సులలో సంప్రదాయ శిల్పం, ఆలయ నిర్మాణం, సంప్రదాయ పెయింటింగ్ లో ఉత్తమమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు. దేవుడు, దేవతల విగ్రహాలను చెక్కడం, విమానగోపురాల నిర్మాణంలో మంచి శిక్షణ ఇస్తారు. రాయి, సిమెంట్, లోహ, కలప తదితర శిల్పకళల్లో అద్భుత తర్ఫీదు ఇస్తారు.
ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన అధ్యాపకులు ఈ సంస్థలో ఉన్నారు. వారితో పాటు ప్రముఖ అధ్యాపకులు సైతం వచ్చి విద్యార్థులకు సంబంధిత అంశాలు బోధిస్తారు. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు, ఆటో క్యాడ్ తో కూడిన కంప్యూటర్ ల్యాబ్ తదితర బోధనా పరికరాలు ఈ సంస్థలో ఉంటాయి. కొన్ని ప్రధానమైన పుస్తకాలు సైతం విద్యార్థులకు ఉచితంగా అందజేస్తారు.
డిప్లొమా కోర్సును స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ కు అనుబంధంగా నిర్వహిస్తారు. కోర్సు పూర్తిచేసిన వారికి ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు.
Diploma in Courses
1.ఆలయ నిర్మాణం (Temple Architecture)
2.శిలా శిల్పం (Stone sculpture)
3.సుధా శిల్పం (Sudai sculpture)
4.లోహ శిల్పం (Metal sculpture)
5. శిల్పం (Wood sculpture)
5.సంప్రదాయ వర్ణ చిత్రలేఖనం (Traditional Painting)
Certificate Course
1. కలంకారి కళ
ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. పది సీట్లు ఉంటాయి. ఉచిత శిక్షణ, ఉచిత వసతి కల్పిస్తారు. ఈ కోర్సుకు ఎంపికైన వారికి నగదు డిపా
జిట్ ఉండదు.
డిప్లొమా కోర్సు వ్యవధి నాలుగు (04) సంవత్సరాలు. ఒక్కో విభాగంలో 10 సీట్లు ఉంటాయి. ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు యూనిట్ టెస్టులు, వార్షిక పరీక్ష నిర్వహిస్తారు. థియరీ పరీక్షలో 35 శాతం, ప్రాక్టికల్స్ లో 50 శాతం మార్కులు సాధిస్తేనే ఉత్తీర్ణులవుతారు.
పదో తరగతి ఉత్తీర్ణులైన వారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండాలి. దేవాలయం, చిత్రకళలల్లో అనుభవం ఉన్న సంప్రదాయ కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు రెండు (02) సంవత్సరాల సడలింపు ఉంటుంది. అయితే, వారు సంబంధిత కుటుంబాలకు చెందిన వారని మండల రెవెన్యూ అధికారి జారీ చేసిన ధ్రువీకరణ పత్రం అందజేయాల్సి ఉంటుంది.
ఈ కోర్సులకు ఎంపికైన విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పిస్తారు. టీటీడీ సెంట్రల్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. మూడు శిల్పశాస్త్ర గ్రంథాలను ఉచితంగా అందజేస్తారు. డిప్లొమా కోర్సుల విద్యార్థులు కేవలం బోర్డు గుర్తింపు రుసుము నిమిత్తం రూ.250, వార్షిక పరీక్ష ఫీజు రూ.450లు చెల్లిస్తే సరిపోతుంది. బాల బాలిక లకు వేర్వేరు వసతి గృహాలు ఉంటాయి. స్థానిక విద్యార్థులకు నెలకు వంద కూడా ఇస్తారు. ప్రతి సంవత్సరం డిప్లొమా కోర్సు నాలుగో సంవత్సరంలో ఉన్న విద్యార్థులను విద్యా పర్యటన నిమిత్తం దక్షిణ భారత దేశంలోని ప్రముఖ చారిత్రక ఆలయాల సందర్శనకు తీసుకెళ్తారు. విద్యార్థులకు శిక్షణ, వసతిని పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానమే. ఏర్పాటు చేస్తుంది. పూర్తి ఖర్చును భరిస్తుంది.
డిప్లొమా కోర్సు పూర్తిచేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖలో, పురావస్తుశాఖలో, తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజినీరింగ్ విభాగంలో, శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో స్థపతులుగా, అధ్యాపకులుగా, డ్రాయింగ్ మాస్టర్లుగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 10, 2022
పోస్టు ద్వారా దరఖాస్తులు పంపాల్సిన చిరునామా :
The Principal,
Sri Venkateswara Institute of Traditional Sculpture and
Architecture,
Alipri Road,
Adjacent to Alipri Link Bus Stand,
Tirupati, A.P
PinCode: 517507
Phone Number: 0877-2264637
– Diploma Certificate Courses in SVITSA
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…