Diploma Courses in CITD

Diploma Courses in CITD : హైదరాబాద్ లోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (Central Institute of Tool Design – CITD) నాలుగు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రవేశ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ భారత ప్రభుత్వానికి చెందిన ప్రధాన సాంకేతిక శిక్షణ సంస్థ. ఇది 1968లో హైదరాబాద్ లోని బాలనగర్ లో స్థాపించబడింది. ఈ సంస్థ టూల్ డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ లో ప్రత్యేక శిక్షణ కోర్సులను అందిస్తుంది. అలాగే CAD, CAM, CAE, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్, మెకాట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ లలో, సర్టిఫికెట్, డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, M.E అండ్ M.Tech కోర్సులలో కూడా వివిధ స్థాయిలలో శిక్షణ ఇస్తుంది.

Courses Details

1. డిప్లొమా ఇన్ టూల్, డై అండ్ మౌల్డ్ మేకింగ్
(Diploma in Tool, Die & Mould Making-DTDM)
Age: మే 8, 2022 వరకు 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
No.of Seats: అరవై (60)
Course Fee: రూ.లక్షా అరవై వేలు (రూ.1,60,000) సెమిస్టర్ కు రూ.20
Duration: నాలుగు (04) సంవత్సరాలు (ఎనిమిది సెమిస్టర్లు).

2. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
(Diploma in Electronics & Communication Engineering-DECE)
Age: మే 8, 2022 వరకు 19 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
No.of Seats: అరవై (60)
Course Fee: సెమిస్టర్ కు రూ.20 వేలు
Duration: మూడు (03) సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు).

3. డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్
(Diploma in Automation & Robotics Engineering-DARE)
Age: మే 8, 2022 వరకు 19 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
No.of Seats: అరవై (60)
Course Fee: సెమిస్టర్ కు రూ.20 వేలు
వ్యవధి (Duration): మూడు (03) సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు).

4. డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్
(Diploma in Production Engineering-DPE)
Age: మే 8, 2022 వరకు 19 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులకు ఐదు (05) సంవత్సరాల సడలింపు ఉంది.
No.of Seats: అరవై (60)
Course Fee: సెమిస్టర్ కు రూ.20 వేలు
Duration: మూడు (03) సంవత్సరాలు (ఆరు సెమిస్టర్లు).

How to Apply

అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వెబ్ సైట్ (https://www.citdindia.org/) లోని Diploma Admissions-2022 లింక్ పై క్లిక్ చేసి
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Application Fee

జనరల్ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ (SC/ST) అభ్యర్థులు రూ.350 చెల్లిస్తే సరిపోతుంది.

Mode of Payment

సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వెబ్ సైట్ లో ఇచ్చిన లింక్ ద్వారా ఆన్ లైన్ లో చెల్లించాలి.

Certificates to be Upload

1. ఫొటో (అప్లోడ్ సైజ్: 20 కేబీ నుంచి 50 కేబీ)
2. సంతకం (అప్లోడ్ సైజ్: 10 కేబీ నుంచి 20 కేబీ), బ్యాక్ గ్రౌండ్ తెలుపు రంగులో ఉండాలి.
3. 10వ తరగతి సర్టిఫికెట్ లేదా మార్క్స్ మెమో లేదా అడ్మిట్ కార్డు (అప్లోడ్ సైజ్: 100 కేబీ నుంచి 150 కేబీ)
4. పుట్టిన తేదీ సర్టిఫికెట్ (అప్లోడ్ సైజ్: 100 కేబీ నుంచి 150 కేబీ)
5. కులం సర్టిఫికెట్ (ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే) (అప్లోడ్ సైజ్: 100 కేబీ నుంచి 150 కేబీ)
6. ఫిజికల్లీ హ్యాండీక్యాప్ సర్టిఫికెట్ (అప్లోడ్ సైజ్: 100 కేబీ నుంచి 15)

Important Dates

దరఖాస్తునకు చివరి తేదీ: జూన్ 20, 2022 (సోమవారం) మధ్యాహ్నం ఒంటి గంట వరకు
ప్రవేశ పరీక్ష నిర్వహించు తేదీ: జూన్ 26, 2022 (ఆదివారం)

Contact Details

Room No.102, Admission Desk at Diploma Block,
Phone No: 9502405170
E-Mail: [email protected]
Website: www.citdindia.org

– Diploma Courses in CITD