Diploma Courses in NIEPID : సికింద్రాబాద్ లోని మనోవికాస్ నగర్ లో గల నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ అఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజేబిలిటీస్ (దివ్యాంగ్జన్) (National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities (Divyangjan)-NIEPID) 2022-23 విద్యా సంవత్సరంలో రెండు డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికిషన్ విడుదల చేసింది. ఇవి ఏడాది వ్యవధి కలిగిన కోర్సులు. ఢిల్లీలోని రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమోదం పొందిన కోర్సులు. ఈ కోర్సులు పూర్తిచేసిన వెంటనే అభ్యర్థులకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Details of Courses
1. డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్
(Diploma in Vocational Rehabilitation)
2. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్
(Diploma in Early Childhood Special Education)
Job Opportunities
- డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ కోర్సు పూర్తిచేసిన వారికి వొకేషనల్ ఇన్ స్ట్రక్టర్ గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- ప్లేస్మెంట్ ఆఫీసర్, వొకేషనల్ అండ్ ప్రొడక్షన్ సెంటర్స్ ఇన్ చార్జి, వొకేషనల్ కౌన్సిలర్ అండ్ గైడ్, రిహాబిలిటేషన్ అసిస్టెంట్, జాబ్ వర్క్ ట్రైనర్ గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారికి ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేటర్ గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- రెగ్యులర్ ప్రీ స్కూళ్లు, స్పెషల్ స్కూళ్లలో ప్రీ స్పెషల్ చిన్నారులకు తరగతులు బోధించే అవకాశం ఉంటుంది.
- ECSE/ECE లోని రిసెర్చ్ ప్రాజెక్టులలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
- ప్రత్యేక విద్యా అవసరాలు ఉన్న పిల్లలతో పాటు అంగన్వాడీ సెంటర్స్, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ప్రీ స్కూళ్లను సమన్వయం చేయడం తదితర అవకాశాలు లభిస్తాయి.
Eligibility
ఈ కోర్సులలో చేరడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు/ సెంట్రల్ బోర్డు/యూనివర్సిటీలో 10+2లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5శాతం సడలింపు ఉంటుంది.
Courses Duration
డిప్లొమా ఇన్ వొకేషనల్ రిహాబిలిటేషన్ కోర్సు వ్యవధి పది నెలలు. 220 పనిదినాలు ఉంటాయి. వారంలో ఐదు రోజులు పనిదినాలు ఉంటాయి. ప్రతి రోజు 7 గంటలు తరగతులు ఉంటాయి. టీచింగ్ అండ్ ప్రాక్టికల్స్ 175 రోజులు, ఎడ్యుకేషన్ టూర్ 15 రోజులు, టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్ 30 రోజులు ఉంటాయి. డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సు వ్యవధి ఒక సంవత్సరం. 220 పనిదినాలు ఉంటాయి. వారంలో ఐదు రోజులు పనిదినాలు ఉంటాయి. ప్రతి రోజు 8 గంటలు తరగతులు ఉంటాయి. రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సూచనలతో మూడు నెలలు ఇంటర్న్ షిప్ ఉంటుంది.
Number of Seats
- ఒక్కో కోర్సులో మొత్తం ముప్పై (30) సీట్లు ఉంటాయి.
- నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సీట్లు కేటాయిస్తారు.
- రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయంతో ఓబీసీ కేటగిరీలో సూపర్ న్యూమరీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
Admission Criteria
ముందుగా దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో విద్యార్హతల ఆధారంగా ఒక్క సీటుకు మూడు దరఖాస్తులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తర్వాత తుది జాబితాను తయారు చేస్తారు. మొత్తం 100 మార్కులలో విద్యార్హతలకు 60 మార్కులు, మెంటల్ రిటార్డేషన్ లో అనుభవం ఉన్న అభ్యర్థులకు అలాగే, గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు 10 మార్కులు, మెంటల్ రిటార్డేషన్ ఉన్న వ్యక్తుల తల్లిదండ్రులకు, తోబుట్టువులకు 10 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయిస్తారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు టీఏ, డీఏ లాంటివి ఇవ్వరు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతోనే హాజరు కావాల్సి ఉంటుంది.
How to Apply
ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు NIEPID వెబ్ సైట్ (www.niepid.nic.in) లో పొందుపరిచిన దరఖాస్తు ఫారంను డౌన్ లోడ్ చేసుకోవాలి. దానిని పూర్తిగా నింపాలి. దానికి సెల్ఫ్ అటెస్ట్ చేసిన విద్యార్హతలు, అనుభవం, కులం, వైకల్యంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. వాటిని జూలై 29, 2022లోపు Incharge, Academics, National Institute for the Empowerment of Persons with Intellectual Disabilities (Divyangjan), Manovikasnagar, Secunderabad-500 009, Telangana చిరునామాలో అందజేయాలి. ఆ సమయంలో జనరల్ ఓబీసీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.350 రుసుము చెల్లించాలి. దివ్యాంగులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
Important Points
- ఒక్కసారి ఎంచుకొన్న కోర్సును తిరిగి మార్చుకోవడానికి వీలు ఉండదు.
- రెండు కోర్సుల బోధన ఇంగ్లిష్ లో మాత్రమే ఉంటుంది. అయితే, అభ్యర్థులు చివరి వార్షిక పరీక్షలు హిందీ, ఇంగ్లిష్ లేదా వారి అధికారిక
ప్రాంతీయ భాషల్లో రాసుకోవచ్చు. - థియరీ పరీక్షలు మరియు ప్రాక్టికల్స్ లో అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- ప్రతి అభ్యర్థికి 80 శాతం అటెండెన్స్ తప్పనిసరి. 80 శాతం అటెండెన్స్ ఉన్న అభ్యర్థులనే వార్షిక పరీక్షకు అనుమతిస్తారు. అలాగే, ప్రాక్టికల్ వర్క్ 100 శాతం పూర్తిచేయాలి. ప్రాక్టికల్స్, అసైన్మెంట్లను సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు ధ్రువీకరించాలి.
- హాజరు శాతం కొరత ఉన్న అభ్యర్థులు వార్షిక పరీక్షలకు ముందే పూర్తిచేసుకోవాలి. లేనివాడల హాల్ టికెట్ ఇవ్వరు.
- కోర్సులో చేరే ముందు అభ్యర్థులు సివిల్ అసిస్టెంట్ సర్జన్ జారీ చేసిన ఫిట్ నెస్ సర్టిఫికెట్ సమర్పించాలి.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: జూలై 29, 2022
ఫోన్ నెంబర్: 040-27751741-45
ఫ్యాక్స్: 040-27750198
ఈ-మెయిల్: [email protected]
వెబ్ సైట్: www.niepid.nic.in
– Diploma Courses in NIEPID