Education

Diploma Courses in PJTSAU

Diploma Courses in PJTSAU : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (Professor Jayashankar Telangana State Agricultural University-PJTSAU) 2022-23 విద్యాసంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీకి చెందిన పాలిటెక్నిక్ లతో పాటు అనుబంధ (Affiliated) పాలిటెక్నిక్ లలో డిప్లొమా (Diploma) కోర్సులలో ప్రవేశాలకు నోటిఫికేషన్ (DIPR RO.No.4832-PP/CL/ADVT/1/2022-23) జారీ చేసింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (State Board of Technical Education and Training-(SBTET) హైదరాబాద్, అగ్రికల్చర్ స్ట్రీమ్ లో నిర్వహించిన POLYCET-2022 లో సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Courses & Duration

1. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (Diploma in Agriculture) – రెండు (02) సంవత్సరాలు
2. డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (Diploma in Organic Agriculture) – రెండు (02) సంవత్సరాలు
3. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (Diploma in Agricultural Engineering) – మూడు (03) సంవత్సరాలు

Polytechnics & Seats

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సును అందిస్తున్న పాలిటెక్నిక్ లు
University Polytechnics:
1. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పాలెం, నాగర్ కర్నూల్ జిల్లా (బాలబాలికలు) – 20 సీట్లు
2. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పొలాస, జగిత్యాల జిల్లా (బాలబాలికలు) – 20 సీట్లు
3. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, కంపసాగర్, నల్గొండ జిల్లా (బాలబాలికలు) – 20 సీట్లు
4. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, బసంత్ పూర్, సంగారెడ్డి జిల్లా (బాలురు) – 20 సీట్లు
5. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, మధిర, ఖమ్మం జిల్లా (బాలబాలికలు) – 20 సీట్లు
6. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, జోగిపేట్, సంగారెడ్డి జిల్లా (బాలికలు) – 20 సీట్లు
7. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, తోర్నాల, సిద్దిపేట జిల్లా (బాలబాలికలు) – 40 సీట్లు
8. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, జమ్మికుంట, కరీంనగర్ జిల్లా (బాలురు) – 20 సీట్లు
9. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, మాల్తుమ్మెద, కామారెడ్డి జిల్లా (బాలురు) – 20 సీట్లు
10. అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, రుద్రూరు, నిజామాబాద్ జిల్లా (బాలబాలికలు)-20 సీట్లు

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సును అందిస్తున్న పాలిటెక్నిక్ లు
1. అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, కంది, సంగారెడ్డి జిల్లా (బాలబాలికలు) – 20 సీట్లు

Affiliated Polytechnics:
డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సును అందిస్తున్న పాలిటెక్నిక్ లు
1. డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, తునికి, మెదక్ జిల్లా (బాలబాలికలు) – 90 సీట్లు
2. సాగర్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు
3. శివ కేశవ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పంచగామ, సంగారెడ్డి జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు
4. రత్నపురి అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, తుర్కల ఖానాపూర్, సంగారెడ్డి జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు
5. మదర్ థెరిసా అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు
6. బడే కోటయ్య మొమోరియల్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, పోలేనిగూడెం, సూర్యాపేట జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు
7. పూజ్యశ్రీ మాధవంజీ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు

డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ కోర్సును అందిస్తున్న పాలిటెక్నిక్
1. ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్, గింగుర్తి, వికారాబాద్ జిల్లా (బాలబాలికలు) – 60 సీట్లు

డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సును అందిస్తున్న పాలిటెక్నిక్ లు
1. డాక్టర్ డి.రామానాయుడు విజ్ఞాన జ్యోతి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, తునికి, మెదక్ జిల్లా (బాలబాలికలు) – 30 సీట్లు
2. మదర్ థెరిసా అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా (బాలబాలికలు) – 30 సీట్లు
3. రత్నపురి అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, తుర్కల ఖానాపూర్, సంగారెడ్డి జిల్లా (బాలబాలికలు) – 30 సీట్లు

Eligibility

  • అభ్యర్థులు తెలంగాణ/ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన పదో తరగతి పరీక్ష పాసై ఉండాలి.
  • సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE), ఇండియన్ కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్(ICSE), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్(NIOS), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS), ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (APOSS) లో పదో తరగతి ఉత్తీర్ణులైనవారు కూడా అర్హులే.
  • స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) తెలంగాణ, అగ్రికల్చర్ స్ట్రీమ్ లో నిర్వహించిన POLYCET-2022 రాసి ఉండాలి.

Selection Procedure

పై కోర్సులలో అభ్యర్థులకు SBTET తెలంగాణ అగ్రికల్చర్ స్ట్రీమ్ లో నిర్వహించిన POLYCET-2022 లో సాధించిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నాలుగు (04) సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో (నాన్-మున్సిపల్ ఏరియా) చదివిన విద్యార్థులకు అరవై శాతం (60%) సీట్లు కేటాయిస్తారు. అభ్యర్థులు ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. 85 శాతం సీట్లు లోకల్ (తెలంగాణ) అభ్యర్థులకు కేటాయిస్తారు. 15 శాతం సీట్లు నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. ఇందులో తెలంగాణ అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది.

Age Limit

డిసెంబర్ 31, 2022 నాటికి అభ్యర్థుల గరిష్ఠ వయసు 22 సంవత్సరాలు మించకూడదు. 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.

Application Fee

ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, దివ్యాంగులు రూ.600, ఇతరులు రూ.1100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. డెబిట్/క్రెడిట్/యూపీఐ/నెట్ బ్యాంకింగ్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించవచ్చు.

How to Apply

ఈ కోర్సులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు PJTSAU వెబ్ సైట్ (www.pjtsau.edu.in)ను ఓపెన్ చేసి అందులోని Online Application for admission into various Diploma courses of PJTSAU for the AY 2022-23 నోటిఫికేషన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత Pay Application Registration Fee పై క్లిక్ చేయాలి.
అందులో అభ్యర్థి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ ఫీజు చెల్లించిన తర్వాత పేమెంట్ రెఫరెన్స్ ఐడీ వస్తుంది. దానిని నోట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి నోటిఫికేషన్ పై క్లిక్ చేసి అందులో Fill Online Application పై క్లిక్ చేయాలి.
అందులో POLYCET -2022 హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, వేమెంట్ రెఫరెన్స్ ఐడీ ఎంటర్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది. దానిలోని వివరాలన్నీ ఎంటర్ చేసి, డ్యాక్యుమెంట్లు అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కౌన్సెలింగ్ కు ఆహ్వానించి అడ్మిషన్లు కల్పిస్తారు.

Required Certificates

కౌన్సెలింగ్/అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు ఈ క్రింది సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.
1. ఎన్సెస్సీ మెమో
2. POLYCET-2022 ర్యాంక్ కార్డ్
3. బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)
4. నాన్-మున్సిపల్ ఏరియా స్టడీ సర్టిఫికెట్ (గ్రామీణ ప్రాంత అభ్యర్థులు)
5. కులం సర్టిఫికెట్ (బీసీ/ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు)
6. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు)
7. వైకల్య సర్టిఫికెట్ (దివ్యాంగులు)
8. ఆర్ముడ్ పర్సనల్ సర్టిఫికెట్/ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికెట్ (సాయుధ బలగాల సిబ్బంది పిల్లలు)
9. NCC సర్టిఫికెట్ (NCC అభ్యర్థులు)
10. స్పోర్ట్స్ సర్టిఫికెట్ (క్రీడాకారులు)

Important Dates

అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ: ఆగస్టు 11, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
ఆన్ లైన్ దరఖాస్తునకు చివరి తేదీ: ఆగస్టు 13, 2022 (సాయంత్రం 5 గంటల వరకు)
దరఖాస్తులో తప్పుల సరవరణ : ఆగస్టు 14, 2022 ( ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు)

– Diploma Courses in PJTSAU

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago