Executive and Marketing Officer JobsA female nurse is at work at the hospital. She is wearing her scrubs and is smiling while looking at the camera.

Executive and Marketing Officer Jobs : న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (Pharmaceuticals & Medical Devices Bureau of India-PMBI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీ అండ్ ఎంఐఎస్, లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్, సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

Details of Jobs

1. సీనియర్ ఎగ్జిక్యూటివ్
2. ఎగ్జిక్యూటివ్
3. సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్
4. మార్కెటింగ్ ఆఫీసర్

Senior Executive

పోస్టు పేరు: సీనియర్ ఎగ్జిక్యూటివ్
డిపార్టుమెంట్ : ఐటీ అండ్ ఎంఐఎస్
వయసు : 30 సంవత్సరాలు
అర్హతలు :
– బీఏసీ / బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్ లో బీ.ఎస్సీ చేసినవారు అర్హులు.
– ఎంసీఏ/ ఎం.టెక్ లేదా కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్సీ చేసిన వారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
అనుభవం : ఐటీ/ ఎంఐఎస్ లో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు. జీతంతో పాటు రవాణా చార్జీలు రూ.6వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ. వెయ్యి ఇస్తారు. అలాగే, రూ.10 లక్షల గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, రూ.5 లక్షల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ, నిబంధనల మేరకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సౌకర్యాలు కల్పిస్తారు.
పని ప్రదేశం : ఢిల్లీ అండ్ ఎన్సీఆర్
కాంట్రాక్టు వ్యవధి : మూడు (03) సంవత్సరాలు (పనితీరును బట్టి మరికొంత కాలం పొడిగించవచ్చు)
ఇంటర్వ్యూ తేదీ, సమయం: 22.09.2022 (గురువారం), ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు.

Executive

పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్
డిపార్టుమెంట్ : లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్
వయసు : 28 సంవత్సరాలు
అర్హతలు :
– ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు. (సంగీతం మరియు లలితకళలు మినహా)
– SAP వంటి లాజిస్టిక్స్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం ఉన్నవారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
అనుభవం : లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ లో ఒక (01) సంవత్సరం అనుభవం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. జీతంతో పాటు రవాణా చార్జీలు రూ.5వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ.500 ఇస్తారు. అలాగే, రూ.10 లక్షల గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ.5 లక్షల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ, నిబంధనల మేరకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సౌకర్యాలు కల్పిస్తారు.
పని ప్రదేశం : ఆలిండియా
కాంట్రాక్టు వ్యవధి: మూడు (03) సంవత్సరాలు (అభ్యర్థి సంతృప్తికర పనితీరును బట్టి మరికొంత కాలం పొడిగించవచ్చు)
ఇంటర్వ్యూ తేదీ, సమయం: 22.09.2022 (గురువారం), ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు.

Senior Marketing Officer

పోస్టు పేరు : సీనియర్ మార్కెటింగ్ ఆఫీసర్
డిపార్టుమెంట్ : సేల్స్ అండ్ మార్కెటింగ్
వయసు 30 సంవత్సరాలు
అర్హతలు :
– బీ.ఎస్సీ/ బీకాం/ బీటీఏ/ బీఫార్మా చేసినవారు అర్హులు.
– ఎం.ఫార్మా/ ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్ చేసినవారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
అనుభవం : ఫార్మా సెక్టార్ లో సేల్స్ లేదా మార్కెటింగ్ లో మూడు (03) సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన వారికి
ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.30,000 చెల్లిస్తారు. జీతంతో పాటు రవాణా చార్జీలు రూ.6వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ. వెయ్యి ఇస్తారు. అలాగే, రూ.10 లక్షల గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, రూ.5 లక్షల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ, నిబంధనల మేరకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సౌకర్యాలు కల్పిస్తారు.
పని ప్రదేశం : సౌత్ ఇండియా
కాంట్రాక్టు వ్యవధి : మూడు (03) సంవత్సరాలు (అభ్యర్థి సంతృప్తికర పనితీరును బట్టి మరికొంత కాలం పొడిగించవచ్చు).
ఇంటర్వ్యూ తేదీ, సమయం: 22.09.2022 (గురువారం), మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.

Marketing Officer

పోస్టు పేరు: మార్కెటింగ్ ఆఫీసర్
డిపార్టుమెంట్ : సేల్స్ అండ్ మార్కెటింగ్
వయసు : 28 సంవత్సరాలు
అర్హతలు :
– బీబీఏ/ బీ.ఎస్సీ/ బీఫార్మా చేసినవారు అర్హులు.
– ఎం.ఫార్మా/ ఎంబీఏ (సేల్స్/మార్కెటింగ్ చేసినవారికి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.
అనుభవం : ఫార్మా సెక్టార్ లో సేల్స్ లేదా మార్కెటింగ్ లో ఒక (01) సంవత్సరం అనుభవం ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు.
జీతం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు. జీతంతో పాటు రవాణా చార్జీలు రూ.5వేలు, టెలిఫోన్ అలవెన్స్ రూ.500 ఇస్తారు. అలాగే, రూ.10 లక్షల గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ.10 లక్షల గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, రూ.5 లక్షల గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ, నిబంధనల మేరకు ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) సౌకర్యాలు కల్పిస్తారు.
పని ప్రదేశం : సౌత్ ఇండియా
కాంట్రాక్టు వ్యవధి: మూడు (13) సంవత్సరాలు (అభ్యర్థి సంతృప్తికర పనితీరును బట్టి మరికొంత కాలం పొడిగించవచ్చు)
ఇంటర్వూ తేదీ, సమయం: 22.09.2022 (గురువారం), మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు.

Important Points

  • పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి.
  • కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • కాంట్రాక్టు వ్యవధి మూడు (03) సంవత్సరాలు ఉంటుంది.
  • సంస్థ అవసరాన్ని బట్టి ఖాళీల సంఖ్య నిర్ణయిస్తారు.
  • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు PMBI వెబ్ సైట్ (http://janaushadhi.gov.in)లో నోటిఫికేషన్ తో పాటు ఉన్న అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకొని, దానిపై రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి, దానిలోని వివరాలన్నీ నింపాలి. అలాగే, విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకొని వెళ్లాలి.

Interview Venue

Pharmaceuticals & Medical Devices Bureau of India (PMBI),
at E-1, 8th Floor, Videocon Tower, Jhandewalan Extn., New Delhi – 110055.

పూర్తి వివరాలు, సహాయం కోసం 011-49431800 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు.

– Executive and Marketing Officer Jobs