Executive Jobs in NTPC : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (National Themal Power Corporation Limited-NTPC) కాంట్రాక్టు ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Advt.No.15/22) జారీ చేసింది. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఎగ్జిక్యూటివ్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
2. ఎగ్జిక్యూటివ్ (సివిల్)
3. ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్)
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్)
పోస్టుల సంఖ్య: పది (10). అన్ రిజర్వుడ్ (UR)-06. ఈడబ్ల్యూఎస్ (EWS)-01. ఓబీసీ (OBC) 02, ఎస్సీ (SC)-01.
అర్హతలు: ఎంబీబీఎస్/బీడీఎస్/బీఏఎంఎస్/బీహెచ్ఎంఎస్/బీ.ఎస్సీ(నర్సింగ్)/ బీ.ఫార్మసీ మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో పీజీ డిగ్రీ/డిప్లొమా చేసిన వారు అర్హులు. అలాగే, కనీసం యాభై పడకల ఆసుపత్రిలో హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ గా కనీసం ఐదు (15) సంవత్సరాల అనుభవం ఉండాలి. మెడికల్ కోర్ ఆఫ్ డిఫెన్స్ సర్వీసెస్ లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయసు: 56 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్టు వ్యవది: నాలుగు (04) సంవత్సరాలు. పనితీరు అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,00,000
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ (సివిల్)
పోస్టుల సంఖ్య: ఒకటి (01). అన్ రిజర్వుడ్ (UR).
ఆర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇనిస్టిట్యూట్ లో సివిల్ ఇంజినీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీ.టెక్ పాసై ఉండాలి. అలాగే, నిర్మాణ రంగంలో కనీసం పది (10) సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్టు వ్యవధి: మూడు (03) సంవత్సరాలు. పనితీరు అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,50,000
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్)
పోస్టుల సంఖ్య: ఒకటి (01), అన్ రిజర్వుడ్ (UR)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ ఇనిస్టిట్యూట్ లో కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పాసై ఉండాలి. అలాగే, నిర్మాణ రంగంలో కనీసం పది (10) సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయసు: 40 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్టు వ్యవధి: మూడు (03) సంవత్సరాలు. పనితీరు అవసరాన్ని బట్టి పెంచే అవకాశం ఉంటుంది.
జీతం: నెలకు రూ.1,50,000
ఈ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒకవేళ దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లయితే ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్/ షార్ట్ లిస్టింగ్/ సెలెక్షన్ టెస్ట్ నిర్వహిస్తారు.
ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు ముందుగా NTPC కి చెందిన వెబ్ సైట్ (https://careers.ntpc.co.in/)లోకి లాగిన్ కావాలి. అందులో Jobs(Current/ UnderProcess) పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత Advt.No.15/22) నోటిఫికేషన్ కింద ఉన్న Click here to apply పై క్లిక్ చేయాలి. అందులో Register పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ గేమ్, కేటగిరీ, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తండ్రి వృత్తి, తల్లి పేరు. తల్లి వృత్తి, చిరునామా, మతం, తదితర వివరాలతో పాటు ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, ఈ-మెయిల్ తో లాగిన్
అయ్యి అప్లికేషన్ ఫాంలోని వివరాలన్నీ నింపి సబ్మిట్ చేయాలి.
రిజిస్ట్రేషన్ ఫీజు నిమిత్తం జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, మాజీ సైనికులు, మహిశలు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు. నెట్ బ్యాంకింగ్, రూపే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతో ఫీజు చెల్లించవచ్చు. ఫీజు చెల్లించిన తర్వాత చాలన్ నంబర్, బ్యాంక్ రెఫరెన్స్ నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్ నోట్ చేసుకొని వాటిని ఆన్ లైన్ అప్లికేషన్ ఎంటర్ చేయాలి.
అదే విధంగా, 30987919993 అకౌంట్ నెంబర్ (CAG బ్రాంచ్. న్యూఢిల్లీ) తో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫ్ లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు. ఒక్కసారి చెల్లించిన ఫీజు మళ్లీ తిరిగి ఇవ్వబడదు. అభ్యర్థులు ఎలాంటి డాక్యుంమెంట్స్ పంపి ల్సిన అవసరం లేదు.
వేతనంతో పాటు ఆదనంగా హెచ్ఐర్షి భార్య/భర్త, ఇద్దరు పిల్లలకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తారు.
పైన సూచించిన విద్యార్హతలలో ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులు మరియు దివ్యాంగులు పాసైనా సరిపోతుంది.
వైన సూచించిన వయసు కేవలం జనరల్ అభ్యర్థులకు మాత్రమే.
ఎస్సీ, ఎస్టీలకు ఐదు (05) సంవత్సరాలు, ఓబీసీలకు మూడు (03) సంవత్సరాలు, దివ్యాంగులకు పది (10) సంవత్సరాల సడలింపు కలదు.
అప్లికేషన్ ఫాం సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ: జూలై 14, 2022
Website: https://www.ntpc.co.in
– Executive Jobs in NTPC
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…