Contract Job

Faculty/Assistant Professor, Senior Resident Jobs in Nims

Faculty SR Jobs in Nims : హైదరాబాద్ లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Nizam’s Institute of Medical Sciences-NIMS) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈఐసీయూ (eICU) పైలట్​ ప్రాజెక్టులో ఈఐసీయూ స్పోక్స్​ (eICU Spokes) లో ఫ్యాకల్టీ/ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ (Faculty/Assistant Professor), సీనియర్​ రెసిడెంట్​ (Senior Resident) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (SRC/AC-4/564/2021) జారీ చేసింది. మొత్తం ఐదు (05) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Posts & Vacancies

ఫ్యాకల్టీ/ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ (Faculty/Assistant Professor) ‌‌- 02
సీనియర్​ రెసిడెంట్​ (Senior Resident) ‌‌- 03

Qualification  and Experience

ఫ్యాకల్టీ/ అసిస్టెంట్​ ప్రొఫెసర్ పోస్టులకు అనెస్తీషియాలజీ లేదా జనరల్​ మెడిసిన్​ లేదా ఎమర్జెన్సీ మెడిసిన్​లో ఎండీ చేసిన వారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్​ రెసిడెంట్ పోస్టులకు అనెస్తీషియాలజీ లేదా జనరల్​ మెడిసిన్​ లేదా ఎమర్జెన్సీ మెడిసిన్​లో ఎండీ చేసిన వారు అర్హులు. అలాగే, సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

Salary per Month

ఫ్యాకల్టీ/ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ – రూ.1,30,000
సీనియర్​ రెసిడెంట్​ ‌‌- రూ.80,000

How to Apply

ఆసక్తి కలిగిన, అర్హులైన అభ్యర్థులు నిమ్స్ వెబ్సైట్ (https://nims.edu.in/) ను ఓపెన్ చేసి అందులో ఎడమ వైపున స్క్రోల్ అవుతున్న ఆప్షన్లలో Recruitment of Faculty and the Senior Residents in eICUs Pilot Project under the Department of Anaesthesiology and Intensive Care పై క్లిక్ చేయాలి. అందులో Download పై క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్
అవుతుంది. అందులో దిగువ భాగంలో అప్లికేషన్ ఫాం ఉంటుంది. దానిని ప్రింట్ తీసుకొని అందులో రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అతికించి అందులోని వివరాలన్నీ నింపాలి. అలాగే, దానికి విద్యార్హతలు, అనుభవంనకు సంబంధించిన సర్టిఫికెట్లు జతచేయాలి. ఆ మొత్తం సర్టిఫికెట్లను ఓ ఎనవలప్​ కవర్​లో పెట్టి ఆ కవర్​పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నది రాయాలి. ఆ కవర్​ను ఈ కింది అడ్రస్ కు పోస్టు ద్వారా గానీ, నేరుగా వెళ్లి గానీ మే 08, 2023 సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలి.
The Dean,
Nizam’s Institute of Medical Sciences,
Panjagutta, Hyderabad – 500082, TS.

దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఫోన్​ ద్వారా సమాచారం ఇస్తారు.

Importanat Points

  • ఈ పోస్టులు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలం పనిచేయాల్సి ఉంటుంది.
  • ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారికి భవిష్యత్తులో నిమ్స్ చేపట్టబోయే రెగ్యులర్ ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ప్రయోజనం కల్పించరు.
  • దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారికి ఇంటర్వ్యూ తేదీ, సమయం, స్థలం ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
  • ఇంటర్వ్యూకు అలాగే, జాయినింగ్ కోసం వచ్చే సమయంలో టీఏ, డీఏలాంటివి ఇవ్వరు.
  • అభ్యర్థులు సొంత ఖర్చులతో హాజరు కావాల్సి ఉంటుంది.

– Faculty SR Jobs in Nims

Kautilya Creative

Recent Posts

1,284 Lab-Technician Grade-II Jobs

Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్​మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్​ – టెక్నిషియన్​…

2 months ago

Required Documents for Nursing Officer Jobs

Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​…

2 months ago

2,050 Nursing Officer (Staff Nurse) Jobs in Telangana

Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్​ ఆఫీసర్​ (స్టాఫ్…

2 months ago

Staff Nurse, Lab Technician, Physiotherapist Jobs in BSF

Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…

6 months ago

Admissions in Telangana Residential Junior Colleges

Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…

10 months ago

Inter Admissions in TSWREIS

Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​ ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూషన్స్​ సొసైటీ (Telangana Social Welfare…

11 months ago