Free Coaching for Civils Examinations : తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (Telangana BC Study Circle) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బీసీ అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్ష – 2023 (Civil Service Examination-2023)కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) (Long Term (Prelims-cum-Mains)) శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (Rc.No.C/345/2022) జారీ చేసింది.
ఈ శిక్షణ కోసం అభ్యర్థులను అకడమిక్ పర్ఫార్మెన్స్ మరియు ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ 28, 2022 నుంచి మే 20, 2023 వరకు శిక్షణ ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ మరియు అఫ్ లైన్ పద్ధతులలో దరఖాస్తు చేసుకోవచ్చు.
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కేంద్రం (Telangana State Employability Skill Development & Training Centre) ద్వారా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ క్యాంపస్, తార్నాకలో గల బీసీ స్టడీ
సర్కిల్ సెంటర్ లో అదేవిధంగా, హన్మకొండలోని బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ లో శిక్షణ ఇస్తారు.
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో గల సెంటర్ లో 200 మంది అభ్యర్థులకు, హన్మకొండలోని సెంటర్ లో 100 మంది అభ్యర్థులకు
శిక్షణ ఇస్తారు. ఇందులో 50 శాతం సీట్లను 31 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండి గతంలో సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి, గ్రూప్-1 (మెయిన్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి, 75 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణులైనవారికి కేటాయిస్తారు. వీరు సెప్టెంబర్ 22, 2022 లోపు నేరుగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో గల సెంటర్ లో గానీ, హన్మకొండలోని సెంటర్ లోగానీ దరఖాస్తు చేసుకో వచ్చు.
మిగిలిన 50 శాతం సీట్లను ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు కేటాయిస్తారు. ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు లాడ్జిండ్, బోర్డింగ్, రవాణా ఖర్చుల నిమిత్తం నెలకు రూ.5000 చెల్లిస్తారు. అలాగే, రూ.5000 విలువైన మెటిరియల్ అందిస్తారు. లైబ్రరీ సౌకర్యం కూడా కల్పిస్తారు.
గతంలో సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, గ్రూప్-1 (మెయిన్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, 75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణులైనవారు నేరుగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో గల సెంటర్ లో గానీ, హన్మకొండలోని సెంటర్ లోగానీ దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కు కూడా హాజరు కావాల్సి అవసరం లేదు. వారికి నేరుగా ప్రవేశం కల్పిస్తారు.
ఇతర జనరల్ అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అప్ లోడ్ చేయాలి.
అభ్యర్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షిక (2022-23 ఆర్థిక సంవత్సరం) కుటుంబ ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి.
ఇది ఫుల్ టైం కోర్సు. కాబట్టి అభ్యర్థులు 2022-23 సంవత్సరంలో ఇతర విద్యా సంస్థల్లో ఎలాంటి కోర్సులు అభ్యసించకూడదు. అలాగే, ఎలాంటి
ఉద్యోగం చేయకూడదు.
ఇంతకు ముందు హైదరాబాద్ లోగానీ, జిల్లాల్లో గానీ అభ్యర్థులు ఇలాంటి ప్రభుత్వ కోచింగ్ తీసుకొని ఉండకూడదు.
అభ్యర్థులు UPSC CSAT-2023 కు సంబంధించిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
కోచింగ్ సమయంలో అభ్యర్థులు 75 శాతం హాజరు కలిగి ఉంటేనే రూ.5వేల స్టైపెండ్ ఇస్తారు.
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 75 శాతం (బీసీ(ఏ)-18 శాతం, బీసీ(బీ)-26శాతం, బీసీ (సీ) -3 శాతం, బీసీ(డీ)-18 శాతం, బీసీ (ఈ) 10 శాతం) సీట్లు కేటాయిస్తారు.
అలాగే, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 5 శాతం, ఈబీసీ, అనాథలకు 5 శాతం సీట్లు కేటాయిస్తారు.
మొత్తం సీట్లలో 33.33 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయిస్తారు.
ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ టైప్ లో మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
ప్రశ్న పత్రం ఇంగ్లిష్ లోనే ఉంటుంది. జనరల్ స్టడీస్ సిలబస్ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు.
అలాగే, UPSC CSAT పేపర్-2 ప్రకారం రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
అభ్యర్థులు హాల్ టికెట్లు బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
టెస్ట్ తేదీ, సమయం, సెంటర్ హాల్ టికెట్ లో ఉంటాయి.
గతంలో సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, గ్రూప్-1 (మెయిన్స్) పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, 75 శాతం అంతకంటే ఎక్కువ
మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉత్తీర్ణులైనవారు బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ (https://studycircle.cgg.gov.in/)ను ఓపెన్ చేసి అందులో
Backward Classes Welfare Department పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత Free Coaching Program for Civil Services Examination, 2023 కింద ఉన్న ఉన్న Offline Application పై క్లిక్
చేసి డౌన్ లోడ్ చేసుకోవాలి.
అందులోని వివరాలన్నీ నింపి, అందులో సూచించిన సర్టిఫికెట్లు జతచేసి నేరుగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో గల సెంటర్ లో గానీ, హన్మకొండలోని సెంటర్ లోగానీ అందజేయాలి.
ఇతరులు Free Coaching Program for Civil Services Examination, 2023 కింద ఉన్న ఉన్న Apply Online పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం వస్తుంది.
అందులోని వివరాలన్నీ నింపి, అందులో సూచించిన సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ప్రక్రియలో ఏమైనా సమస్యలు తలెత్తితే 040-24071178, 040-27077929, 7780359322 (హైదరాబాద్), 0870-2571192, 9948221077 (హన్మకొండ) నెంబర్లకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు.
ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: సెప్టెంబర్ 22, 2022
ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ : సెప్టెంబర్ 25, 2022 (ఉదయం 10 గంటల
నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)
ఫలితాల ప్రకటన : సెప్టెంబర్ 27, 2022
తరగతులు ప్రారంభం: సెప్టెంబర్ 28, 2022
– Free Coaching for Civils Examinations
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…