Free Coaching For CSAT 2023 : హైదరాబాద్ (బంజారాహిల్స్) లోని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ (Telangana State Scheduled Castes Study Circle-TSSCSC) 2022-23 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ (SC, ST, BC, Minority) అభ్యర్థులకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (UPSC, CSAT-2023)కు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Rc.No.TSSCSC/34/CSAT-2023/2023) జారీ చేసింది. ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
Number of Seats
ఈ శిక్షణలో మొత్తం 250 సీట్లు ఉంటాయి. ఇందులో 200 సీట్లు ఫ్రెషర్స్ కు కేటాయిస్తారు. 50 సీట్లు గతంలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు (రిపీటర్స్) కేటాయిస్తారు. ఇందులో 15 సీట్లు గత విద్యా సంవత్సరం (2021-22)లో మంచి పనితీరు కనబరిచిన ఫ్రెషర్స్ కు, అలాగే, 10 సీట్లు గత సంవత్సరం CSATలో మంచి పనితీరు కనబరిచిన రిపీటర్స్ కు కేటాయిస్తారు. మిగిలిన 25 సీట్లు 2021-22లో ఫ్రెషర్స్ గా జాయిన్ అయిన రిపీటర్స్ కు కేటాయిస్తారు. అభ్యర్థుల పనితీరును 2021-22లో నిర్వహించిన పరీక్షలలో సాధించిన మెరిట్ ఆధారంగా నిర్ణయిస్తారు.
Eligibility
- ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు.
- తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక (2021-22 ఆర్థిక సంవత్సరం) ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు.
- ఇది ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్సు కాబట్టి అభ్యర్థులు 2022-23 సంవత్సరంలో ఇతర విద్యా సంస్థల్లో ఎలాంటి కోర్సులు అభ్యసించకూడదు.
- ఎలాంటి ఉద్యోగం చేయకూడదు.
- మరోచోట ఇలాంటి ప్రభుత్వ కోచింగ్ తీసుకోకూడదు.
- CSAT-2023 కు హాజరయ్యేందుకు UPSC సూచించిన అన్ని నిబంధనలకు అభ్యర్థులు అర్హులై ఉండాలి.
Age Limit
ఆగస్టు 01, 2023 నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయసు 37 సంవత్సరాలు, బీసీ అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థుల వయసు 47 సంవత్సరాలు, బీసీ దివ్యాంగ
అభ్యర్థుల వయసు 45 సంవత్సరాలు మించకూడదు.
How to Apply
ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్స్ కు చెందిన వెబ్ సైట్ (http://tsstudycircle.co.in/) ను ఓపెన్ చేయాలి. అందులో CSAT-2023 Notification, Paper Notification, Apply Online స్క్రోల్ అవుతుంటాయి. అందులో Apply Online పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ Apply Online పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫాం ఓపెన్ అవుతుంది. అందులోని వివరాలన్నీ పూరించాలి.
అభ్యర్థి ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, ఎన్సెస్సీ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, వయసు, జెండర్, కులం, ఉప కులం, నేటివ్ జిల్లా, దివ్యాంగులా?, వైవాహిక స్థితి, తండ్రి/గార్డియన్ వార్షిక ఆదాయం, విద్యార్హతలు, ఆధార్ కార్డ్ నెంబర్, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
అలాగే, అభ్యర్థి చిరునామా, పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు హాల్ టికెట్ నెంబర్, పూర్తి మార్కులు సాధించిన మార్కులు, గ్రేడ్, పర్సంటేజీ, పాసైన సంవత్సరం, చదివిన సంస్థ, ప్రాంతం, బోర్డు/యూనివర్సిటీ తదితర వివరాలు తెలియజేయాలి.
ఇంతకు ముందు హైదరాబాద్ లో గానీ, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లలో కోచింగ్ తీసుకొని ఉంటే, ఆ సంవత్సరం
పేర్కొనాలి.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కు ఇప్పటి వరకు చేసిన అటెంప్ట్ ల సంఖ్య, మెయిన్స్ కు హాజరైతే ఆ వివరాలు ఎంటర్ చేసి పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాలి.
అనంతరం ఈ కింది సర్టిఫికెట్లు అప్ లోడ్ చేయాలి.
1. అభ్యర్థి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
2. అభ్యర్థి సంతకం
3. ఎస్సెస్సీ మార్కుల మెమో
4. కులం సర్టిఫికెట్
5. ఇటీవలే తీసుకున్న ఆదాయం సర్టిఫికెట్
6. ఇంటర్మీడియట్ మార్కుల మెమో
7. డిగ్రీ/పీజీ/ప్రొఫెషనల్ కన్సాలిడేటెడ్ మార్కుల మెమోలు
8. ఆధార్ కార్డ్
పై అన్ని సర్టిఫికెట్లు స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్ లో 1ఎంబీ సైజ్ లోపు ఉండేలా చూసుకొని అప్ లోడ్ చేయాలి.
Entrance Examination
ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ టైప్ లో మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది. యూపీఎస్సీ నిర్వహించే ప్రిలిమ్స్ ఎగ్జామ్ మాదిరిగానే ఉంటుంది. జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు ఇస్తారు. CSAT Paper-II లోని అంశాలైన టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ల నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ స్టడీస్ ప్రశ్నలకు ఒక జవాబుకు రెండు మార్కులు ఇస్తారు. సీశాట్ పేపర్-2 ప్రశ్నలకు ఒక జవాబుకు రెండున్నర మార్కులు ఇస్తారు. మొత్తం 300 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక తప్పు సమాధానికి మూడో వంతు మార్కు కట్ చేస్తారు.
ప్రవేశ పరీక్ష సెప్టెంబర్ 18, 2022 న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉంటుంది.
హాల్ టికెట్లు సెప్టెంబర్ 12, 2022 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
Selection of Candidates
రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 33.33 శాతం మహిళా అభ్యర్థులకు, 5 శాతం సీట్లు దివ్యాంగులకు కేటాయిస్తారు.
శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఎస్సీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ లో పెడతారు. అలాగే, అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా కూడా తెలియజేస్తారు. అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు ఈ కింది ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది.
1. పదో తరగతి మార్క్స్ మెమో
2. కులం సర్టిఫికెట్
3. ఆదాయం సర్టిఫికెట్ (ఆగస్టు 2021 తర్వాత జారీ చేసింది)
4. డిగ్రీ/పీజీ/ ప్రొఫెషనల్ డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్
5. డిగ్రీ/పీజీ/ ప్రొఫెషనల్ డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్కుల మెమోలు
6. ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్ (టీసీ)
7. ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ (ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ జారీ చేసింది.)
8. ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
9. కావిడ్-19 టెస్ట్ సర్టిఫికెట్
10. కావిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ (రెండు డోసులది)
11. వైకల్యం సర్టిఫికెట్ (దివ్యాంగులు)
12. మూడు రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు
Important Dates
ఆన్ లైన్ దరఖాస్తు కు చివరి తేదీ: సెప్టెంబర్ 07, 2022
హాల్ టికెట్ల డౌన్ లోడ్ : సెప్టెంబర్ 12, 2022
ప్రవేశ పరీక్ష : సెప్టెంబర్ 18, 2022
ఇతర వివరాల కోసం 040-23546552 ఫోన్ నెంబర్ గానీ, [email protected] ఈ-మెయిల్ ను గానీ సంప్రదించవచ్చు.
– Free Coaching For CSAT 2023