Free Coaching in TSSCSC : తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ (Telangana State Scheduled Castes Study Circle-TSSCSC) 2022-23 కాలానికి గాను బ్యాంకింగ్ (Banking), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తోపాటు స్టేట్ సర్వీసెస్ (TSPSC) ఉద్యోగాలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ (SC, ST, BC, Minority) అభ్యర్థులకు ఐదు (05) నెలల ఫౌండేషన్ కోర్సు (Foundation Course) లో ఉచిత కోచింగ్ (Free Coaching) ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ఆసక్తికలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Rc.No.TSSCSC/35/2022) జారీ చేసింది. ప్రవేశ పరీక్ష నిర్వహించి అందులో వచ్చిన మార్కుల్లో మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ శిక్షణకు ఎంపిక చేస్తారు. రాష్ట్రంలో పదకొండు (11) శిక్షణ కేంద్రాల్లో కోచింగ్ ఇస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో కోచింగ్ ఇస్తారు. ఒక్కో శిక్షణ కేంద్రంలో వంద (100) మందికి శిక్షణ ఇస్తారు.
నల్గొండలోని శిక్షణ కేంద్రంలో నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల అభ్యర్థులకు, వరంగల్ లోని శిక్షణ కేంద్రంలో జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల అభ్యర్థులకు, కరీంనగర్ లోని శిక్షణ కేంద్రంలో కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల అభ్యర్థులకు, మహబూబ్ నగర్ లోని శిక్షణ కేంద్రంలో నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల అభ్యర్థులకు, నిజామాబాద్ లోని శిక్షణ కేంద్రంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అభ్యర్థులకు, ఆదిలాబాద్ లోని శిక్షణ కేంద్రంలో నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులకు, ఖమ్మంలోని శిక్షణ కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల అభ్యర్థులకు, రంగారెడ్డిలోని శిక్షణ కేంద్రంలో మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అభ్యర్థులకు, సిద్దిపేటలోని శిక్షణ కేంద్రంలో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల అభ్యర్థులకు, సూర్యాపేట జిల్లాలోని శిక్షణ కేంద్రంలో సూర్యాపేట జిల్లా అభ్యర్థులకు, జగిత్వాల జిల్లాలోని శిక్షణ కేంద్రంలో జగిత్యాల జిల్లా అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
అభ్యర్థులు ఏదైనా విభాగంలో మూడేళ్ల గ్రాడ్యుయేషన్ (B.A/ B.Com/ B.Sc) లేదా నాలుగేళ్ల ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ (B.Tech/B.Pharma/ B.Sc(Ag) ఉత్తీర్ణులైనవారు అర్హులు.
అభ్యర్థి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల కుటుంబ వార్షిక (సెప్టెంబర్ 2021 నుంచి సెప్టెంబర్ 2022 వరకు) ఆదాయం రూ.3 లక్షలు మించకూడదు.
ఇది ఫుల్ టైం రెసిడెన్షియల్ కోర్సు. కాబట్టి అభ్యర్థులు 2022-23 సంవత్సరంలో ఇతర విద్యా సంస్థల్లో ఎలాంటి కోర్సులు అభ్యసించకూడదు. అలాగే, ఎలాంటి ఉద్యోగం చేయకూడదు.
మరోచోట ఇలాంటి ప్రభుత్వ కోచింగ్ తీసుకోకూడదు.
అభ్యర్థులు టీఎస్ పీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీసెస్, ఆర్ఆర్డీ, ఎస్సెస్సీ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని అర్హతలు కలిగి ఉండాలి.
ఇంతకు ముందు హైదరాబాద్ లోగానీ, జిల్లాల్లో గానీ ఐదు (05) నెలల ఫౌండేషన్ కోర్సు కోచింగ్ తీసుకొని ఉండకూడదు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 24, 2022
ప్రవేశ పరీక్ష: అక్టోబర్ 02, 2022
కోచింగ్ వ్యవధి : ఐదు (05) నెలలు (అక్టోబర్ 19, 2022 నుంచి మార్చి 18, 2022 వరకు)
పూర్తి వివరాలకు ఆయా శిక్షణ కేంద్రాల డెరెక్టర్లను ఫోన్ లో సంప్రదించవచ్చు.
నల్గొండ – 9396621492, వరంగల్ – 9866918656, కరీంనగర్ – 9885218053, మహబూబ్ నగర్ – 8500334470, నిజామాబాద్ – 9491468799, ఆదిలాబాద్ – 9494149416, ఖమ్మం – 9848494290, రంగారెడ్డి – 9000919109, సూర్యాపేట – 9989129935, సిద్దిపేట – 7989332923, జగిత్యాల – 9959264770.
– Free Coaching in TSSCSC
Lab Technician Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిపార్ట్మెంట్లలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా ల్యాబ్ – టెక్నిషియన్…
Documents for Nursing Officer Jobs : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్…
Nursing Officer Jobs in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్…
Regular Jobs in BSF : భారత ప్రభుత్వ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Government of India,…
Admissions in Residential Junior Colleges: తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ (Telangana Residential Educational Institutions Socity-TSREIS) రాష్ట్రంలోని…
Inter Admissions in TSWREIS : తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (Telangana Social Welfare…