GMC Siddipet Recruitment 2022 : తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాల/ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (Government Medical College(GMC) /Government General Hospital(GGH)) లో వివిధ విభాగాలలో ప్రొఫెసర్స్ (Professors), అసోసియేట్ ప్రొఫెసర్స్ (Associate Professors), అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (Assistant Professors) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification No.133/2022) జారీ చేసింది. అకడమిక్ మార్కులలో మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తికలిగిన అభ్యర్థులు పోస్టు లేదా ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
Posts Details & Vacancies
1.ప్రొఫెసర్స్ (Professors) – 03
2. అసోసియేట్ ప్రొఫెసర్స్ (Associate Professors)-08
3. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ (Assistant Professors)-11
+ (Posts Sanctioned under GO.Rt.No. 70 Finance (HRM-VII) Dept – 46)
Professors
విభాగాల వారీగా ఖాళీలు:
1. రెస్పిరేటరీ మెడిసిన్ (Respiratory Medicine) – 01
2. రేడియాలజీ (Radiology) – 01
3. అనెస్తీషియా (Anaesthesia) – 01
అర్హతలు: సంబంధిత విభాగాలలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ/ సంస్థలో సంబంధిత సబ్జెక్ట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా మూడు(03) సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.1,90,000
Associate Professors
విభాగాల వారీగా ఖాళీలు:
1. రేడియాలజీ (Radiology) – 01
2. అనెస్తీషియా (Anaesthesia) – 01
3. ఫార్మకాలజీ (Pharmacology) – 01
4. ఫోరెన్సిక్ మెడిసిన్ (Forensic Medicine) – 01
5. జనరల్ మెడిసిన్ (General Medicine) – 02
6. పీడియాట్రిక్స్ (Pediatrics) – 01
7. ఆర్థోపెడిక్స్ (Orthopedics) – 01
8. ఈఎన్టీ (ENT) – 01
అర్హతలు: సంబంధిత విభాగాలలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ చేసి ఉండాలి. గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ/సంస్థలో సంబంధిత సబ్జెక్ట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నాలుగు (04) సంవత్సరాలు పనిచేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.1,50,000
Assistant Professor
విభాగాల వారీగా ఖాళీలు:
1. రెస్పిరేటరీ మెడిసిన్ (Respiratory Medicine) – 01
2. రేడియాలజీ (Radiology) – 03
3. ఫార్మకాలజీ (Pharmacology) – 01
4. ఆప్తమాలజీ (Ophthalmology) – 01
5. సైకియాట్రి (Psychiatry) – 01
6. ఈఎన్టీ (ENT) – 01
7. ఫిజియాలజీ (Physiology) – 01
8. ఫాథాలజీ (Pathology) – 01
9. కమ్యూనిటీ మెడిసిన్ (Community Medicine) – 01
Posts Sanctioned under GO.Rt.No. 70 Finance (HRM-VII) Dept
విభాగాల వారీగా ఖాళీలు:
1. జనరల్ మెడిసిన్ (Respiratory Medicine) – 10
2. పీడియాట్రిక్స్ (Pediatrics) – 08
3. జనరల్ సర్జరీ (General Surgery) – 10
4. ఆర్థోపెడిక్స్ (Orthopedics) – 08
5. ఓబీజీ (OBG) – 10
అర్హతలు: సంబంధిత విభాగాలలో ఎండీ/ఎంఎస్/డీఎన్బీ చేసి ఉండాలి. ఎండీ/ఎంఎస్ చేసిన తర్వాత గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ/ సంస్థలో సంబంధిత సబ్జెక్ట్ లో సీనియర్ రెసిడెండ్ గా ఏడాది కాలం పనిచేసి ఉండాలి.
జీతం: నెలకు రూ.1,25,000
Selection Criteria
ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో విద్యార్హతలకు సంబంధించిన మార్కులకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రులు, ఇనిస్టిట్యూట్ లు, ప్రోగ్రాంలలో పనిచేసిన వారికి 10 పాయింట్లు, ఇంటర్వ్యూకు 10 పాయింట్లు కేటాయిస్తారు.
How to Apply
- ఆసక్తికలిగిన, అర్హులైన అభ్యర్థులు సిద్దిపేట మెడికల్ కళాశాల అధికారిక వెబ్ సైట్ (www.gmcsiddipet.org) లో నిర్ణీత ఫార్మాట్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాంను డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులోని ఇవరాలన్నీ పూర్తిగా నింపాలి.
- అప్లికేషన్ ఫాంకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎన్సెస్సీ/బర్త్ సర్టిఫికెట్, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్స్, ప్రైవేటులో చదివిన వారు రెసిడెన్స్ సర్టిఫికెట్, ఎంబీబీఎస్ మరియు ఎండీ/ఎంఎస్/డీఎన్బీ సర్టిఫికెట్స్, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకొన్న సర్టిఫికెట్లు, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్లు, సీనియర్ రెసిడెంట్ సర్టిఫికెట్స్ జతచేయాలి.
- ఆ మొత్తం సర్టిఫికెట్లను రిజిస్టర్/స్పీడ్ పోస్టు ద్వారా లేదా ఈ-మెయిల్ ద్వారా సిద్దిపేట మెడికల్ కళాశాలకు పంపించాలి.
- ఒరిజినల్ ఎంబీబీఎస్, ఎండీ/ఎంఎస్/డీఎన్బీ సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, అనుభవానికి సంబంధించిన సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
Important Points
- అభ్యర్థుల వయసు జూలై 1, 2022 నాటికి 64 సంవత్సరాలు మించకూడదు.
- ప్రస్తుతం అమలులో ఉన్న ఎన్ఎంసీ నిబంధల ప్రకారం డీఎన్బీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
- ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎంపికైన వారం రోజుల్లో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో నమోదు చేసుకోవాలి.
- ఎంపికైన అభ్యర్థులు ప్రస్తుతం ఏదైనా సంస్థలో పనిచేస్తున్నట్టయితే రిలీవింగ్ ఆర్డర్ సమర్పించాలి.
- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర మెడికల్ విభాగాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నవారు దరఖాస్తు చేసుకోకూడదు.
- ఈ ఉద్యోగాలు పూర్తిగా తాత్కాలికమైనవి. కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది కాలంపాటు లేదా మార్చి 31, 2023 వరకు లేదా పదోన్నతులు/రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా భర్తీ చేసేవరకు పనిచేయాల్సి ఉంటుంది.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భవిష్యత్తులో చేపట్టబోయే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయోజనం కల్పించరు.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director,
Government Medical College Siddipet,
Survey No.54,Ensanpalli, Siddipet,
Pincode-502114
వెబ్ సైట్: www.gmcsiddipet.org
Interview Date, Time, Venue
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 02, 2022 (ఉదయం 11 గంటల వరకు)
ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 02, 2022 మరియు ఆగస్టు 03, 2022 (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు)
ఇంటర్వ్యూ స్థలం: Office of the Director, Govt. Medical College, Siddipet.
– GMC Siddipet Recruitment 2022